Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! -
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు!
మీకు వచ్చే కలలో వాళ్లు కనిపిస్తున్నారా? అయితే వాటి అర్థాలేంటో చూసెయ్యండి...
మీకు వచ్చే కలలో వారు కనిపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లోకంలో నివసించే ప్రతి ఒక్క మనిషికి నిద్ర పోయినప్పుడు కలలు వస్తుంటాయి. అలా వచ్చే కలల్లో కొన్ని అందమైన అనుభూతినిస్తే.. మరికొన్ని కలలు చాలా భయంకరంగా.. పీడకలగా మారి నిద్ర రావాలంటేనే భయమేస్తుంది.

అయితే కలలు ఎలాంటివైనా సరే.. అవి మన బ్రెయిన్ మనకు చెప్పాలనుకునే మాటలకు వారధుల్లాంటివి. కొన్నిసార్లు మన కలలే మనల్ని ఆలోచనల్లో పడేస్తాయి. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి కల వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది.

అయితే ఇలా వచ్చే కలలకు అర్థాలేంటి? అలాంటి కలలెందుకు వస్తాయి.. మీకు వచ్చే కలలో అలాంటి వాళ్లు కనిపిస్తే ఏమి జరుగుతుంది.. అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కలలో వాళ్లు కనిపిస్తే..
స్వప్నశాస్త్రం ప్రకారం.. మీకు వచ్చే కలలో ఎప్పుడైనా ట్రాన్స్ జెండర్లు(హిజ్రా) కనిపించారా? అయితే వారు కలలో కనిపించడం వల్ల మంచి, చెడు రెండూ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. హిజ్రాలకు కలలో డబ్బు ఇస్తున్నట్లు అనిపిస్తే.. అది శుభకరంగా పరిగణించవచ్చు. ఇది మీ జాతకంలో బుధుడిని బలంగా చూపిస్తుంది. కొందరి నమ్మకం ప్రకారం, మీరు హిజ్రాలకు డబ్బులు ఇచ్చినట్లు కలగంటే.. నిజజీవితంలోనూ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మీరు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

నాణెల రూపంలో..
మీరు హిజ్రాలకు కరెన్సీ రూపంలో కాకుండా.. నాణెల రూపంలో డబ్బులను ఇవ్వాలి. అప్పుడే బుధుడు బలపడతాడు. శని మెరుగుపడుతుంది. హిజ్రాలు మీ ఇంటి వద్దకు వచ్చి ఖాళీ చేతులతో తిరిగి వెళ్తే అది అపవిత్రంగా భావిస్తారు. ఇలాంటి కల వచ్చినప్పుడు మీరు వాస్తవ జీవితంలో తప్పకుండా దానం చేయాలి.

పూర్వీకులు కనిపిస్తే..
మీకు వచ్చే కలల్లో పూర్వీకులు లేదా పెద్దలు కనిపిస్తే.. ఇది కూడా మంచి, చెడు సంకేతాలను సూచిస్తుంది. కలలో పెద్దలు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతారు. పూర్వీకులు మీ ఫలం లేదా ఆహార పదార్థాలను ఇవ్వాలని కలలు కంటున్నట్లయితే, దాన్ని మంచిగా భావించొచ్చు. ఈ సమయంలో మీరు చేస్తున్న పనిలో విజయంతో పాటు భరోసా ఉంటుందని అర్థం.

ఏడుస్తున్నట్లు..
అయితే మీకు వచ్చే కలల్లో మీ పూర్వీకులు ఏడుస్తున్నట్లు వస్తే, అది మంచిది కాదు. మీకు అలాంటి కల వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో మీరు పెద్ద నష్టాన్ని ఎదుర్కొనే అవకాశముందని అర్థం చేసుకోవచ్చు.

రెడ్ కలర్లో వధువును..
మీకు వచ్చే కలలో రెడ్ కలర్ డ్రస్ వేసుకున్న కొత్త పెళ్లికూతురిని చూసినట్లయితే.. ఆ కల మీ ఇంట్లో లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అంతేకాదు.. మీరు వ్యాపారులైతే.. భారీ లాభాలను అందుకోబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశంతో పాటు వేతనం కూడా పెరుగుతుంది. మీ కలలో శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే.. ఫలితంగా మీ ఇంట్లో ధనం పెరుగుతుంది. మీ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

కోరిక త్వరలో..
మీ కలలో మీరు పిల్లల్ని చూస్తే.. ఇది చాలా ప్రత్యేకమైనదిగా భావించొచ్చు. ఓ చిన్నపిల్లవాడు కలలో పాలు తాగుతున్నట్లు కనిపిస్తే.. మీ కోరిక త్వరలో నెరవేరుతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంటికి ఆనందం తిరిగి వస్తుంది. మీ కలలో పిల్లలు ఆడుకుంటున్నట్టు వస్తే.. మీరు దేవుని అనుగ్రహం పొందనున్నారని అర్థం చేసుకోవాలి.

గోమాత కనిపిస్తే..
మీ కలలో గోమాత కనిపిస్తే.. లక్ష్మీదేవికి సంకేతంగా భావించాలి. దీనర్థం మీ ఇంట్లో అతి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం. అంతేకాదు నిజ జీవితంలో కూడా మీరు ఆవుకు ఆహారం అందించాలి.

ఎక్కువగా తింటున్నట్టు..
కొందరికి కలలో ఎక్కువగా ఆహారం తీసుకుంటున్నట్టు కలలు వస్తుంటాయి. అయితే దీనర్థం మీకు ఆహారం అంటే ఇష్టమని కాదు. మీకు ఏదో ఒక విషయం మీద విపరీతమైన ఆసక్తి, ప్రేమ ఉందని భావించొచ్చు. అది మీ న్యూ లైఫ్ గురించి కావచ్చు.. మనీ, ఎడ్యుకేషన్ ఇలా దేని గురించైనా ఒకదానిపై అమితమైన ఆసక్తి ఉన్నట్టు పరిగణించాలి.



Click it and Unblock the Notifications