For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 5 రాశుల వారితో జాగ్రత్త... వీరి పగ తీర్చుకునే వరకు నిద్రపోరు...!

|

ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క మనిషిలో కోపం, బాధ, సంతోషం, పగ, ప్రతీకారం అనేవి సాధారణమైన లక్షణాలు. అయితే ఇవన్నీ సందర్భాన్ని ఒక్కో మనిషిలో బయటపడుతూ ఉంటాయి.

అయితే కొందరు వ్యక్తులు సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా అస్సలు తట్టుకోలేరు. తెగ ఫీలయిపోతారు. మరికొందరేమో త్వరగా కోప్పడతారు. వారి కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. అక్కడితో ఆగకుండా.. ఆ కోపానికి కారణమైన వారిపై పగ పెంచుకుంటారు.

ప్రతీకారం తీర్చుకునేంత వరకు ప్రశాంతంగా నిద్రపోరు. అయితే అలాంటి వ్యక్తులెవరో తెలుసుకోవడంలో జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతుంది. దీని ప్రకారం, ద్వాదశ రాశులలో ప్రతి ఒక్క రాశికి దాని సొంత స్వభావం అనేది ఉంటుంది.

రాశిచక్రం స్వభావం, ప్రవర్తన, రాశిచక్రం అధిపతి ఆధారంగా ఏ రాశి వారికి కోపం ఎక్కువగా వస్తుంది.. ఎవరెవరు పగను తీర్చుకోవడంలో ముందుంటారు.. ఎవరెవరు కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!

మేష రాశి..

మేష రాశి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి కుజుడు(అంగారకుడు) అధిపతిగా ఉంటాడు. వీరికి మండే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వీరికి కోపం ఎక్కువగా వస్తుంటుంది. అయితే వీరు ఫ్రెండ్ షిప్ కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అయితే అక్కడ ఏదైనా తేడా వస్తే మాత్రం గొడవ పడటంలో ముందుంటారు. వీరి అహం దెబ్బతినడాన్ని ఏమాత్రం సహించరు. అందువల్ల ప్రత్యర్థులను ఎలాగైనా ఓడించాలని ఎక్కువగా ప్రయత్నిస్తారు. వీరికి క్షమించే గుణం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారితో ఒక్కసారి విభేదాలు తలెత్తితే.. మళ్లీ అవి సాధారణ స్థాయికి చేరుకోవడం చాలా కష్టమవుతుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. అందుకే వీరు చాలా శక్తివంతమైన వారిగా భావిస్తారు. వీరు చాలా విషయాల్లో చురుకుగా ఉంటారు. వీరు అందరితో సక్రమంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీరితో ఎవరైనా గొడవ పెట్టుకుంటే మాత్రం, వారిపై కోపం, పగ పెంచుకుంటారు. వారిపై పై చేయి సాధించేందుకు ఎంత దూరమైనా వెళ్తారు. వీరు ఎవరిపై పగను పెంచుకుంటే.. ప్రతీకారం తీర్చుకునే విషయంలో మంచి, చెడు గురించి అస్సలు ఆలోచించరు. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి కూడా కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎవరితో అనవసరంగా గొడవ పెట్టుకోరు. కానీ వీరు ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటే.. వారిని ఓడించేందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తారు. తమ శత్రువులను వారి అడుగుజాడల్లో నుండి మళ్లిస్తారు. తమ దారిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరి అంతిమ లక్ష్యం శత్రువులను ఓడించడమే. అందుకే ఈ రాశి వారితో చాలా కేర్ ఫుల్ గా ఉండండి.

Mercury Transit in Aries on 16 April:మేషంలోకి బుధుడి సంచారం వల్ల.. ఈ 3 రాశులకు అద్భుత ప్రయోజనాలు..!

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారి స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ తమ పని ఏంటో అదే చూసుకుంటారు. తమ లైఫ్ బ్యాలెన్స్ కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీరికి ఎవరైనా ఏదైనా హాని చేస్తే.. లేదా వీరికిష్టమైన వారికి ఏదైనా హాని కలిగించేందుకు ప్రయత్నిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఆ క్షణం నుండి వారి మనసులో ప్రత్యర్థులను ఫిక్సవుతారు. వారిపై పగ పెంచుకుని.. ప్రతీకారం తీర్చుకునేంత వరకు ప్రశాంతంగా నిద్రపోరు. వారిని ఓడించిన తర్వాతే.. వీరికి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి శని గ్రహం అధిపతిగా ఉంటాడు. అయితే ఈ రాశి ప్రవర్తన చాలా సందర్భాల్లో మంచిగా ఉంటుంది. వీరికి పనిచేసే నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు అన్యాయం చేయడాన్ని అస్సలు ఒప్పుకోరు. వీరి పనుల్లో ఎవరైనా ఆటంకం కలిగిస్తే, వారిపై విపరీతంగా కోప్పడతారు. ఇలాంటివి చాలా ఘోరమైన తప్పులుగా భావిస్తారు. అందుకే అలాంటి వారిని శత్రువుగా భావిస్తారు. అప్పటి నుండి వీరి మనసులో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్సవుతారు. శత్రువులపై ఆధిపత్యం చెలాయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు.

English summary

These Zodiac Signs Revengeful Personality According to Astrology

Here are these zodiac signs revengeful personality according to astrology. Have a look
Story first published: Saturday, April 17, 2021, 16:52 [IST]