Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఈ వారం మీ రాశి ఫలాలు జూన్ 5 నుండి జూన్ 11వ తేదీ వరకు..
రాశులను బట్టి వారి దిన, వార ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారు ఈ వారం చివరిలో పనికి సంబంధించిన ప్రయాణం కూడా చేయవలసి ఉంటుంది. మీ ప్రయాణం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం డబ్బు పరంగా మంచిగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈ సమయం చాలా ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల ఈ కాలంలో మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. ఇలా అన్ని రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది? ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. అన్ని రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ కాలంలో తమ పనిపై పూర్తిగా దృష్టి పెట్టడం మంచిది. ఇతర విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టొద్దు. ఇది మీ సమయాన్ని వృథా చేస్తుంది. మీ ముఖ్యమైన పని అసంపూర్తిగా ఉంటుంది. వారం మధ్యలో మీపై ఆకస్మికంగా పని భారం పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు ముందుగానే మానసికంగా సిద్ధంగా ఉండాలి. వ్యాపారులకు వారం ప్రారంభంలో చాలా బాగుంటుంది. మీరు పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. మీరు వారం చివరిలో పనికి సంబంధించిన ప్రయాణం కూడా చేయవలసి ఉంటుంది. మీ ప్రయాణం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం డబ్బు పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈ సమయం చాలా ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల ఈ కాలంలో మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :11
లక్కీ డే : శనివారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రత్యేకించి మీ పని స్టేషనరీ, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటికి సంబంధించిన వారికి మంచిగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులు కార్యాలయంలో తమ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. వారంలోని ప్రారంభ రోజులు మీకు మంచిగా ఉంటాయి, కానీ తరువాతి సమయం మీకు కొన్ని పెద్ద సవాళ్లను తీసుకురావచ్చు. మీరు ఇటీవల ఉద్యోగంలో చేరినట్లయితే, మీరు కష్టపడి పనిచేయాలి, ఈ సమయం మీకు డబ్బు పరంగా మిశ్రమంగా ఉంటుంది. మీకు ఆస్తమా సమస్య ఉంటే, మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించవచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :2
లక్కీ డే : బుధవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)
ఈ రాశి వారిలో పెద్ద వ్యాపారస్తులు ఈ కాలంలో చర్చలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. అహంకారం మరియు ఘర్షణ వల్ల నష్టం మీకే వస్తుంది. చిరు వ్యాపారులు మంచి లాభాలను ఆశించొచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా కీలకం కానుంది. ఈ కాలంలో మీరు కోరుకున్న బదిలీని పొందొచ్చు. ప్రత్యేకించి మీరు ఈ సమయంలో ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేస్తే, తొందరపడకండి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ప్రియమైన వారితో తగినంత సమయం గడపడానికి అవకాశం పొందవచ్చు. కొంతకాలంగా మీకు కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, అజాగ్రత్తగా ఉండకండి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :4
లక్కీ డే : ఆదివారం

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఖర్చుల జాబితా పెరగొచ్చు. మీరు మీ ఇంటి ఖర్చులను తగ్గించుకోలి. మీరు పొదుపుపై ఎంత ఎక్కువ దృష్టి సారిస్తే అంత మంచిది. మీరు వ్యాపారులైతే మరియు మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుంటే, ఈ కాలంలో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. ఉద్యోగులకు తమ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో ఉంటాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :10
లక్కీ డే : సోమవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)
ఈ రాశి వారిలో ఈ వారం ఉద్యోగులకు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు మీ ప్రమోషన్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే, మీరు మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. సానుకూలంగా ఉండండి మరియు కష్టపడి పని చేయండి. మీరు మీ కష్టానికి తగిన ఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. వ్యాపారులకు ఈ వారం చాలా బిజీగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీ ఈ ప్రయాణం చాలా ముఖ్యమైనది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు అనుబంధం అలాగే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ సమయం మీకు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :18
లక్కీ డే : బుధవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయ నియమాలను కచ్చితంగా పాటించాలి. మీ అజాగ్రత్త మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మీపై పనిభారం ఎక్కువగా ఉంటే, ప్రణాళిక ప్రకారం మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ ఆలస్యం మీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. వారంలోని ప్రారంభ రోజులు వ్యాపారులకు సవాలుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో, చట్టపరమైన విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అలాగే మీరు చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. మీరు విదేశీ కంపెనీలకు సంబంధించిన పనులు చేస్తే, మీరు వారం చివరిలో మంచి లాభాలను పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈ సమయంలో గుండె సంబంధిత రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కోపం మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ :22
