Just In
- 46 min ago
ఆ కార్యంలో కలకాలం కచ్చితంగా సక్సెస్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...
- 1 hr ago
డయాబెటిస్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం లేదా? మరి పరిష్కారం ఏంటి?
- 3 hrs ago
నిలబడి తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? మీ సందేహానికి సమాధానం ఇక్కడ ఉంది
- 3 hrs ago
2019లో ఎక్కువ మంది చేసిన ట్వీట్లు.. ఏమోజీలు, హ్యాష్ ట్యాగులేంటో తెలుసా...
Don't Miss
- News
అత్యాచారానికి ఉరిశిక్ష... ఏపి దిశ చట్టానికి క్యాబినెట్ ఆమోదం
- Sports
కారణం తెలియదు!: చెన్నైలో కమల్ హాసన్‌ను కలిసిన డ్వేన్ బ్రావో
- Movies
నాగబాబు చేసిన పనితో ఆ నటుడి కోసం వెతుకుతున్న జబర్ధస్త్ టీమ్.. రీప్లేస్ చేయనిది అందుకే.!
- Technology
బేసిక్ రీఛార్జ్ రూ.49 ప్లాన్‌ను తొలగించించిన జియో
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Automobiles
కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వరల్డ్ ఓజోన్ డే 2019 : ఓజోన్ కు నష్టం కలిగే 'పొర'పాట్లు చేయకండి.. చేయనీయకండి..
ఓజోన్ పొర గురించి సైన్స్ విద్యార్థులకు చాలా బాగా తెలుసు. మిగిలిన వారికే దీని విలువ గురించి, దీని ప్రభావం గురించి తెలియక చాలా 'పొర'పాట్లు చేస్తున్నారు. వీటిపై అందరికీ అవగాహన కలిగించేందుకు, ఓజోన్ పొరను కాపాడుకోవడంతో పాటు ఇతర బలమైన కారణాల రీత్యా సెప్టెంబర్ 16వ తేదీని ఓజోన్ డే నిర్ణయించారు. ఇంతకీ ఓజోన్ పొర అంటే ఏమిటి.. దాన్ని ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం.
1) భూమికి రక్షణ కవచంగా నిలిచేది 'ఓజోన్ పొర' అని సైంటిస్టులు తేల్చారు. ఈ భూమిపై జీవరాశి ఉండటానికి ప్రధాన కారణం ఓజోనే. ఇది భూమి చుట్టూ ఒక గొడుగులా ఆవరించి కవచంలా ఉండి మనల్ని కాపాడుతుంది. ఈ పొర గనుక లేకపోతే భూమి అగ్నిగుండంగా మారి ఉండేది.
మనం చేసే ప్రతి పనిలోనూ ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది. భూతాపం పెరిగినా, వర్షాలు కురవకపోయినా, అడవులు తగ్గిపోయినా, కాలుష్యం ఎక్కవుగా మారినా ఓజోన్ పొరకు తీవ్ర విఘాతం కలుగుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సింపుల్ గా పాల పైన ఉండే మీగడ వంటిదే ఈ ఓజోన్ వాయువు. ఇది భూమి చుట్టూ ఓ పొరలా అల్లుకుని ఉంది.
సూర్యుడి నుండి వెలువడే శక్తివంతమైన, ప్రభావవంతమైన అతి నీలలోహిత కిరణాలను శోషించుకుని, సకల జీవకోటికి రక్షణగా ఈ ఓజోన్ పొర ఉంటోంది. ఒకవేళ ఆ పొర లేకపోతే ఆ కిరణాలు మనల్ని నేరుగా తాకేవి. మనకు అసలు ఈ భూమి మీద నూకలు అనేవే ఉండేవి కావు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న భూతాపం వల్ల ఓజోన్ పొర నానాటికీ క్షీణిస్తోంది.

