Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
సోషల్ మీడియా పవర్... ‘బాబా కా దాబా’కు భలే గిరాకీ... ఒక్క రోజులోనే ఎంతలా పెరిగిందో చూడండి...
బాబా కా దాబాకు ఎందుకంత క్రేజ్ పెరిగిందో తెలుసా...
ఈ మధ్యన సోషల్ మీడియా అంటేనే ప్రతి ఒక్కరికీ చిరాకు వచ్చేలా పోస్టులు కనబడుతున్నాయి. అదేంటో గానీ చెడు విషయాలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మందికి సోషల్ మీడియా అంటే మంచి కాకుండా చెడును మాత్రమే ప్రచారం చేసే వేదిక అనే భావన మొదలైంది.

అయితే ఇదంతా అపొహ మాత్రమే. ఎందుకంటే సోషల్ మీడియా తలచుకుంటే సామాన్యుడిని సైతం రాత్రికి రాత్రే హీరోల్ని చేస్తుంది.. అదే సమయంలో జిరోలను కూడా చేసే సత్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ వృద్ధ దంపతుల జీవితాల్నే మార్చేసింది ఓ వీడియో. సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రస్తుతం వీరి గురించే ప్రపంచమంతా మాట్లాడుతోంది.

'బాబా కా దాబా' పేరుతో చిన్న బడ్డీ కొట్టులో హోటల్ నడుపుతున్న వృద్ధ దంపతుల జీవితాలను సోషల్ మీడియా కేవలం కొన్ని గంటల్లోనే మలుపు తిప్పింది. అదెలా సాధ్యమయ్యింది.. నిజంగా సోషల్ మీడియాకు అంత పవర్ ఉందా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఢిల్లీలో చిన్న హోటల్..
దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలోని మాల్వియా నగర్ అనే ప్రాంతంలో సుమారు 80 ఏళ్లు ఉండే కాంతా ప్రసాద్ అనే తాత.. ఆయన భార్య బాదామీ దేవితో కలిసి ఓ దాబా హోటల్ ను గత 30 సంవత్సరాల నుండి నడుపుతున్నారు.

కరోనా దెబ్బకు..
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా ఎలా తలకిందులైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సంక్షోభం వీరిపైనా పడింది. కరోనా కారణంగా వీరికి గిరాకీ భారీగా పడిపోయింది. కనీసం వారికి రోజువారీగా తినడానికి తిండి కూడా దొరకడం కష్టంగా మారిపోయింది.

ఓ ఎంటర్ ప్రెన్యూర్..
ఈ సమయంలో వసుంధర తంఖా శర్మ అనే ఓ ఎంటర్ ప్రెన్యూర్ కు వారి గురించి తెలిసింది. లాక్ డౌన్ తర్వాత గిరాకీ ఎలా ఉంది? దాబా ఎలా నడుస్తుందని అడగగా.. ఆ తాత గారి నోట మాట రాలేదు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన కంటి నుండి నీళ్లు ఉబికి వచ్చాయి. గల్లా పెట్టేలో ఉన్న రూ.10 తీసి చూపించాడు. వారి బాధను అర్థం చేసుకున్న ఆమె ఆ వృద్ధ దంపతుల పరిస్థితిని కళ్లకు కట్టే ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఈ వీడియో పూర్తిగా నా గుండెను బరువెక్కించింది.. మంచి మనసు ఉన్న వారంతా ఈ హోటల్ కు వెళ్లి.. అక్కడ భోజనం చేసి.. వారికి అండగా నిలవాల్సిన సమయమిది అన్నట్టు పోస్టు చేసింది. అంతే ఆ వీడియో కాస్త కొద్ది నిమిషాల్లోనే వైరల్ మారిపోయింది.
ఒక్కరోజులోనే..
ఆ పోస్టు పెట్టిన మరుసటి రోజు నుండే వారి పరిస్థితిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్ల గుండె కరిగిపోయింది. ఈ వీడియోకు బోలెడన్నీ రీట్వీట్లు.. వీవ్స్ వచ్చాయి. చివరికి బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఈ వీడియోను షేర్ చేసి.. ట్వీట్ చేశారు. 'దయచేసి ఆ దాబాకు వెళ్లండి.. తాతగారిని ఆదుకోండి'అని విన్నవించారు. దీంతో ఈ దాబాకు కస్టమర్ల క్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాత గారి దాబా కస్టమర్లతో కళకళలాడటం ప్రారంభమైంది. వీరు ఉదయం 6:30 నుంచే తమ హోటల్ ను తీస్తారు. రాత్రి 9:30 వరకూ ఈ హోటల్ లో భోజనం, టిఫిన్లు రెడీ చేస్తారు. పప్పు, కర్రీస్, పరాట, రైస్ వెరైటీలను రెడీ చేస్తారు. ఇక్కడ తింటే అచ్చం ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. అంతేకాదండోయ్ ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ సిటిలో కేవలం 30 నుండి 50 రూపాయల మధ్యా తీసుకుంటూ ఆహారం అందిస్తున్నారు.
చూశారు కదా.. మనల్ని ఏవైనా సంఘటనలు కదిలిస్తే.. గుండెలను బరువెక్కిస్తే.. నేరుగా మనం సాయం చేసే స్థితిలో లేకున్నా గానీ.. ఇదిగో ఓ వసుంధర శర్మలాగా మరో గౌరవ్ వాసన్ లాగా సోషల్ మీడియాలో ఆయా ఘటనలను పోస్ట్ చేసి.. మన వంతు సాయం చేద్దాం.. ఏమంటారు...?



Click it and Unblock the Notifications
