Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Vrushabha Rasi Ugadi Rasi Phalalu 2022: ‘శుభకృత’ ఏడాదిలో వృషభ రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
2022లో ఉగాది పండుగ సందర్భంగా వృషభ రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ఇటీవలే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాం.. అదే సమయంలో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-8, వ్యయం-8
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం, వ్యయం సమానంగా ఉంటాయి. మీరు ఊహించిన మేరకు రాబడి ఉంటుంది. అదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. మరోవైపు వృషభ రాశి వారు తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించరు. వారిని అస్సలు పట్టించుకోరు. కృతిక నక్షత్రం 2,3,4 మూడు పాదాలు, రోహిణి నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 రెండు పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలుంటాయి.

రాజపూజ్యం-6, అవమానం-6
ఈ ‘శుభకృత్' నామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఏప్రిల్ మాసంలో కేతువు ఏడో స్థానంలో అంటే తులరాశిలో సంచారం చేయడం వల్ల రుణాల విషయంలో విముక్తి లభిస్తుంది. అలాగే శత్రువులపై వీరు ఆధిపత్యం చెలాయిస్తారు. మరి కొందరు శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు మీకు ఏమైనా అప్పులుంటే.. వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

గురు బలం..
తెలుగు నూతన సంవత్సరం తొలి నెల అంటే ఏప్రిల్ మాసంలో గురువు మీన రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. గురు బలం లభిస్తుంది. ఈ కారణంగా ఉద్యోగులకు పురోగతి దొరుకుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. సకాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ దక్కుతాయి. వివాహం కాని వారికి పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని కూడా నిర్వహిస్తారు.

ఈ ఏడాది శుభ ఫలితాలు..
ఈ సంవత్సరం రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్ర గ్రహాలు తమ స్థానాలను మారడం వల్ల ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే.. ఈ సంవత్సరం ఎక్కువ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించొచ్చు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. వ్యవసాయ రంగంలో ఉండే వారికి మంచి వ్యవసాయ ఉత్పత్తులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది.

ప్రతికూల ఫలితాలిలా..
ఈ రాశి వారికి ఈ ఏడాది ప్రతికూల ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే.. అది మేషరాశిలో రాహువు సంచారం కారణంగా వ్యయం పెరిగే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగొచ్చు. విదేశీ వ్యవహారాల విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. పదో స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగులకు, పని చేసే వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది.

పరిహారాలివే..
ఈ సంవత్సరంలో రాహువు ప్రతికూల ఫలితాలను అధిగమించేందుకు విజయవాడలోని కనక దుర్గమ్మ ఆలయంలో లేదా మైసూరులోని చాముండేశ్వరి దేవి గుడిలో కుంకుమ అర్చన చేయించాలి. అలాగే పదో స్థానంలో సంచరిస్తున్న శని భగవానుడి అనుగ్రహం పొందడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయంలో తమలాపాకులతో పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications