Latest Updates
-
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే!
మంచంపై కూర్చొని తింటే వాస్తు శాస్త్రం ప్రకారం ఏం జరుగుతుందో తెలుసా?
మనిషి చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా వారి జీవితాలనే నాశనం చేస్తుంటాయి. అయితే వాస్తు ప్రకారం ఓ వ్యక్తి ఏ అలవాట్లకు తక్షణమే దూరం పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం సానుకూల, ప్రతికూల శక్తిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇల్లు, కార్యాలయాలు, మరేవైనా బిల్డింగులు నిర్మించేముందు వాస్తు శాస్త్ర నిపుణుడిని కలిసి వాస్తు ప్రకారమే నిర్మాణాలు చేపడతారు. సరైన వాస్తుతో కట్టిన ఇంట్లో డబ్బుకు, ఆనందాలకు కొదవ ఉండదని చాలా మంది చెబుతుంటారు. అలాగే మన ఇంట్లోనే ఎలాంటి సమస్యలు అయినా ఏర్పడినప్పుడు... పలువురు ఇంట్లో వాస్తు ఎలా ఉందో చూపించుకోమనడం, కొన్ని మార్పులు చేసుకోమని చెప్పడం షరా మామూలే. సానుకూల శక్తి ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. అయితే ప్రతికూల శక్తి జీవితంలో అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది. చాలా సార్లు సరైన మార్గంలో చేసిన తర్వాత కూడా.. ఓ వ్యక్తి మల్లీ వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అంతేకాదండోయ్ ఓ వ్యక్తి కొన్ని అలవాట్లు మాత్రమే అతని పురోగతికి ఆటంకం కల్గిస్తాయి. వీటి కారణంగా ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం, ఇతర సమస్యలు ఏర్పడతాయి. ఈశాన్యంలో బరువులు ఉంచడం.. లక్ష్మీ దేవిలా భావించే గడపపై కూర్చోవడం.. ఇలాంటి వాటి వల్ల అనేక ఆర్థిక సమస్యలు వస్తాయి అలాగే మనిషి చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా వారి జీవితాలనే నాశనం చేస్తుంటాయి. అయితే వాస్తు ప్రకారం ఓ వ్యక్తి ఏ అలవాట్లకు తక్షణమే దూరం పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది:
చాలా మంది మంచం మీద కూర్చొని ఆహారం తీసుకుంటూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవికి మంచం మీద కూర్చొని ఆహారం తినడం వల్ల కోపం తెచ్చుకుంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. వెళ్తూ వెళ్తూ లక్ష్మీ దేవి డబ్బుతో పాటు సంతోషాన్ని కూడా తీసుకెళ్తుందట. అందుకే బెడ్ పై కూర్చొని తినే వాళ్ల ఇంట్లో ఆనందం, శాంతి లేకుండా పోతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులపై అప్పులు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా మంచం మీద కూర్చొని ఆహారం తినే వ్యక్తి నరకానికి వెళ్తాడని కూడా ఓ పురాణ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే పడుకునే ప్రదేశంలో ఎప్పుడూ భోజనం చేయకూడదని అంటారు.

ఈ పని అస్సలే చేయొద్దు:
అంతేకాదండోయ్ మీరు ఉదయం నిద్రలేవగానే అద్దంలో చూసుకునేలా ఎదురుగా అద్దం ఉండకుండా చూస్కోవాలి. దర్పంల ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి లేవగానే అద్దంలో అస్సలే చూసుకోకూడదు. రాత్రి పడుకున్నాక, ఉదయం లేవగానే పడక సరిగ్గా పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం ద్వారా లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. అలాంటి ఇంట్లోనే లక్ష్మీ దేవి నెలవై ఉంటుంది. పడకగది ముఖ్యంగా మంచంపై చెత్తా, చెదారం, దుమ్ముధూళి ఎక్కువగా ఉంటే వారి ఇంట్లో డబ్బు లేకుండా పోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది.

అన్నపూర్ణకు కోపం తెప్పించొద్దు:
రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా మంది కిచెన్ ను అలాగే మురికిగా ఉంచుతారు. బోళ్లు, పాత్రలన్నీ సింక్ లో పడేసి వెళ్లి పడుకుండి పోతారు. వాస్తు శాస్త్రం ప్రకారం తల్లి అన్నపూర్ణ రాత్రి పూట ఇలా పాత్రలను శుభ్రం చేయకుండా వదిలేస్తే.. కోపంగా ఉంటుంది. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందాని వాస్తు శాస్త్రం వివరిస్తోంది.



Click it and Unblock the Notifications
