Latest Updates
-
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు!
మీకు ఇలాంటి చెవులుంటే మీరు రాజకీయంగా... రచయితగా రాణిస్తారంట...!
మీ చెవులను బట్టి మీకు ఎలాంటి లక్షణాలుంటాయో తెలుసుకోండి.
సాధారణంగా ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు జ్యోతిష్యశాస్త్రాన్ని ఫాలో అవుతారు. జ్యోతిష్యశాస్త్ర నిపుణులు రాశులు, గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా వ్యక్తుల యొక్క జాతకం చెబుతూ ఉంటారు.

అయితే సాముద్రికశాస్త్రం ప్రకారం వ్యక్తుల అవయవాలు ఆధారంగా వారి ప్రవర్తన, జీవితంలో కలిగే మార్పులను అంచనా వేయచ్చట. దీని ప్రకారం కొందరి కళ్లు పెద్దగా ఉంటే వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అదే విధంగా చేతి రంగులను బట్టి కొన్ని అర్థాలను చెప్పొచ్చట. అలా మనకు ఉండే చెవుల సైజును బట్టి మనం ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.

అయితే మనలో చెవులు అనేవి ఏ ఒక్కరికీ సక్రమంగా ఉండవు. కొందరికి చిన్నగా.. మరికొందరికి పెద్దగా.. ఇంకొందరికి వెడల్పుగా ఉంటాయి. ఈ సందర్భంగా చెవుల పరిమాణాన్ని బట్టి, వారు ఎలా ప్రవర్తిస్తారో అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెద్ద చెవులుంటే..
సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికైనా పెద్ద చెవులు ఉంటే అలాంటి వ్యక్తులు ఎక్కువగా కష్టపడి పని చేస్తుంటారు. అంతేకాదు ఏ పనినైనా ప్రారంభిస్తే.. అది పూర్తి చేసేంత వరకు అంత తేలికగా వెనక్కి తగ్గరు. అయితే వీరు ఎంచుకునే పనుల్లో చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని వెంటనే పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇలా పెద్దగా, పొడవుగా చెవులు ఉండేవారు ఎంతో తెలివైన వారు కూడా. వీరు ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలన చేసి, తర్వాతే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. తొందరపడటం, వేగంగా బదులు చెప్పడం లాంటివి చేయరు.

రాజకీయ నాయకులుగా, రచయితలుగా..
సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికైతే చెవులు మందంగా ఉంటాయో, వారికి అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంతేకాదు వీరు జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సమస్యలను కూడా చాలా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా మంచి వక్తలుగా, రాజకీయ నాయకులుగా, రచయితలుగా గుర్తింపు తెచ్చుకోగలుగుతారు.

గజకర్ణాలుంటే..
ఎవరికైతే ఏనుగులాంటి చెవులు ఉంటాయో వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరు ఏ పని మొదలుపెట్టినా కచ్చితంగా విజయవంతం అవుతారు. అంతేకాదు వీరు దీర్ఘాయుష్షును కలిగి ఉంటారు. వీరు సమాజంలో కూడా ఎంతో గౌరవం కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులను ఎలాంటి ఆలోచన లేకుండా నమ్మొచ్చు.

ఇతరులకు సాయం చేసే గుణం..
చెవులు వెడల్పుగా ఉండే వ్యక్తులు ఎంతో లక్కీ అని చెప్పొచ్చు. వీరి కష్టపడి పని చేయడం, అంకితభావం వంటి లక్షణాలను కలిగి ఉండటం వల్ల వీరి జీవితం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వీరు జీవితంలో వచ్చే అవకాశాన్ని అంత త్వరగా విడిచిపెట్టరు. ఈ ప్రవర్తన వల్ల ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో విజయం సాధించిన వారిగా గుర్తింపు పొందుతారు. అంతేకాదు ఇతరులకు సాయం చేయడంలోనూ వీరు ఎప్పటికీ వెనుకడుగు అనేదే వేయరు.

చెవులు చిన్నగా ఉంటే..
సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరైతే వ్యక్తులకు చెవులు చిన్నగా ఉంటాయో.. అలాంటి వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహిస్తారు. వీరు ఏవైనా పనులు చేపట్టినప్పుడు, వాటిని గందరగోళంగా ఉన్నప్పుడే పూర్తి చేస్తారు. అయితే కొన్నిసార్లు ఈ స్వభావం వల్ల వీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అయితే వీరికి ఆలోచనాత్మక ధోరణి, తెలివితేటల వల్ల దేన్నైా సులభంగా పూర్తి చేస్తారు.

విభిన్న రకాల చెవులు..
సాముద్రిక శాస్త్రం ప్రకారం రకరకాల చెవులుండే వ్యక్తుల లక్షణాలను ఇలా అంచనా వేయొచ్చు. ఈ విధంగా సన్నగా, పెద్దగా, ఏనుగు చెవులుండే వ్యక్తుల స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయడమే కాకుండా పూర్తిగా అర్థం చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
