For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు 17 నుండి మే 23వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.

Weekly Rashi Phalalu

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి.

మీ రాశిని బట్టి ఏ వయసులో మీరు వివాహం చేసుకోవాలో తెలుసుకోండి...!

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగా గడపబోతున్నారు. ఈ వారం మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ పనిని చాలా తెలివిగా మరియు శాంతియుతంగా చేయాలి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మీ ఆందోళన పెరుగుతుంది. అయితే పూర్తి సానుకూలతతో పనిచేయడం మంచిది. వారం మధ్యలో మీకు కష్టమవుతుంది. మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతే, నిరాశ చెందకుండా ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా నష్టాలను భరించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే, లాక్ డౌన్ కారణంగా మీ పనులు నిలిచిపోవచ్చు. మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 16

లక్కీ డే : శుక్రవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మీరు మీ పనిలో కూడా పూర్తి అనుభూతి చెందుతారు. దాని ఫలితంగా మీరు మీ పనులన్నీ వేగంగా పూర్తి చేయగలుగుతారు. ఈ కాలంలో వ్యాపారులు మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో నిరుద్యోగులకు కష్టంగా ఉంటుంది. కానీ ఎక్కువగా చింతించకండి. త్వరలో మీకు కొన్ని మంచి మరియు ఉత్తమ ఎంపికలు ఉంటాయి. ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. మీరు చాలా కష్టపడి పని చేస్తారు. మీరు కచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 30

లక్కీ డే : గురువారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. మీరు ఈ వారం చాలా కష్టపడి పని చేయాలి. ఉద్యోగం విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారులు ఈ వారం మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ వ్యాపారం కూడా వేగంగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం ఎక్కువగా ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 11

లక్కీ డే : మంగళవారం

చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేస్తే మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు...చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేస్తే మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు...

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అయితే మీరు ఓపికగా పని చేయాలి. మరోవైపు ఈ వారం చాలా విషయాల్లో పూర్తి ఉత్సాహంతో ముందుకు వెళతారు. వ్యాపారులకు ఈ వారం కచ్చితంగా లాభం వస్తుంది. ఉద్యోగులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం, సోమరితనం వంటివి మానుకోవాలి. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ డే : ఆదివారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారు ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. దీని వల్ల మీరు నిరాశ చెందే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారులు ఈ వారం ఆర్థిక పరంగా కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. పెళ్లి కాని స్థానికులకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ వారం మంచిది కాదు. ఒత్తిడి కారణంగా మీరు మీ ఆహారం మరియు పానీయాల పట్ల శ్రద్ధ చూపలేరు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 23

లక్కీ డే : శుక్రవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పనిలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు ఈ సమయంలో కొన్ని మంచి వార్తలను వినొచ్చు. మీ ఉన్నతాధికారుల హృదయాలను గెలుచుకోవడంలో కూడా విజయవంతమవుతారు. ఈ కాలంలో మీకు మంచి అవకాశం దొరకవచ్చు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిది. మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమయం సరైనది. మీ మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి, తద్వారా మీరు కొత్త ఆలోచనల యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం కొన్ని మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య పరంగా, శారీరకంగా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్: గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ డే : సోమవారం

ఈ సంకేతాలను బట్టి అమ్మాయిల వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు...!ఈ సంకేతాలను బట్టి అమ్మాయిల వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు...!

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ వారం మీరు వ్యక్తిగత జీవితంలో చాలా ఓపికగా, వినయంగా ఉండాలి. ఎందుకంటే ఈ వారం మీ ఇంటి వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. పని విషయంలో ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. ఈ వారంలో మీరు కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. మీరు ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తే, మీకు మంచి పేరు వస్తుంది. మీ గౌరవం, ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మీరు ఒత్తిడిని మరచిపోయి మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఈ సమయం వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ డే : గురువారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈ వారం చాలా కష్టంగా ఉంటుంది. ఈ వారం పనిభారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి. ఈ కాలంలో మీరు కుటుంబంతో కూడా గడపగలుగుతారు. ఈ సమయంలో, మీరు పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను ఉంచుతారు. ఈ సమయం వివాహితులకు చాలా శృంగారభరితంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరి బాధ్యతలను నెరవేర్చడంలో పూర్తి మద్దతును ఇచ్చుకుంటారు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్: క్రీమ్

లక్కీ నంబర్ : 10

లక్కీ డే : మంగళవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం మంచిగా ఉంటుంది. మీ పనుల విషయంలో సానుకూలంగా ఉంటుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీరు ఉన్నతాధికారుల అసంతృప్తిని కూడా అధిగమించగలరు. బహుశా ఈ వారం మీ కెరీర్‌కు కొత్త దిశను ఇచ్చే అవకాశం లభిస్తుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే, ఈ వారం అది తీరిపోయే అవకాశం ఉంది. అయితే రాబోయే కాలంలో మీకు కష్టంగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ప్రతికూల పరిస్థితులలో వారి మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

లక్కీ కలర్: వైట్

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : సోమవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారికి ఈ వారం చాలా ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత మరియు వృత్తి జీవితం ఒకదాని తరువాత ఒకటి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక పరిమితుల కారణంగా పనులన్నీ పెండింగు పడిపోతాయి. దీని వల్ల కొన్ని బాధ్యతలను నెరవేర్చకపోవచ్చు. లాక్ డౌన్ కారణంగా మీ ఆదాయం కూడా బాగా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో మీరు ఆర్థిక పరమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులను మానుకోవాలి. ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి.

లక్కీ కలర్: మెరూన్

లక్కీ నంబర్ : 4

లక్కీ డే : మంగళవారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారిలో ఈ వారం వ్యాపారులకు చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని మంచి వ్యాపార ఆఫర్లను పొందవచ్చు. మీరు తెలివిగా పనిచేస్తే, భవిష్యత్తులో మీకు కావలసిన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మీరు మొదట చిన్న ఖర్చుతో కూడిన పని చేయాలి. ఉద్యోగులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే, ఈ సమయంలో మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రులు, సోదరులు మరియు సోదరీమణులు అందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. మీరు విద్యార్థి అయితే, ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ వారం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 35

లక్కీ డే : గురువారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం పరిస్థితులతో సంబంధం లేకుండా, మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వారం సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎరువుల వ్యాపారులకు ఈ వారం మంచి లాభాలు రావచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఖర్చులు నియంత్రించబడతాయి, మీరు పొదుపుపై ​​దృష్టి పెట్టగలుగుతారు. మీ డిపాజిట్లు పెరుగుతాయి. ఈ కాలంలో కుటుంబ జీవితంలో కొంత తిరుగుబాటు ఉండవచ్చు. అయితే, వారం చివరినాటికి పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ ప్రవర్తనను చక్కగా ఉంచాలి. మీ పెద్దలను గౌరవించాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 39

లక్కీ డే : ఆదివారం

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.

English summary

Weekly Rashi Phalalu for May 17 to May 23

In the year 2020, Third week of May will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Story first published:Sunday, May 17, 2020, 3:37 [IST]
Desktop Bottom Promotion