For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఈరోజు ఈ రాశుల వారి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి...!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

వృషభంలో బుధుడి అస్తమయం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు ఎక్కువ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు తక్కువ శ్రమతో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాలి. మీకు ఆఫీసులో పోటీ పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు చాలా లాభాలుంటాయి. పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ప్లాస్టిక్, ఇనుము, కలప, ఆయిల్ డెయిరీ మొదలైన వాటికి సంబంధించిన పని చేసే వ్యక్తులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ బడ్జెట్ కంటే ఎక్కువ దూరం వెళ్లొద్దు. ఈరోజు మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీకు పని ఒత్తిడి పెరిగి, మీరు బాగా అలసిపోయినట్లు భారంగా అనిపించొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో సహోద్యోగులతో మనస్పర్దలు రావొచ్చు. ఈరోజు మీరు పనిలో ఎక్కువ అనుభూతి చెందలేరు. మరోవైపు వ్యాపారులు ఆర్థిక పరిమితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే ఆలోచించకుండా ఖర్చు చేయడం మానుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

Lunar Eclipse May 2022 Astrology :ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వేళ ఈ రాశులకు చాలా కష్టాలు...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొన్నట్లయితే, మీరు అద్భుతమైన విజయం సాధించొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్త వినిపించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి ఉదయం 10:25 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉంటే, ఎక్కువ ఖర్చులవుతాయి. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మీ ఆదాయం బాగుంటుంది. పెరుగుతున్న ఖర్చులు మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పేలా చేస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారి నుండి మానసిక మద్దతు పొందుతారు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ఆందోళనలు ఉంటాయి. ప్రత్యేకించి వ్యాపారులు ఈరోజు చాలా నిరాశ చెందుతారు. అయితే ఇలాంటి ఒడిదుడుకులకు భయపడకుండా ధైర్యంగా, ఓర్పుతో వ్యవహరించాలి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి. ఎందుకంటే బాస్ ఫోకస్ మీపైనే ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కుటుంబసభ్యుల మద్దతు పొందుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

ఈ 5 రాశుల వారిని పెళ్లి చేసుకోవడం మంచిదే... ఎందుకో తెలుసా?ఇందులో మీ రాశి ఉందా?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు పనికి సంబంధించి కొన్ని శుభవార్తలను పొందే బలమైన అవకాశం ఉంది. ఈరోజు మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో ఈరోజు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :29

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది. మీరు అవివాహితులైతే, మీ పెళ్లి గురించి ఇంట్లో చర్చించొచ్చు. మీరు మీ తోబుట్టువులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. మరోవైపు వ్యాపారవేత్తలు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మీరు భాగస్వామ్యంతో పని చేస్తే, ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు పనిలో కొన్ని అడ్డంకులు ఎదురుకావొచ్చు. మీ కష్టాలన్నీ తీరతాయి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీకు ఇంటి సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం తీవ్రమవుతుంది. ఈరోజు మీరు చాలా ఆందోళన చెందుతారు. ఇలాంటి సందర్భాల్లో మీరు ఉత్సాహంతో కాకుండా శ్రద్ధతో వ్యవహరించాలి. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో బాస్ యొక్క కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. మీరు మీ తండ్రితో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించొచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :38

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 10:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ మానసిక అనుబంధం పెరుగుతుంది. మీరు మీ ప్రియమైన వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తుంటే, ఈరోజు సమయం మంచిగా ఉంటుంది. అయితే మీ బడ్జెట్ ను ద్రుష్టిలో ఉంచుకునే ఖర్చులు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు పెండింగ్ పనుల భారం తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రోజ్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో పనికి సంబంధించిన వారికి ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. త్వరలో మీరు మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులను చూస్తారు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడుపుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారితో మీ సాన్నిహిత్యం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -13 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published: Friday, May 13, 2022, 5:00 [IST]