Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 9 నుండి 15వ తేదీ వరకు...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం కష్టంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పని విషయంలో కొంత ఒత్తిడికి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే మీరు మానసికంగా బలంగా ఉంటారు. కాబట్టి క్లిష్ట పరిస్థితులకు భయపడకుండా బలంగా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అవసరమైతే మీరు మీ ప్రియమైన వారి సహాయం కూడా తీసుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ప్రేమ విషయంలోనూ కొన్ని సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్: రెడ్
లక్కీ నంబర్ :24
లక్కీ డే : శనివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)
ఈ వారం ఈ రాశి వారికి పనిలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఏ రంగంలో అయినా మీరు ఉత్తమంగా ఇవ్వగల సామర్థ్యం మీకు ఉంది. శృంగార జీవితంలో ఈ వారం మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం మీరు ప్రేమలో మునిగి తేలుతారు. ఎందుకంటే మీ కుటుంబం నుండి మీ ప్రేమకు మద్దతు లభిస్తుంది. మీరు వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉంటుంది. ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :12
లక్కీ డే : శుక్రవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)
ఈ వారం ప్రారంభంలో మీకు చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారం ఆర్థిక పరంగా పెద్ద ప్రయోజనాన్నే పొందుతారు. పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే వారం మధ్యలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉంటారు. వారి ఒత్తిడి మీ విశ్వాసాన్ని తగ్గిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో పెద్ద పోరాటం చేయవచ్చు. దీని వల్ల ఇంటి వాతావరణం సరిగా ఉండదు. అవివాహితులకు సంబంధం విషయంలో ఈ వారం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 4
లక్కీ డే : సోమవారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)
ఈ వారం ఆర్థిక పరంగా మీపై గణనీయమైన ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆదాయం తీవ్రంగా పడిపోయే అవకాశం ఉంది. అందుకే డబ్బు విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ సంబంధం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే, మీ దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఏదైనా సమస్య పెద్దగా ఉందని అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
లక్కీ కలర్: బ్రౌన్
లక్కీ నంబర్ :25
లక్కీ డే : గురువారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)
ఈ రాశి వారు ఈ వారం కుటుంబంపై శ్రద్ధ చూపుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు వారితో ప్రయాణించే అవకాశం పొందుతారు. వివాహ జీవితంలో ఈ కాలంలో జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారి పట్ల మీ ప్రేమను వ్యక్తపరచటానికి, మీరు కొన్ని మంచి ప్రణాళికలు చేయవచ్చు. వన్ సైడ్ లవ్ పేరిట సమయాన్ని అనవసరంగా వృథా చేయకండి. మీరు ఒకరిని ఇష్టపడితే, మీరు మొదట వారి హృదయాన్ని కూడా తెలుసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్: వైట్
లక్కీ నంబర్ : 9
లక్కీ డే : ఆదివారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ఈ వారం చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌లో పనిచేస్తుంటే, ఈ వారం మీరు దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ వారంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారుస్తులు తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ వైవాహిక జీవితంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఆర్థికపరంగా ఈ వారం బలంగా ఉంటుంది. ఈ వారం ఒత్తిడికి దూరంగా ఉండండి. మీరు శారీరకంగా కూడా బలంగా ఉంటారు.
లక్కీ కలర్: ఆరెంజ్
లక్కీ నంబర్ :10
లక్కీ డే : బుధవారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)
ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగా ఉంటారు. ఈ సమయంలో మీరు ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అయినా మీరు మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ సహోద్యోగుల నుండి ఎక్కువగా ఆశించకూడదు. మీ పనిని సొంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ వారం ఆదాయ సంబంధిత సమస్యలు మీకు ఎదురవుతాయి. దీని వల్ల మీ పనులు పెండింగులో పడిపోవచ్చు. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగా ఉంటాయి. మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురుకావచ్చు. అప్రమత్తంగా ఉండండి.
లక్కీ కలర్: పింక్
లక్కీ నంబర్ : 8
లక్కీ డే : మంగళవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)
ఈ రాశి వారు ఈ వారం కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన చర్చలు జరపవచ్చు. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీరు సానుకూల శక్తితో ఉంటారు. వ్యాపారుస్తులు ఈ వారం మంచి ప్రయోజనాలను పొందవచ్చు. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీకు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 32
లక్కీ డే : శుక్రవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం శృంగార జీవితం పరంగా చాలా ముఖ్యమైనది. అయితే, మీరు కొంత ధైర్యం చూపించకపోతే, మీరు నిరాశ చెందుతారు. ఈ వారం మీరు ఒకరిని ఇష్టపడితే, ప్రేమ ప్రతిపాదన చేయడంలో అస్సలు భయపడకండి. పూర్తి విశ్వాసంతో మాట్లాడండి. ఎందుకంటే మీరు సానుకూల సమాధానం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈ వారం బలంగా ఉంటుంది. ఈ కాలంలో తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్: స్కై బ్లూ
లక్కీ నంబర్ :30
లక్కీ డే : సోమవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయితే పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు అన్ని ప్రయత్నాలను చాలా ధైర్యంగా చేస్తారు. కొన్నింటిలో రిస్క్ కూడా తీసుకుంటారు. మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. కానీ మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపలేరు. ఈ సమయంలో మీరు పెద్ద పెట్టుబడి కూడా చేయవచ్చు. ఈ వారం కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు. ఈ వారం మొత్తం మీ శృంగార జీవితం చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 8
లక్కీ డే : గురువారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఏదైనా పాత రుణాలు కూడా పొందే అవకాశం ఉంది. ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కువ సేపు కూర్చోకుండా, తేలికపాటి వ్యాయామం చేయండి. మీరు తగినంతగా నిద్ర పోవాలి. మీరు ఈ వారం కుటుంబంతో చాలా సరాదాగా గడుపుతారు. మీరు ఇంటి పెద్దల ప్రేమను పొందుతారు. చిన్నవారు మిమ్మల్ని గౌరవిస్తారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 2
లక్కీ డే : సోమవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)
ఈ రాశి వారు ఈ వారం అన్ని విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎలాంటి సమస్యలనైనా ఇట్టే పరిష్కరించగలరు. ఈ వారం శృంగార జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు నిరాశ చెందవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం కష్టంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా ఒత్తిడిని తీసుకోకుండా ఉండాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 10
లక్కీ డే : ఆదివారం



Click it and Unblock the Notifications











