For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశి చక్రాలలో జన్మించిన వారు ఎక్కువ కీర్తి, ప్రతిష్టలను అందుకుంటారని తెలుసా...

|

ప్రస్తుత జనరేషన్ ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు రావాలని తహతహలాడుతోంది. దీని కోసం చాలా మంది వ్యక్తులు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ వంటి యాప్ లతో పాటు సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది ఫేమస్ అయ్యారు కూడా.

దీంతో చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగించి ఫేమస్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నారు. అందుకోసం విభిన్న రకాల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. తమలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. దీని ద్వారా ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొంతమంది రాశుల వారు ఎలాంటి పనులు చేయకపోయినా చాలా సులభంగా కీర్తి, ప్రతిష్టలను పొందుతున్నారు. ప్రజల నుండి మన్ననలు పొందుతున్నారు. దీనికి కారణం వారు జన్మించిన రాశి చక్రాలేనట. మరి ఏయే రాశులలో పుట్టిన వారు అత్యంత సులభంగా ఫేమస్ పొందుతారో మీరే చూడండి...

1) సింహ రాశి...

1) సింహ రాశి...

ఈ రాశి వారు సులభంగా ప్రజాదరణను పొందుతారు. వీరు కూడా చాలా మంది లాగే కీర్తి మరియు ప్రతిష్టను పొందాలని కోరుకుంటారు. అలాగే దాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని సైతం కలిగి ఉంటారు. వీరు కీర్తి ప్రతిష్టలు పొందడానికి నిజంగానే అర్హలు. ఎందుకంటే వీరు ఇతరులు కోరుకున్నది ఇస్తారు. వీరు ఎల్లప్పుడూ వారు కోరుకున్న పొందలేకపోవచ్చు. కానీ వారు దాని కోసం ప్రయత్నిస్తే మాత్రం వారు కచ్చితంగా వారు అనుకున్న ప్రజాదరణను పొందుతారు.

2) మేష రాశి...

2) మేష రాశి...

ఈ రాశి వారు అగ్ని సంకేతం. అందుకే ఈ రాశి వారు ప్రసిద్ధి చెందడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే దీర్ఘకాలిక ఖ్యాతిని గడించడానికి కావాలిసిన అన్ని అర్హతలు ఈ రాశి వారికి ఉన్నాయి. వీరికి యోధులకు ఉండే శక్తి ఉంటుంది. వీరు చేసే పనులన్నీ గుర్తింపబడతాయి మరియు ప్రశంసించబడతాయి. అలాగే వీరు ఎప్పటికీ అవాస్తవ కీర్తి మరియు ప్రతిష్టలకు లొంగిపోరు. ఎల్లప్పుడూ బలం మరియు శక్తితో ఉంటారు. ఈ రాశి వారికి నాయకత్వ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి.

3) కర్కాటక రాశి...

3) కర్కాటక రాశి...

ఈ రాశి వారు అందమైన డ్యాన్స్, మంచి పాటలు పాడటం, ఎక్కువగా తినడం, ఎక్కువగా నిద్రపోవడం వంటివి చేస్తుంటారు. వీరు ఇవన్నీ సమయానికి అనుగుణంగా చేయడం వల్ల వీరికి ప్రజల నుండి స్పందన కచ్చితంగా ఉంటుంది. దీని వల్ల వీరు ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఇతరుల ఆసక్తిని ఎలా ప్రేరేపించాలిో తమ గురించి ఎలా మాట్లాడాలో వారందరికీ తెలుసు.

4) మిధున రాశి...

4) మిధున రాశి...

ఈ రాశి వారు ఎక్కువగా మాట్లాడరు. అయినా కూడా వీరి చర్చలు బాగా ప్రసిద్ధి చెందుతాయి. వీరికి ఎలా మాట్లాడాలి అనే మర్మం బాగా తెలుసు. వీరు చేసే పనులు ప్రజలకు ముందు తెలియకపోయినా, వీరి గురించి అసలైన నిజం తెలిసినప్పుడు వీరి తెలివితేటలకు ప్రజల నుండి ప్రశంసలు మరియు ఆదరణ లభిస్తాయి. కాకపోతే ఈ రాశి వారు వారి టాలెంట్ ను ఎక్కువగా వారి స్నేహితుల ముందే చూపుతారు.

5) కన్య రాశి...

5) కన్య రాశి...

ఈ రాశి వారు ఎక్కువగా కీర్తి, ప్రతిష్టలను కోరుకోరు. కానీ ఎదుటి వారి దృష్టిని బాగా ఆకర్షిస్తారు. ఏ సమయంలో ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు. వీరు కచ్చితమైన సమయంలో అవసరమైన హిట్ ను అందుకుంటారు. వారు దాని కోసం ప్రయత్నించిన ప్రతిసారీ వారికి ప్రజాదరణ లభిస్తుంది. వీరు ప్రతికూల పరిస్థితులలోనూ కీర్తి, ప్రతిష్టలను ఎలా పొందాలో ఈ రాశి వారికి బాగా తెలుసు. ఏదైనా సమస్యల నుండి వీరు ఎలా బయటపడాలో వీరికి బాగా తెలుసు.

6) వృశ్చికరాశి..

6) వృశ్చికరాశి..

ఈ రాశి వారు ఎక్కువగా నియంత్రణ ఉన్న వారు అని చెప్పొచ్చు. వీరు తమకు తాము ఖ్యాతిని పెంచుకుంటారు. దీనికి అత్యంత ఉత్తమమైన ఉదాహరణ ఏంటంటే..ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్. వీరు మల్టీ టాస్క్ పనులు చేయడం వల్ల వీరు కీర్తి, ప్రతిష్టలను ఎక్కువగా పొందుతారు.

7) ధనస్సు రాశి...

7) ధనస్సు రాశి...

ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఎక్కువ సమయం విహార యాత్రాలు చేయడం వీరికి అలవాటుగా ఉంటుంది. వీరు సాహసాలను చేయడాన్ని బాగా ఇష్టపడతారు. వీరు ప్రజాదరణ పొండంలో ఎక్కువసార్లు విజయవంతం అవుతారు. ‘‘మేము ఒకసారే జీవిస్తాం‘‘ అనే తత్వశాస్త్రం గురించి మీరు విన్నారా? వీరు ఇలాంటివి ఎక్కువగా నమ్ముతారు. వీరు తాము కీర్తి, ప్రతిష్టలను కోల్పోతామని అస్సలు భయపడరు. ఒకవేళ వారు ఏదైనా కీర్తిని కోల్పోతే, వారు సరైన పనులు చేసి తిరిగి వారి కీర్తి, ప్రతిష్టలను పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇలాంటివి సాధించడానికి వారు కొన్ని ప్రత్యేక మార్గాలను ఎంచుకుంటారు. అయితే వీరు ఒకే రకమైన ప్రజాదరణను పొందుతారు.

English summary

Zodiac signs Most likely to be famous

Zodiac Signs Most Likely To Be Famous have been mentioned here. Check out if you are there on the list. Read more.
Story first published: Monday, November 25, 2019, 14:43 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more