Latest Updates
-
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్!
Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు చాలా ఓపికగా పని చేయాలి..
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభప్రదంగా ఉంటుంది. అయితే విద్యార్థులకు విద్యలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నతాధికారులతో మంచి అనుబంధం కలిగి ఉండాలి. డెయిరీ సంబంధిత రంగంలో పని చేసే వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ :11
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు సవాళ్లు ఎదురవుతాయి. మీ వ్యాపారం తగ్గుముఖం పట్టొచ్చు. మీరు ఓపికతో పని చేయాలి. మీరు తొందరపడి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం మానుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి అవకాశం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసర చర్చ మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయండి. వ్యాపారులు కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇటీవల ఏదైనా కొత్త పనిని ప్రారంభించి, సరైన ఫలితాలు రాకపోతే, మీరు ఓపికతో పని చేయాలి. సరైన సమయం వచ్చినప్పుడు, పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో సామరస్యం ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారి మానసిక మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :18
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో వ్యాపారులు కొత్త స్టాక్స్ కోసం ప్లాన్ చేస్తుంటే, ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మందులు, ఐరన్, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. పైఅధికారుల మద్దతు కారణంగా మీరు సానుకూలతను అనుభవిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మరింత పొదుపు చేయగలుగుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారు ఈరోజు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే మీ సమస్యలు పెరుగుతాయి. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, మీ ప్రియమైన వారి సలహాను కచ్చితంగా తీసుకోండి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :27
లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో బాస్ యొక్క మద్దతు లభిస్తుంది. మిమ్మల్ని ఈరోజు మెచ్చుకుంటారు. వ్యాపారులకు ఈరోజు లాభాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఈరోజు విశేష ఫలితాలొస్తాయి. మీ ఆర్థిక పరిస్థితులు మంచిగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :3
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11:05 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఈరోజు బంగారం మరియు వెండికి సంబంధించిన పని చేసే వ్యక్తులకు ఈరోజు చాలా బాగుంటుంది. వ్యాపారులకు ఈరోజు పురోగతి ఉంటుంది. మీరు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. ఉద్యోగులు ఈరోజు కోరుకున్న బదిలీని పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ప్రయోజనాలు దక్కొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన చాలా బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :15
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఏదైనా పెద్ద డీల్ చేయబోతున్నట్లయితే, మీరు తెలివిగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ అలవాట్లు మీపై ప్రభావం చూపుతాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ సౌకర్యల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం మానుకోండి.
ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ :8
లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో పురోగతి సంకేతాన్ని పొందొచ్చు. ఈరోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు సానుకూల భావాన్ని కూడా అనుభవిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే, మీరు మంచి ఉపాధి అవకాశాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ :35
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఎవరైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లయితే, మీరు సానుకూల ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. మీరు పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని సిద్ధం చేసుకోండి. మీరు కచ్చితంగా విజయం పొందుతారు. చిరు వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొస్తాయి. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :20
లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. మీ అన్ని ముఖ్యమైన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ఇంటి సభ్యుల మద్దతును పొందుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారులో గౌరవంగా వ్యవహరించాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీ ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :5
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు వ్యాపార నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు వారితో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్య పరంగా ఈరోజు బలహీనంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :1
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 6 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