లక్కీ డే : సోమవారం

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏవైనా పెద్ద చింతలను వదిలించుకోవచ్చు. మీరు ఇప్పుడు మానసికంగా మెరుగ్గా ఉంటారు. ఉద్యోగులకు ఈ సమయంలో మీ కెరీర్‌లో కొత్త మలుపు రావచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యాపారులకు ఈ వారం చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీరు మంచి పెట్టుబడి అవకాశాన్ని పొందవచ్చు. భవిష్యత్తులో ఆశించిన ఫలితాన్ని పొందే బలమైన అవకాశం ఉంది. మరోవైపు, మీరు ఇటీవల ఏదైనా నష్టాన్ని చవిచూస్తే, ఈ సమయంలో దాన్ని భర్తీ చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు థైరాయిడ్ సమస్య ఉంటే, మీరు అజాగ్రత్తగా ఉండకూడదు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ :15
లక్కీ డే : ఆదివారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)
ఈ రాశి వారిలో ఈ వారం ఫైనాన్స్‌కు సంబంధించి పని చేసే వ్యక్తులకు కొంత సవాలుగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్ల తప్పుడు పరిణామాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ సమయంలో రవాణాకు సంబంధించిన వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారం చివరిలో, పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు ప్రశాంతమైన మనస్సుతో మీ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. వారాంతంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీ ప్రియమైన వ్యక్తిని ఒత్తిడి నుండి దూరంగా ఉంచాలి. ఆరోగ్య పరంగా ఈ వారం కొన్ని సమస్యలు ఉంటాయి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :4
లక్కీ డే : గురువారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు కొత్త స్టాక్‌ల కోసం ప్లాన్ చేస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మరియు మీ మార్గంలో ఆర్థిక సమస్యలు వస్తున్నట్లయితే, త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది మరియు మీ ప్రణాళిక ముందుకు సాగుతుంది. ఆన్‌లైన్ వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలను పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వ్యక్తులు కూడా పురోగమిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనట్లు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఖర్చుల జాబితా పెరగనివ్వొద్దు. ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :4
లక్కీ డే : శనివారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)
ఈ రాశి వారిలో స్టాక్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరుల సూచనల మేరకు మీ ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకండి, లేకుంటే లాభానికి బదులు నష్టం రావచ్చు. ఈ వారంలో మీరు చాలా చురుకుగా ఉంటారు మరియు మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. మీ సానుకూలత మరియు కృషి ద్వారా ఉన్నతాధికారులు చాలా ఆకట్టుకుంటారు. మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ప్రేమ మరియు అనుబంధం అలాగే ఉంటుంది. ఈ కాలంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలరు. ఈ రాశికి చెందిన గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ పనీ చేయకూడదు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :5
లక్కీ డే : మంగళవారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)
ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదాన్ని పరిష్కరించుకోవడం వల్ల ఈ కాలంలో మీకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీరు తల్లిదండ్రుల ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీరు పెళ్లికానివారు మరియు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యుల ఆమోదం పొందవచ్చు. ఈ రాశికి చెందిన వివాహితులకు ఈ వారం చాలా శృంగారభరితంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులు ఈ కాలంలో సహోద్యోగుల మద్దతు కూడా పొందుతారు. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ :17
లక్కీ డే : శుక్రవారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)
ఈ రాశి వారిలో వ్యాపారులు తమ పనిలో మార్పులు చేయాలి. అప్పుడే మీరు ఈ కాలంలో విజయాన్ని పొందొచ్చు. ఈ మార్పులు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రమాదకర వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు మీ అన్ని పనులను పూర్తి శ్రమతో మరియు అంకితభావంతో పూర్తి చేస్తారు, అలాగే కార్యాలయంలో మీ స్థానం కూడా బలంగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు నష్టపోయే సూచనలు ఉన్నాయి. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్య పరంగా ఈ సమయం మీకు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మీ ఆరోగ్యం బాగాలేకపోతే విశ్రాంతిపై దృష్టి పెట్టాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :12
లక్కీ డే : సోమవారం
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











