For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?

|

మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాకటలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కొత్త కోడలు.. గడసరి అత్త ఒకచోట ఉండకూడదని చెబుతుంటారు పెద్దలు.

అంతేకాదు ఆషాఢ మాసం ఆరంభం కాకముందే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని, అందుకే ఈ మాసంలో హిందువులలో చాలా మంది పెళ్లిళ్లను సైతం వాయిదా వేస్తారు. ఆషాఢ మాసంలో పెళ్లి భాజాలు మోగించడం అనేది మానేస్తారు.

ఒకవేళ దీనికి ముందే పెళ్లి జరిగితే 'కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదు' అనే వింత ఆచారాన్ని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. అయితే ఇది ఇప్పటితరానికి కొంత విచిత్రంగా అనిపిస్తుంది.

అయితే ఈ కాలం యువత ఇలాంటి ఆచారాలను, సాంప్రదాయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. దీనంతటికి కారణం వీరికి అందుకు గల కారణాలపై అవగాహన లేకపోవడమే.

దీంతో ప్రస్తుత జనరేషన్ వారు ఇదంతా మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు కూడా. అయితే దీని వెనుక అత్యంత ఆసక్తికరమైన విషయాలే దాగి ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....

పవిత్రమైనది కాదు..

పవిత్రమైనది కాదు..

హిందూ ధర్మంలోని పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం అనేది నాలుగో నెల. పండితుల ప్రకారం ఆషాఢ మాసాన్ని ఆది మాసం అని పిలుస్తారు. వీరి లెక్క ప్రకారం ఈ నెల పవిత్రమైనది కాదు. అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇది ప్రతి ఏటా జూన్ లేదా జులై మధ్యలో వస్తుంది.

దేవతలను పూజించడానికి..

దేవతలను పూజించడానికి..

ఆషాఢ అంటే ఆది. ఇది సంస్కృతం నుండి వచ్చింది. ఆది అంటే బలమైన శక్తి అని అర్థం. అందుకే ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

శుభకార్యాలు చేయరు..

శుభకార్యాలు చేయరు..

పూజలు, దేవతారాధన చేసే హిందువులు ఈ నెలలో పెళ్లిళ్లు మాత్రం చేయరు. అలాగే కొత్త ఇంట్లోకి కూడా అడుగు పెట్టరు. అంతేకాదు ఎలాంటి శుభకార్యాలకు శంకుస్థాపన కూడా చేయరు. అంతేకాదు ఎంత ముఖ్యమైన పనులున్నా వాయిదా వేసుకుంటారు.

విదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండి

దక్షిణ భారతంలో..

దక్షిణ భారతంలో..

ఇక అసలు విషయానికొస్తే.. దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, కర్నాటకలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. కొత్త కోడలిని కచ్చితంగా పుట్టింటికి పంపుతారు. ఎందుకంటే ఈ నెలలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది.

అప్పట్లో ఏమీ లేవు..

అప్పట్లో ఏమీ లేవు..

ఆ సమయంలో డెలివరీ జరిగితే పుట్టిన శిశువుకు, తల్లికి వేసవికాలం ఇబ్బందిగా ఉంటుంది. వేసవిలో బిడ్డకు జన్మనిస్తే, ఎండ తీవ్రతకు బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, అంటువ్యాధులు వస్తాయని భావించి మన పెద్దలు ఈ నెలలో భార్యభర్తలను దూరంగా పెట్టేందుకు కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదు అనే నియమాన్ని పెట్టారు. ప్రస్తుతం కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు ఇతర సౌకర్యాలు అనేకం ఉన్నాయి. అప్పట్లో అయితే ఏమీ లేవు.

మరో కారణం ఏంటంటే..

మరో కారణం ఏంటంటే..

మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి.. ఈ ఆషాఢ మాసంలోనే వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయని, ఈ సమయంలో వ్యవసాయదారులకు ఎక్కువ పని ఉంటుంది. దీంతో వారు అక్కడే పనిలో నిమగ్నమయి ఉంటారు. అయితే కొత్తగా పెళ్లయిన వారు కలయికలో పడి పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టరని, వీరిని వైవాహిక జీవితం గురించి డైవర్ట్ చేసేందుకు భార్యను పుట్టింటికి పంపించేవారట. దీని కోసమే కొత్త కోడలు అత్త ముఖం చూడకూడదు అన్న నియమాన్ని తీసుకొచ్చారు.

English summary

Why Daughter in Law and Aunt Are Separated in Ashada Masam

Here we talking about why daughter in law and aunt are separated in ashada masam. Read on.