1980లోనే రంధ్రం..
ఓజోన్ అనేది మూడు పరమాణువులతో కూడిన ఆక్సీజన్ అనువు (ట్రై అటామిక్ ఆక్సీజన్ మాలిక్యూర్). ఇందులో ఉన్న అన్ని ఆక్సీజన్ పరమాణువులు రసాయనికంగా ఒకే లక్షణం ఉన్నవి కావు. కానీ మనం శ్వాసక్రియలో పీల్చే సాధారణ ద్విపరమాణుక ఆక్సీజన్ అణువులో మాత్రం రెండు పరమాణువులు ఒకే విధమైనవి. భూవాతావరణాన్ని నేలమీద నుండి పైకి పోయేకొద్ది అక్కడున్న భౌతిక ధర్మాల ఆధారంగా వీటిని కొన్ని పొరలుగా విభజించారు. నేలకు దగ్గరగా 20 కిలోమీటర్లలోపే ఉన్న పొరను ట్రొఫాస్పియర్ అని, 20 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల మధ్యన ఉన్న పొరను స్ట్రాటో స్పింకుర్ అని, ఆ తర్వాత మీసో స్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ అనే పొరలు సుమారు 5 వందల కిలోమీటర్ల వరకు వివిధ మార్గాల్లో విస్తరించి ఉన్నాయి. మన సాధారణ ఆక్సీజన్ అణువులు స్ట్రాటోస్పియర్లో ఓజోన్ అణువులుగా మారతాయి. ఇంత కీలకమైన పొరకు 1980లో రంధ్రం పడినట్లు సైంటిస్టులు గుర్తించారు. ఆ సమయంలోనే సూర్యకిరణాలు భూమి మీద నేరుగా తాకుతున్న విషయం బయటపడింది. అప్పటినుండి సైంటిస్టులు దీన్ని పరిరక్షించేందుకు సెప్టెంబర్ 16న దాదాపు 24 దేశాల ప్రతినిధులు మాంట్రియల్ నగరంలో సమావేశమై, ఓజోన్ పొర రక్షణ గురించి చర్చించారు. ఈ చర్చల సందర్భంగా జరిగిన ఒప్పందంపై సంతకం చేసిన తేదీకి గుర్తుగా 'ఓజోన్ లేయర్ డే'ని నిర్వహించాలని తీర్మానించారు. భూమి మీద కాలుష్యం దెబ్బంటున్న కారణంగా ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు. ఐక్యరాజ్యసమితి ఏటా సెప్టెంబర్ 16న 'ప్రపంచ ఓజోన్ పొర సంరక్షణ రోజు'గా పాటించాలని 1994లో ప్రకటించింది.

పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి..
మితిమీరిన రసాయనాలు వాడటం, అధిక ఇంధనాన్ని ఉపయోగించడం, చెట్లను విపరీతంగా నరికేయడం వంటివి ఓజోన్ పొరను నాశనం చేస్తున్నాయి. ఈ పొర ఇలాగే విచ్ఛిన్న అయితే కోట్ల మంది ప్రజలు, జంతువులు, పక్షులు, చెట్లు అన్నిటిపైనా వ్యతిరేక ప్రభావం పడుతుంది. చర్మంపైనా తీవ్రమైన సూర్యకిరణాలు పడి క్యాన్సర్ వంటి రోగాలొచ్చే ప్రమాదమూ ఉంది. అంతేకాదండోయ్.. పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

పూర్తిగా అమలవ్వట్లేదు..
ఓజోన్ పొర రక్షణ కోసం ఎన్నో చర్యలు, నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ పూర్తిగా అమలవ్వట్లేదు. స్ప్రేలు, పొలాల్లో చల్లే ఎరువులు, క్రిమి సంహారాలు, ఫ్రిజ్ లు, కార్లపై వేస్తున్న కలర్స్, క్లోరో ఫ్లోరో కార్బన్ల వంటి వాటి వాడకాన్ని 1987లోనే నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకూ అది ఎక్కడా అమలు కాకపోవడం విచారకరం. దీని వల్లనే ఓజోన్ పొర బాగా దెబ్బ తింటోంది. 2050 నాటికి అంటార్కిటికా పైన ఓజోన్ పొరతో ఏర్పడిన రంధ్రం పూడుకుపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. నైట్రోజన్ ఆక్సైడ్ ప్రమాదకరమైన కాలుష్య కారకం. ఓజోన్ పీఎం 2.5(పార్టిక్యులేట్ మ్యాటర్ కంటికి కనిపించనంత అత్యంత సూక్ష్మమైన ధూళి) ఏర్పడటానికి దోహదం చేస్తుంది. మనం పీల్చే గాలిలో ఓజోన్ ఉంటే అది ఆరోగ్యానికి హానికరం. ఆస్తమా బాధితులు, పిల్లలు, సీనియర్ సిటిజన్స్ ఓజోన్ ఉన్న గాలిని ఎక్కువగా పీలిస్తే వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

ఓజోన్ రక్షణ మన చేతుల్లోనే..
అపార్టుమెంట్లు, షాపింగ్ మాల్స్ నిర్మాణాల సమయంలోనే కనీసం 33 శాతం మొక్కలు, చెట్లు పెంచేందుకు స్థలం ఉండేలా నిబంధనలు తీసుకురావాలి. దీని కోసం బలమైన చట్టాలను రూపొందించాలి.
మొక్కలు, చెట్లూ పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి.
మితిమీరిన ఇంధన వాడకాన్ని తగ్గించాలి.
క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. వీటికి ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదు.
సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచి భూతాపాన్ని తగ్గించాలి. అప్పుడే ఓజోన్ పొర రక్షణకు వీలు కలుగుతుంది.