Latest Updates
-
ఇంట్లో ఫోన్ చెక్ చేస్తున్నారా? డిజిటల్ నిఘాతో కుటుంబ బంధాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయో తెలుసా? -
ఎండల దెబ్బకు పీరియడ్స్ ఆలస్యమవుతున్నాయా? మహిళలు అస్సలు మిస్ అవ్వకూడని హెచ్చరికలు! -
విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు! భార్యలకు ఊరటనిచ్చే సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇదే -
గర్భిణీలు ఈ తప్పులు చేస్తున్నారా? మీ బిడ్డ ఆరోగ్యం కోసం ఇవి తెలుసుకోండి! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఉదయాన్నే ఈ ప్రోటీన్ రిచ్ పరాఠా ట్రై చేయండి..సొరకాయ రైతాతో కేక! -
ఈ రాశుల వారికి ఈరోజు ధనయోగం.. ఆదాయం పెరగడమే కాదు అదృష్టం కూడా తోడవుతుంది! -
హ్యాపీ హనుమాన్ జయంతి..మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
వైధృతి యోగం ఎఫెక్ట్.. ఈరోజు హైదరాబాద్, విజయవాడ వాసులు ఈ తప్పులు అస్సలు చేయకండి! -
హనుమాన్ దీక్ష విరమణ చేస్తున్నారా? స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలు, ముహూర్తాలు తప్పక పాటించండి! -
చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఉందా?
Today Rasi Phalalu :ఓ రాశి ఉద్యోగులకు ఈరోజు ఆదాయం పెరగొచ్చు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు చాలా నీరసంగా ఉంటారు. ఈ సమయంలో ఎలాంటి పనులపై ఫోకస్ పెట్టలేరు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ తెలివితేటలతో, మీరు డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. మీరు ఈరోజు పాత రుణాలను కూడా తిరిగి చెల్లిస్తారు. మిమ్మల్ని మీరు తాజాగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ :20
లక్కీ టైమ్ : ఉదయం 7:25 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ విశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీరు చాలా సానుకూలంగా ఉంటారు. ఇది మీ పనిని కూడా ప్రభావితం చేస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. మీరు పెద్ద ప్రాజెక్టులో పని చేసే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. వ్యాపారులకు త్వరలో వ్యాపారం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు మీ వ్యక్తిగత జీవితంపై కూడా శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో చిన్న విషయానికే గొడవ పడొచ్చు. ఈ సమయంలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మీ మానసిక ప్రశాంతతకు భంగం కలగొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలను తెలివిగా తీసుకోండి. పని పరంగా ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు కష్టపడాల్సి ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించొచ్చు. దీంతో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకమైన రోజు. మీరు మీ ప్రియమైన వ్యక్తి కోసం ఈరోజు కొన్ని విలువైన బహుమతులను కొనుగోలు చేయొచ్చు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు ఈరోజు అజాగ్రత్తగా ఉండకూడదు. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : లైట్ రెడ్
లక్కీ నంబర్ : 45
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. ఈరోజు మీరు సన్నిహితుల నుండి డబ్బు పొందే అవకాశం ఉంది. మీరు ఉన్నత స్థానాన్ని పొందొచ్చు. మరోవైపు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి ఒప్పందానికి అవకాశం పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ఇంటి సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత నెలకొంటాయి. ఈరోజు మీరు మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :14
లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి విద్యార్థులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఏదైనా కొత్త కోర్సు చేయాలనుకుంటున్నట్లయితే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆదాయంలో పెరుగుదల ఉండొచ్చు. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. లేదంటే మీరు భారీగా నష్టపోతారు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. త్వరలో మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీ వాహనాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :16
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు విశ్వాసం క్షీణించొచ్చు. అయితే మీరు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మరియు ప్రేమను పొందుతారు. మీరు జీవితంలో ఒడిదుడుకులకు భయపడే బదులు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే మేలు జరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు బాధ్యతల భారం పెరుగుతుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :36
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ ప్రణాళికలు ఈరోజు ముందుకు సాగొచ్చు. ఈ రోజు మీ ప్రయాణం శుభప్రదంగా సాగుతుంది. ఉద్యోగులు ఈరోజు కోరుకున్న బదిలీని పొందొచ్చు. విద్యార్థులు ఈరోజు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా టీవీ మరియు మొబైల్ కు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీ ఇంటి వాతావరణం ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఆకస్మిక క్షీణత ఉండొచ్చు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :30
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల ఒత్తిడి కూడా మీపైనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మీరు ప్రశాంతమైన మనసుతో పని చేయాలి. వ్యాపారులు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు న్యాయపరమైన చిక్కుల్లో పడొచ్చు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మరోవైపు ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఆందోళన పెరుగుతుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :35
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు తల్లి లేదా తండ్రి నుండి ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఎక్కువగా ఆలోచించడం మానుకోండి. సరైన సమయం వచ్చినప్పుడు మీ సమస్య పరిష్కారమవుతుంది. ఉద్యోగులు ఈరోజు సకాలంలో కార్యాలయానికి చేరుకోవాలి. స్టాక్ మార్కెట్లో పని చేసే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మందులు, బట్టలు, ఆహార పదార్థాలు తదితర వాటికి సంబంధించిన పనులు చేసే వారు ఆశించిన ఫలితాలను పొందుతారు.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :5
లక్కీ టైమ్ : సాయంత్రం 6:45 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశాన్ని పొందుతారు. మీరు పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే, మీరు పెద్దల సలహా నుండి మంచి ప్రయోజనం పొందొచ్చు. మీరు మీ ప్రస్తుత ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది. త్వరలో మీ కెరీర్లో కొత్త మలుపు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు పొదుపుపై ఫోకస్ పెట్టాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ :18
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు మీరు మీ పనిని శ్రద్ధగా చేయగలుగుతారు. మీకు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు పురోగతికి సంబంధించి కొత్త మార్గాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ భాగస్వామితో అదనపు సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే టీ మరియు కాఫీ వంటి వాటిని తీసుకోవడం మానుకోండి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications