Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
ధనస్సులోకి శుక్రుడి ఎంట్రీ.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...
ధనస్సులోకి శుక్రుడి ప్రవేశంతో రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహం వైవాహిక జీవితం, ప్రేమ, అందం, భౌతిక సుఖాలకు కారకంగా పరిగణిస్తారు.

ఎవరి జాతకంలో అయితే శుక్రుడి స్థానం బలంగా ఉంటుందో.. వారి జీవితంలో ప్రేమకు ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే విలాసాలలో కూడా ఎలాంటి సమస్యా ఉండదు. అలాంటి శుక్రుడు అక్టోబర్ 30వ తేదీన అంటే ఆదివారం నాడు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఇదే రాశిలో డిసెంబర్ 8వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఏ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏ రాశి ప్రతికూలంగా ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి తొమ్మిదో స్థానం నుండి రవాణా చేయన్నాడు. ఈ కాలంలో మేష రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు భౌతిక సుఖాలను అనుభవిస్తారు. మీ ప్రేమ జీవితంలో సానుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా మాధుర్యం పెరుగుతుంది. మొత్తానికి ఈ సమయం మీకు చాలా లక్కీగా ఉంటుంది.

వృషభ రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి ఎనిమిదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేసేస్తారు. మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ పరంగా అంతా బాగుంటుంది. అయితే ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు.

మిధున రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి ఏడో పాదం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మిధున రాశి వివాహితులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు రొమాంటిక్ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఈ కాలంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు పాత స్నేహితులను కూడా కలుస్తారు.

కర్కాటక రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి ఆరో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో కర్కాటకరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీరు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు చాలా ఓపికగా ఉండాలి. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యా ఉండదు.

సింహ రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి ఐదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో సింహ రాశి వారు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వింటారు. దీంతో మీరు చాలా గర్వపడతారు. మరోవైపు ఈ కాలంలో మీరు భౌతిక సౌకర్యాల కోసం డబ్బులను ఖర్చు చేయొచ్చు. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు పాత పెట్టుబడి నుండి లాభం పొందే అవకాశం ఉంది.

కన్య రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి నాలుగో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో కన్య రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో ఎదురైన సమస్యలన్నీ తీరిపోతాయి. మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఈ సమయంలో మీరు భూమి లేదా ఏదైనా ఆస్తిని కూడా కొనుగోలు చేయొచ్చు. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.

తుల రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి మూడో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో తుల రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీరు కొత్త వనరుల నుండి ఆదాయం పొందుతారు. మీ తోబుట్టువుల నుండి సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు పొందే బలమైన అవకాశం ఉంది.

వృశ్చిక రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి రెండో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. ఆర్థిక పరంగా మీరు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు. మీరు ఈ సమయంలో ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు.

ధనస్సు రాశి..
శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశించిన సమయంలో.. ఈ రాశి వారికి ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. మీ కుటుంబ వాతావరణం మంచిగానే ఉంటుంది. అయితే వారి నుండి మీకు ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

మకర రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి పన్నెండో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. అయితే తొందరపాటులో నిర్ణయం తీసుకోవద్దు. ఈ సమయం మీకు ఆస్తికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీరు మీ పనికి సంబంధించి కొన్ని కొత్త మార్గాలను పొందుతారు. మీ తుది నిర్ణయం తెలివిగా తీసుకోవాలి.

కుంభ రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి పదకొండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులు పొందొచ్చు. మీ ప్రేమ జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించొచ్చు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యా ఉండదు.

మీన రాశి..
శుక్రుడు ఈ రాశి నుండి పదో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మీన రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.
శుక్రుడు అక్టోబర్ 30వ తేదీన అంటే ఆదివారం నాడు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో డిసెంబర్ 8వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.



Click it and Unblock the Notifications