Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
వైరల్ వీడియో : నీళ్లలో నిలబడే మనిషిని ఎప్పుడైనా చూశారా?
కుంగ్ ఫూలో నిపుణుడు అయిన జాంగ్ చెంగ్ కియాంగ్ తన విన్యాసాలకు సంబంధించి ఓ వీడియోను రూపొందించాడు.
ప్రపంచంలో ఏ మనిషి అయినా నేలపై నడుస్తాడు. అయితే కొందరు మాత్రం అందరి కంటే భిన్నంగా నడుస్తుంటారు. అలాంటి వారిని మనం సర్కస్ లో లేదా ఎక్కడైనా మ్యాజిక్ షోల వంటి వాటిలో చూస్తుంటాం. ఉదాహరణకు కొంత ఎత్తులో తాడును ఆ మూల నుండి ఈ మూల వరకు వేలాడదీసి నడిచే వారిని చూసుంటాం. అదే విధంగా కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉండే భవనాల మధ్య ఒక చిన్న రాడ్ పెట్టి అందులో నడవటం కూడా మనం చూసుంటాం.

అలాగే సింగిల్ ఇటుకతో నిర్మించిన గోడపై నిటారుగా నడవటం కూడా మీరు ఇదివరకే చూసుంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే అతను ఎక్కడ నడిచాడో.. ఎక్కడ ఎగురుతాడో చెబితే మీరు షాకవ్వడం ఖాయం. చైనాకు చెందిన ఈ వ్యక్తి ఏకంగా నీళ్లలో నడవటం మొదలెట్టాడు. కొన్ని సెకన్ల పాటు నీళ్లల్లో నిలబడుతున్నాడు. అంతేకాదు నీళ్లలో నిలబడి గాల్లోకి సైతం అవలీలగా ఎగురుతున్నాడు. అలాగే చెట్టు నుండి కొంత ఎత్తులో కట్టేసిన మూడు నీటి ప్యాకెట్లను సైతం తన రెండు కాళ్లతో గాల్లోకి ఒకేసారి ఆ మూడింటిని పగులగొడుతున్నాడు.
కుంగ్ ఫూలో నిపుణుడు అయిన జాంగ్ చెంగ్ కియాంగ్ తన విన్యాసాలకు సంబంధించి ఓ వీడియోను రూపొందించాడు. నేల మీద నుండి దాదాపు నాలుగైదు అడుగుల ఎత్తు ఉన్న గోడ మీదకి నేరుగా దూకేస్తున్నాడు. అంతేకాదు కొన్ని సెకన్ల పాటు గాల్లో నిలబడటం వంటివి కూడా చేస్తున్నాడు.

చైనాకు చెందిన చెంగ్ కియాంగ్ కుంగ్ ఫూ విద్యతో పాటు కర్ర సాములో పట్టు సాధించాడు. కర్రసాము గురించి మీరు ఇప్పటికే అనేక వీడియోలను చూసి ఉంటారు. అయితే చైనాకు చెందిన ఈ వ్యక్తి కర్రసామును విభిన్నంగా చేస్తున్నాడు. నీళ్లలో నిలబడి కర్రసాము చేస్తూ కొన్ని సెకన్ల పాటు కర్రను నీటిలో నిలబెట్టి తాను కర్ర సహాయంతో గాల్లో నిలబడే ప్రయత్నం కూడా చేశాడు. అంతే కాదండోయ్ కత్తిని సైతం బాగా తిప్పుతాడు. అది కూడా రెండు కత్తులను ఒకేసారి తిప్పుతున్నాడు. ఇవన్నీ చెబుతుంటే మీకు నమ్మశక్యంగా లేదా కదా. అయితే ఈ వీడియోను చూడండి..



Click it and Unblock the Notifications
