Latest Updates
-
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఈ రాశుల వారు సంపదను ఎక్కువగా ఆకర్షిస్తారట...! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి..
ఈ రాశి చక్రాల వారు డబ్బుకు ఎక్కువగా అతుక్కుపోతారట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి.
ప్రస్తుత జీవితంలో మనం ఏ చిన్న పని చేయాలన్నా డబ్బు చాలా ముఖ్యం. మనం పుట్టినప్పటి నుండి పాడెక్కేదాకా ప్రతి పైసా కీలకం. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో రూపాయికి బాగా విలువ పెరిగిపోయింది.

అంతేకాదండోయ్ మనం జీవితంలో విజయం సాధించాలన్నా దానికి ధనప్రాప్తి ఉండాల్సిందే. అలాంటి డబ్బును కొందరు చాలా సులభంగా సంపాదించేస్తారు. వారు ఏ మాత్రం కష్టపడకుండా కాసులు కురుస్తూ ఉంటాయి. అయితే మరికొందరు వ్యక్తులు డబ్బు కోసం ఎంతలా కష్టపడినా వారి శ్రమకు తగిన ఫలితం దక్కదు.

పైగా వారు సంపాదించిన డబ్బు మొత్తం ఏదో ఒక రూపంలో ఖర్చవుతూనే ఉంటుంది. కొందరు వ్యక్తులు ఎంత డబ్బు కూడబెట్టినా.. కూడబెట్టాలని ఆశించినా.. వారికి నిరాశే మిగులుతుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి డబ్బును ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుందట.

అందుకే వారు వద్దన్న డబ్బు వారిని వెతుక్కుంటూ వస్తుందట. అంతేకాదు అయస్కాంతంలా వారిని అతుక్కుని ఉంటుందట. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి సంపదను ఆకర్షించే శక్తి ఉంది.. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

వృషభ రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారు విలాసంవతమైన జీవితాన్ని గడపడానికి ఆసక్తి చూపుతారట. అందుకోసం ఏమి చేయాలో ముందుగా తగిన ప్రణాళికలు రూపొందించుకుంటారట. వీరు తమ బ్యాంకు బ్యాలెన్స్ ను ఎప్పటికప్పుడు పెంచేందుకు కృషి చేస్తారు. ఇందు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. దీని వల్ల వీరు మంచి ప్రయోజనాలు పొందుతారు.

కన్య రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటారు. అందుకే వీరు ఉద్యోగమైనా... వ్యాపారమైనా.. ఏ రంగంలో అయినా సులభంగా విజయం సాధిస్తారు. కాబట్టి వీరికి సంపద కూడబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల వద్ద సంపద ఊహించిన విధంగా పోగవుతుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి ఎప్పుడు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి.. ఎలా ఉండాలి అనే విషయాలపై పూర్తి క్లారిటీ ఉంటుందట. వీరు ఏదైనా పనిని విజయవంతంగా ఎలా చేయాలో బాగా తెలుసు. వీరు ఏదైనా ధృవీకరించిన తర్వాత, వారి ఉత్సాహం ముగియకముందే వారు దానిని పూర్తి చేస్తారు. అయితే, వీరి ఏకైక ప్రేరణ వారు సాధించే విజయమే.

మకరరాశి..
ఈ రాశి వారిని సంపదను ఆకర్షించే విషయంలో ఎవరూ వారిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. వారు తమ లక్ష్యాలను సాధించడంపై చాలా దృష్టి పెడతారు. అందుకే వారు సహజ వ్యవస్థాపకులు. వారు తమ పనిని చక్కగా చేస్తారు మరియు వారి ప్రయత్నం వారికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మీనరాశి
మీన రాశిచక్రం చిహ్నాలు ఇతర రాశిచక్ర చిహ్నాల కంటే మార్పు మరియు అభివృద్ధిని ఎక్కువగా స్వీకరిస్తాయి. అందుకే అతిపెద్ద ప్రాజెక్టులకు నాయకత్వం వహించగలిగే వారు. ముందుగా అనుకున్న లక్ష్యం లేకున్నా మార్పును సమయానుకూలంగా ఎదుర్కొని తమ ప్రయత్నాల ద్వారా సాధించగలిగే వారు. తద్వారా విజయం మరియు సంపద వారిని వెతుక్కుంటూ పరిగెడుతుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలోని ఐదు గ్రహాలకు సంపదను ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అవి ఒకటి వృషభ రాశి.. రెండు కన్య రాశి... మూడు వృశ్చిక రాశి.. నాలుగు మకర రాశి.. ఐదు మీన రాశి. ఈ రాశుల వారిని డబ్బు వద్దన్నా వెతుక్కుంటూ వస్తుందట. అంతేకాదు వీరి వద్దే ఎక్కువకాలం ఉంటుందట.



Click it and Unblock the Notifications