Latest Updates
-
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా!
మ్యాగీ ఎప్పుడూ వేడివేడిగానేనా? ఒకసారి ఈ చల్లని మ్యాగీ రైతా ట్రై చేయండి!
మ్యాగీ అనగానే మనందరికీ వేడివేడిగా, స్పైసీగా ఉండే నూడుల్స్ మాత్రమే గుర్తొస్తాయి. మ్యాగీతో ఎన్నో రకాల వెరైటీ వంటకాలు చేస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా చల్లని మ్యాగీ రైతా రుచి చూశారా? ఒక్కసారి తింటే మాత్రం దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే. చల్లచల్లగా, డిఫరెంట్‌గా ఏదైనా తినాలనిపిస్తే.. నిమిషాల్లో తయారయ్యే ఈ మ్యాగీ రైతాను కచ్చితంగా ట్రై చేయాల్సిందే.

మ్యాగీ రైతా తయారీకి కావలసిన పదార్థాలు
మ్యాగీ - 1 ప్యాకెట్
తాజా పెరుగు - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
టమాటో - 1
పచ్చిమిర్చి - 1
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
కత్రినా కైఫ్ నాజూకైన అందం వెనుక ఉన్న స్పెషల్ డ్రింక్ ఇదే..ఎలా చేసుకోవాలంటే..
మ్యాగీ రైతా తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి మ్యాగీని ఉడికించుకోవాలి. అయితే మ్యాగీ మరీ మెత్తగా, పేస్ట్ లాగా అయిపోకుండా చూసుకోవాలి. కాస్త పలుకుగా ఉన్నప్పుడే దించి, ఆ నీటిని వడకట్టి మ్యాగీని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని, అందులో పెరుగును వేసి ఎక్కడా ఉండలు లేకుండా క్రీమ్ లాగా బాగా గిలకొట్టాలి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చిని పెరుగులో వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేయాలి.
-చివరిగా, ముందుగా ఉడికించి చల్లార్చుకున్న మ్యాగీని పెరుగు మిశ్రమంలో వేయాలి. నూడుల్స్ విరిగిపోకుండా చాలా సున్నితంగా గరిటెతో కలపాలి. పైన సన్నగా తరిగిన కొత్తిమీర, చిటికెడు జీలకర్ర పొడి చల్లి అలంకరించుకుంటే.. కమ్మటి మ్యాగీ రైతా రెడీ.
-మ్యాగీ నానుకుని బాగా మెత్తబడిపోయి రుచి మారకుండా ఉండాలంటే.. ఈ రైతాను తయారుచేసిన వెంటనే ఆస్వాదించండి.
-దీనిని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవాలనుకుంటే ఇందులో కీరదోస ముక్కలు, క్యాప్సికమ్ లేదా ఉడికించిన స్వీట్ కార్న్ కూడా కలుపుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
