For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Teacher's Day 2021: ఉపాధ్యాయ వృత్తి ఎందుకు ఉత్తమమైనదో తెలుసా..

పిల్లల జీవితంలో తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని అందరూ అంటారు. మీరు చాలా మంది పిల్లల భవిష్యత్తును రూపొందించడానికి మీకు లభించిన గొప్ప అవకాశం

|

ఉపాధ్యాయులు లేనిదే ఏ వృత్తి అనేదే లేదు. ప్రతి రంగంలోనూ గురువు అనే వారు కచ్చితంగా అవసరమే. ఇంతకీ ఈ విషయం ఇపుడు ఎందుకు చెబుతున్నామో ఈ పాటికే మీకు అర్థమయ్యింటుంది. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. ఆయన జయంతి సందర్భంగా మన దేశంలో మన జీవితంలో టీచర్ల ప్రాముఖ్యతకు గుర్తుగా టీచర్స్ డేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటారు. బోధన అనేది ఒక గొప్ప వృత్తి అని ఒకప్పుడు ప్రజలు నమ్మేవారు. కానీ ప్రస్తుత సమాజంలో టీచర్లు సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నారు. తక్కువ వేతనాల కారణంగా ఇతర రంగాలను ఎంచుకుంటున్నారు. అందువల్ల బోధన ఇప్పటికీ ఉత్తమ వృత్తి అని అందరికీ గుర్తు చేయడానికి ఇదే సరైన సమయం.

Teachers Day

మౌలిక సదుపాయాలు లేకపోవడం లేదా పే స్కేల్ కారణంగా ఈ బోధనా వృత్తిపై సందేహాలు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనకు జ్ఞానాన్ని పెంచడానికి టీచర్లు ఎంతో సహాయం చేస్తారు. అందువల్ల, ఈ ప్రత్యేక రోజున వారు అర్హులైన ప్రేమ మరియు గౌరవాన్ని వారికి చూపించాలి. విద్యార్థుల నాడిని తెలుసుకోవడం ఉపాధ్యాయుల చేయాల్సిన ముఖ్యమైన పని. బోధనా వృత్తి యొక్క కొన్ని ప్రయోజనాలు ఇప్పటివరకు మీకు అంది ఉండకపోవచ్చు. టీచర్స్ డే సందర్భంగా బోధన ఇప్పటికీ ఉత్తమ వృత్తిగా ఎందుకు ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు శక్తివంతంగా తయారవ్వండి..

మీరు శక్తివంతంగా తయారవ్వండి..

పిల్లల జీవితంలో తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని అందరూ అంటారు. మీరు చాలా మంది పిల్లల భవిష్యత్తును రూపొందించడానికి మీకు లభించిన గొప్ప అవకాశం. అంతేకాదు ఇదొక ముఖ్యమైన బాధ్యత. అందుకే మీరు శక్తివంతంగా తయారవ్వాలి.

ఉపాధ్యాయులకే ఎక్కువ సెలవులు..

ఉపాధ్యాయులకే ఎక్కువ సెలవులు..

విద్యాసంవత్సరం పూర్తి చేసిన తర్వాత వేసవి సెలవుల భావన మన జీవితానికి ఎంతో ఊరటనిస్తుంది. కార్పొరేట్ కంపెనీలతో పాటు ఏదైనా కంపెనీలో లేదా వేరే ఇతర రంగాలలో పనిచేసేవారికి ఎక్కడా రెండు నెలల సెలవులు దొరుకుతాయని మీరు ఊహించగలరా? కానీ కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే జీవితాంతం ఆ హక్కు ఉంటుంది.

ఎక్కువ గౌరవం ఉపాధ్యాయులకే..

ఎక్కువ గౌరవం ఉపాధ్యాయులకే..

బోధన ఇప్పటికీ ఒక వృత్తిగా పరిగణించబడుతోంది. కాబట్టి ఉపాధ్యాయులు సమాజంలో, సాయుధ దళాలలో, వైద్యులతో సమానంగా గౌరవాన్ని పొందుతారు. ఇలాంటి గౌరవం మరెవ్వరికి లభించదు.

ఉపాధ్యాయులకు శిక్షణ..

ఉపాధ్యాయులకు శిక్షణ..

ఉపాధ్యాయులు తమ జీవితంలో ప్రారంభ దశ నుండి పిల్లలను భవిష్యత్తును రూపొందించేందుకు సరైన శిక్షణ పొందుతారు. అందువల్ల వారి సొంత పిల్లలకు వారు మంచి తల్లిదండ్రులుగా లేదా ఆదర్శ తల్లిదండ్రులుగా మారతారు.

టీచర్లను ఎన్నటికీ మరచిపోరు..

టీచర్లను ఎన్నటికీ మరచిపోరు..

మంచి ఉపాధ్యాయులను ఏ విద్యార్థి అయినా ఎప్పటికీ మరచిపోరు. కాబట్టి ఒక విద్యార్థి దేశ అధ్యక్షుడైనా, ప్రధానమంత్రి లేదా ఆఖరి ముఖ్యమంత్రి అయినా అతడు/ఆమె ఎప్పటికీ తమ ఉత్తమ ఉపాధ్యాయులను మరచిపోలేరు

ఉపాధ్యాయులకు ఎప్పటికీ డిమాండ్..

ఉపాధ్యాయులకు ఎప్పటికీ డిమాండ్..

మాంద్యం ఉన్నా లేదా ఆర్థిక మాంద్యం ఉన్నా ఉపాధ్యాయులకు మాత్రం ఎల్లప్పుడూ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను వేతన కోతలు పొందుతున్నందున పాఠశాలకు మాత్రం ఆపరు కనుక ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఉద్యోగ రంగాలలో ఇదొకటి.

ఎన్నో బహుమతులు..

ఎన్నో బహుమతులు..

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎక్కువ మంది విద్యార్థుల నుండి పూలు, బహుమతులు మరియు ప్రేమను పొందేది మాత్రం కేవలం ఉపాధ్యాయులు మాత్రమే. మదర్స్ డే, ఫాదర్స్ డే వంటి అన్ని ఇతర రోజులను మరచిపోవచ్చు. కానీ పాఠశాలలు, మరియు కళాశాలలు ఉన్న విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎన్నటికీ మరచిపోరు.

టీచర్స్ ఎప్పుడు హూషారుగా ఉంటారు..

టీచర్స్ ఎప్పుడు హూషారుగా ఉంటారు..

ఉపాధ్యాయులు ప్రస్తుతం ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఎల్లప్పుడూ పట్టించుకోరు. ఎందుకంటే వారికి ప్రతి సంవత్సరం చాలా మంది పిల్లలు, యువకులతో కొత్త ప్రపంచం మొదలవుతుంది. దీంతో వారు ఎప్పుడూ హుషారుగా ఉంటారు. యువత గురించి వారి కొత్త కొత్త ఆలోచనల గురించి వారి నైపుణ్యాల అభివృద్ధి గురించి ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సహాయం చేస్తుంటారు.

English summary

Teachers Day 2019: Why Teaching Is The Best Profession

It is time to understand the problems of the public despite the doubts in the teaching profession due to lack of infrastructure or pay scale. Teachers help us to increase our knowledge. Therefore, they must show them the love and respect they deserve on this special day. Knowing the student's nerve is an important task that teachers must do. Some of the benefits of the teaching profession may not yet be available to you.
Desktop Bottom Promotion