Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Veena Reddy:వీణా రెడ్డి ఎవరు? అమెరికాలో ఈ తెలుగమ్మాయి సాధించిన విజయమేంటో తెలుసా...
వీణారెడ్డి ఎవరు? భారత్ లో కోవిద్ సాయానికి అమెరికా తరపున తొలిసారిగా ఈ భారత మహిళనే ఎందుకు ఎంపిక చేశారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (USAID) డైరెక్టర్ గా భారతీయ అమెరికన్ మహిళ వీణారెడ్డి ఎంపికయ్యారు. మన తెలుగమ్మాయి అగ్రరాజ్యంలో సాధించిన ఈ ఘనతకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. అమెరికాలో భారతీయ పూర్వీకుల మొదటి దౌత్యవేత్తగా, ఆమె సాధించిన విజయాల గురించి గర్వపడుతున్నాని ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

మనోళ్లకే కీలక పదవులు..
మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అప్పట్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చినప్పటికీ.. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికాలోని భారత సంతతి వ్యక్తులకు వరుసగా పెద్ద హోదాలనే కట్టబెడుతున్నారు. దీంతో అమెరికాలోని ప్రభుత్వ విభాగాలతో పాటు అంతర్జాతీయ స్థాయి సంస్థల్లోనూ మన భారతీయులకు మంచి ప్రాధాన్యం దక్కుతోంది. తాజాగా భారత్-అమెరికా సంతతికి చెందిన వీణా రెడ్డి.. మన దేశానికి యూఎస్ ఎయిడ్ ఏజెన్సీ మిషన్ డైరక్టర్‌గా ఎంపికయ్యారు. ఈమె భారత్‌తో పాటు భూటాన్‌లో ఆమె సేవలు అందించనున్నారు.
తొలి భారతీయ మహిళగా మన తెలుగమ్మాయి..
అమెరికా సీనియర్ ఫారిన్ సర్వీస్‌లో సభ్యురాలు అయిన వీణా రెడ్డి.. మన తెలుగు అమ్మాయి కావడం విశేషం. భారత్‌కు యూఎస్ ఎయిడ్ మిషన్ డైరక్టర్‌గా ఇటీవలే ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ఎయిడ్ తరపున ఇండియాలో సేవలు అందించనున్న తొలి భారతీయ అమెరికన్‌గా ఆమె రికార్డు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన వీణారెడ్డి.. యూఎస్ ఫారిన్ సర్వీస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. గతంలో ఆమె కంబోడియాలో యూఎస్ ఎయిడ్ మిషన్ డైరక్టర్‌గా చేశారు. హైతిలోనూ డిప్యూటీ మిషన్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అమెరికా ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించడానికి ముందు.. వీణా రెడ్డి కార్పొరేట్ కంపెనీలో అటార్నీగా చేశారు. కొలంబియా లా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారామె. చికాగో వర్సీటీలో బీఏ చేశారు. యూఎస్ ఎయిడ్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ) భారత ప్రభుత్వంతో గత ఏడు దశాబ్ధాల నుంచి భాగస్వామిగా ఉందని, ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆమె అన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఇండియాతో పాటు ఇతర దేశాలపైన తీవ్ర ప్రభావం పడిందని, రెండు దేశాల మధ్య భాగస్వామ్యంతో మెరుగైన భవిష్యత్తును నిర్మించనున్నట్లు ఆమె వెల్లడించారు. కాగా, భారత్‌లో అమెరికా ఎయిడ్ డైరెక్టర్ గా వీణా రెడ్డి నియామకానికి కొద్ది రోజుల ముందే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్‌ను అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంబాసిడర్‌గా నామినేషన్ చేశారు. ఈ పదవికి ఎంపికైన తొలి ముస్లింగా రషద్ నిలిచారు. రషద్ హుస్సేన్ జాతీయ భద్రతా మండలిలో భాగస్వామి, అలాగే గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్. ఆయన గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నేషనల్ సెక్యూరిటీ డివిజన్‌లో సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారని వైట్ హౌస్ ప్రకటనలో పేర్కొంది. ఒబామా హయాంలో స్ట్రాటజిక్ కౌంటర్ టెర్రరిజం కమ్యూనికేషన్స్, డిప్యూటీ అసోసియేట్ వైట్ హౌస్ కౌన్సిల్ కోసం ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC) కు అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా రషద్ సేవలందించారు. రాయబారిగా.. హుస్సేన్ విద్య, వ్యవస్థాపకత, ఆరోగ్యం, అంతర్జాతీయ భద్రత, సైన్స్, టెక్నాలజీ, ఇతర రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ఇస్లామిక్ సహకారం (OIC), ఐక్యరాజ్యసమితి, విదేశీ ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థల్లోనూ పని చేశారు. ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో చేరడానికి ముందు ఆరో సర్క్యూట్ యూఎస్ అప్పీల్స్ డామన్ కీత్‌కు జ్యుడీషియల్ లా క్లర్క్‌గా పనిచేశాడు. ఒబామా-బిడెన్ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ కౌన్సెల్‌గా కూడా ఉన్నారు. హుస్సేన్ యేల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరబిక్, ఇస్లామిక్ అధ్యయనాలు చేసి మాస్టర్స్ డిగ్రీని పొందారు. రషద్ నియామకంపై అమెరికన్ యూదు కమిటీ (AJC) యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్‌గా నియమించినందుకు బిడెన్ పరిపాలనను ప్రశంసించింది. ఇదిలా ఉండగా కరోనా టీకాల ఉత్పత్తిలో అమెరికా సహాయ సహకారాలు అందిస్తుందని అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు 50 కోట్ల డోసులు అందించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ నెలాఖరులో వాటి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు.



Click it and Unblock the Notifications