Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
కొందరికి ఫ్రెండ్స్ ఎందుకు ఉండరు? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే!
ప్రతి ఒక్కరికీ ఫ్రెండ్స్ ఉండాలన్న నియమం ఏమీ లేదు. కొందరు వందల మందితో సందడిగా గడుపుతుంటే, మరికొందరు తమకంటూ ఓ చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుని అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. అయితే ఇలా ఫ్రెండ్స్ లేకుండా ఒంటరిగా ఉండే వారిని సమాజం తరచుగా అపార్థం చేసుకుంటుంది. వారు డిప్రెషన్ లో ఉన్నారని లేదా ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నారని ముద్ర వేస్తుంది. కానీ సైకాలజీ దీనికి పూర్తి భిన్నమైన వాస్తవాలను తెలియజేస్తుంది.

మనస్తత్వ నిపుణులు ఏం చెబుతున్నారు?
నిపుణుల ప్రకారం.. చాలామంది కాలక్రమేణా తమపై తాము విపరీతంగా ఆధారపడటం అలవాటు చేసుకుంటారు. తమ భావోద్వేగాలను, కష్టసుఖాలను ఇతరులతో పంచుకోవడానికి వారు ఇష్టపడరు. ఎలాంటి క్లిష్ట సమస్యనైనా ఇతరుల మద్దతు లేకుండా తమకు తామే పరిష్కరించుకోవాలన్న బలమైన భావన వారిలో ఉంటుంది. క్రమంగా ఈ ఏకాంతమే వారికి ఒక రక్షణ కవచంలా మారుతుంది.
అదే సమయంలో మరికొన్ని మానసిక పరిస్థితులు కూడా ఇందుకు కారణం కావచ్చంట. డిప్రెషన్ ఉన్నవారు సహజంగానే పది మందిలో కలవడానికి ఇష్టపడరు. అలాగే సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ (సామాజిక ఆందోళన) ఉన్నవారు.. ఇతరులు తమను ఎక్కడ తప్పుబడతారో, విమర్శిస్తారో అన్న భయంతో కావాలనే సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటారు.
బాల్యపు గాయాలు.. అతిగా ఆలోచించడం
బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు భవిష్యత్తు సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చిన్నప్పుడు ఎదురైన మోసాలు లేదా తిరస్కరణల వల్ల.. పెద్దయ్యాక ఎవరితోనూ సన్నిహితంగా ఉండలేరు. మళ్లీ ఎక్కడ బాధపడాల్సి వస్తుందో అన్న భయం వారిని కొత్త స్నేహాలు చేయనివ్వదు. దీనికి తోడు ఓవర్ థింకింగ్ (అతిగా ఆలోచించడం) మరో ప్రధాన కారణం. ఎవరైనా ఫ్రెండ్ మెసేజ్ కి ఆలస్యంగా రిప్లై ఇచ్చినా, ముభావంగా మాట్లాడినా.. వీరికి నాపై ఇష్టం పోయింది అని వెంటనే నెగెటివ్ గా ఊహించుకుంటారు. ఈ అతి ఆలోచనల వల్లే వారు నెమ్మదిగా అందరికీ దూరమవుతారు.
సహాయం ఎప్పుడు తీసుకోవాలి?
అందరి ఒంటరితనం ఆందోళన కలిగించేది కాదు. కొందరు పుట్టుకతోనే ఇంట్రోవర్ట్స్(అంతర్ముఖులు). వీరు తమతో తాము గడపడాన్ని అమితంగా ఆస్వాదిస్తారు. వీరికి వందల మంది ఫ్రెండ్స్ అవసరం లేదు, ఒక్కరున్నా చాలు అనుకుంటారు. అయితే స్నేహితులు లేరన్న భావన మీలో నిరంతర విచారం, తీవ్రమైన ఆందోళన, నిరాశ లేదా భయాన్ని కలిగిస్తుంటే మాత్రం దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అకారణంగా ఏడుపు రావడం, జీవితంపై విరక్తి కలగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సైకియాట్రిస్ట్ సంప్రదించాలి.



Click it and Unblock the Notifications
