Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
Today Rasi Phalalu : ఈ రాశుల వారికి శృంగారంలో అద్భుతంగా ఉంటుంది...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, పుష్య మాసంలో ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ మాటలపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిది కాదు. ఈరోజు పెద్ద ఖర్చు ఉండొచ్చు. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ బాస్ వైఖరి ఈరోజు కాస్త కఠినంగా ఉంటుంది. మీ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టండి. మొత్తానికి వ్యాపారులకు లాభాలు రావొచ్చు. ప్రేమ జంటలకు ఈరోజు శృంగార దినంగా ఉంటుంది. మీ భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారం అయినా, మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఇది మీకు సరైన ఫలితాలను ఇస్తుంది. మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే, అప్పటివరకు మీరు విజయాన్ని పొందొచ్చు. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో చెడిపోయిన సంబంధాల కారణంగా మీరు ఈరోజు కొంత విచారంగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య చాలా కాలంగా ఉన్న విభేదాలు మిమ్మల్ని ఒకరికొకరు దూరం చేస్తున్నాయి. మీరు మీ సంబంధానికి మరొక అవకాశం ఇచ్చి, మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగించడానికి ప్రయత్నిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగుంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 41
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందొచ్చు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో కఠినంగా ఉంటుంది. మీరు నిరంతరం శ్రమించినా ఆశించిన ఫలితం రాకపోతే నిరాశ చెందాల్సిన పనిలేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీ శ్రమ తప్పకుండా విజయం సాధిస్తుంది. అదే సమయంలో, వ్యాపారుల కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఈరోజు మీరు చాలా పరుగెత్తాల్సి రావొచ్చు. ఈరోజు మీరు ప్రయాణం చేయవలసి రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మానసికంగా, శారీరకంగా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 4:05 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారు ఈరోజు కుటుంబంపై దృష్టి పెట్టగలరు. చాలా కాలం తర్వాత, మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే, ఈరోజు మీకు శృంగార పరంగా మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకుంటారు. మీరు వారి పూర్తి మద్దతును పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి మీ అభినందనలు విని మీరు చాలా సంతోషిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది మరియు పెద్ద ఆర్థిక లాభం ఉంటుంది. ఈరోజు డబ్బు సంబంధిత సమస్యలను అధిగమించొచ్చు. మీరు ఈరోజు ప్రయాణం చేయబోతున్నట్లయితే, చివరి క్షణంలో మీ ప్రణాళికను మార్చుకునే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 45
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారు ఈరోజు ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీలైతే, ప్రతిరోజూ వ్యాయామంతో మీ రోజును ప్రారంభించండి. మీరు మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. ఉద్యోగస్తులకు పురోగతి యొక్క కొత్త తలుపులు తెరవబడతాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, మీ ఆదాయాన్ని పెంచుకోవడం సాధ్యమే. అయితే రానున్న కాలంలో మీపై బాధ్యతల భారం మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ దినంగా ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఈరోజు జీవిత భాగస్వామి మానసిక స్థితి బాగా ఉండదు. వీలైతే, మీ ప్రియమైనవారి కోసం అద్భుతమైనదాన్ని ప్లాన్ చేయండి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులు విద్యపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ విలువైన సమయాన్ని అనవసర విషయాలపై వృధా చేయకండి. వ్యాపారులు ఈరోజు కొత్త వ్యాపార ప్రతిపాదనను పొందొచ్చు. ఈరోజు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. ఈరోజు మీ తల్లి ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆమె పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే, సమయానికి ఆహారం తీసుకోని మీ అలవాటు వల్ల మీకు ఇబ్బంది కలిగిస్తుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 25
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టే మూడ్‌లో ఉంటారు. మీరు చాలా షాపింగ్ చేయొచ్చు. ఈరోజు మీరు ఇంటికి ఖరీదైన వస్తువును కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు నిర్లక్ష్యంగా భావించొచ్చు. ఇది మీ బిజీ షెడ్యూల్ వల్ల కావొచ్చు. మీరు మీ ప్రియమైన వారికి కూడా తగినంత సమయం ఇస్తే మంచిది. ఈరోజు మీరు పని విషయంలో అదృష్టానికి పూర్తి మద్దతునిస్తారు. మీ కష్టాన్ని చూసి, మీ సీనియర్లు మీతో చాలా సంతోషంగా ఉంటారు. త్వరలో దాని ప్రయోజనం పొందే బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మరోవైపు ఈరోజు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మీరు అజాగ్రత్తగా ఉండకపోవడమే మంచిది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని భారం తక్కువగా ఉంటుంది. తద్వారా మీ కోసం తగినంత సమయం లభిస్తుంది. కానీ మీరు మీ ప్రియమైన వారి ఫిర్యాదులన్నింటినీ తొలగించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు పనిపై శ్రద్ధ వహించండి. ఈరోజు తప్పులు చేయకుండా ఉండాలి. వ్యాపారులు ఈరోజు పెద్దగా డీల్స్ చేయొద్దు. అన్ని మూలల నుంచి క్షుణ్ణంగా విచారించిన తర్వాతే మీ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించొద్దు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు కోరుకున్న ప్రాజెక్టులో పని చేసే అవకాశం లభిస్తుంది. మీ భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలు పొందగలరు. ఆర్థిక పరమైన విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు సులభంగా జారిపోవచ్చు. ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు కొంత పెద్ద విజయాన్ని పొందవచ్చు. ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. సాయంత్రం వేళలో కొన్ని శుభవార్తలు రావడంతో మీ మనసు ఆనందంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా శక్తివంతంగా మరియు రిఫ్రెష్‌గా ఉంటారు.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చు. ఇతరులు చెప్పేవాటికి ఎక్కువగా ప్రభావితం కావొద్దు. మీరు ఆఫీసులో మీ ముఖ్యమైన పనిని రేపటికి వాయిదా వేస్తే, ఈరోజు మీ యజమాని మీపై కోపంగా ఉండొచ్చు. అది మీ పురోగతిపై చెడు ప్రభావం చూపుతుంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారి నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో వారికి మంచి సంరక్షణ అవసరం. ఆర్థిక పరంగా ఈరోజు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. ఇతరులను సంతోషపెట్టడానికి ఖర్చు చేసే మీ అలవాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో మీ స్థానం బలంగా ఉంటుంది. మీ స్వంత గుర్తింపును సంపాదించుకోవాలనే మీ కల ఈరోజు నెరవేరుతుంది. ఇదంతా మీ నిరంతర కృషి ఫలితం. వ్యాపారులు కూడా ఆశించిన ఫలితాలను పొందొచ్చు. వివాహితులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఆర్థిక రంగంలో మంచి ఫలితాలను పొందొచ్చు. మీ డబ్బు చాలా కాలంగా ఎక్కడో నిలిచిపోయినట్లయితే, ఈరోజు మీరు కొంత ఉపశమనం పొందొచ్చు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని గడపొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు పనిపై దృష్టి పెట్టకపోతే, ఈరోజు మీ ఉన్నతాధికారులు మీపై కోపం తెచ్చుకుంటారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. మరోవైపు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా, ఈరోజు మీకు మంచిగా అనిపించొచ్చు. వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మీ కారణంగా మీ జీవిత భాగస్వామి బాధపడొచ్చు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు కొన్ని క్రీడలలో పాల్గొనచ్చు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











