Latest Updates
-
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు!
ఈ రాశుల వారు భావోద్వేగాలను బయటపెట్టరట... ఎందుకంటే..
ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు.. ప్రతి ఒక్కరికీ అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సుఖాలు రావడం అనేది అత్యంత సహజం.

అయితే కొందరు వ్యక్తులు ఏ చిన్న కష్టమొచ్చినా.. వెంటనే ఎదుటి వ్యక్తులకు తెలిసేలా ప్రవర్తిస్తారు. అలాగే చిన్న సంతోషం కలిగినా దాన్ని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే అందరూ అలానే ఉండరు.

కొందరు వ్యక్తులు ఎలాంటి కష్టమొచ్చినా తమలోనే దాచుకుంటారు. అలాగే సుఖంగా ఉన్న సమయంలో కూడా అంతే సైలెంట్ గా ఉంటారు. వారు అలా తమ ఫీలింగ్స్ ను, ఎమోషన్స్ ను చెప్పుకోవడానికి కొన్ని కారణాలున్నాయట. ఎందుకంటే వీరు ఎవ్వరినీ అంత ఈజీగా నమ్మలేరట. తమ ఫీలింగ్స్ ని ఎవ్వరితోనూ షేర్ చేసుకోరట. వీరి ప్రతి ప్రాబ్లమ్ ను తామే సాల్వ్ చేసుకోవాలని భావిస్తారట.

అందుకే ఎలాంటి ఎమోషన్స్, ప్రాబ్లమ్స్ ను ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరట. ఇలాంటి వ్యక్తులను చూస్తే.. వీరు ఎవ్వరి గురించి ఏమీ పట్టించుకోరు.. తమ పనేమో తాము చూసుకుంటూ ఉంటారనిపిస్తుందట. అయితే వీరు అన్ని పనులు చేస్తారు.. కానీ వారి భావోద్వేగాలను మాత్రం ఏ మాత్రం బయటపడనివ్వరు. అందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటారట. తమ కష్టాల గురించి ఇతరులకు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని భావిస్తారట. అలాంటి వ్యక్తులెవరో సహాజంగా తెలుసుకోవడం కష్టమే. అయితే జ్యోతిష్యశాస్త్రం గ్రహాల ఆధారంగా రాశిచక్రాలను బట్టి అలాంటి వ్యక్తులెవరో తెలుసుకోవచ్చట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.

మిధున రాశి..
ఈ రాశి వారు చూడటానికి చాలా సింపుల్ గా ఉంటారు. వీరిలో ఎమోషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ రకమైన వ్యక్తులు అందరితో చాలా సులభంగా కలిసిపోతారు. అయితే వీరు తమ వ్యక్తిగత విషయాలను మరియు ఇతర విషయాలకు ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు. ఎందుకంటే వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పుకుని.. అందరి ముందు వీక్ అవ్వకూడదని భావిస్తారట. వీరు కనీసం కోపాన్ని కూడా బయటకు కనబడనివ్వరట.

కన్య రాశి..
ఈ రాశి వారు తమ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులైనా వాటిని ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే వీరు కష్టాలనైనా.. సుఖాలనైనా రెండింటినీ సమానంగా స్వీకరిస్తారు. అలాగే వీరు గతంలో జరిగిన విషయాల గురించి తలచుకుంటూ బాధపడరు. ప్రస్తుతం గురించి ఆలోచిస్తూ.. భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకుని జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు. తమ బాధలను ఇతరులకు చెప్పుకోవాలని అస్సలు భావించరు.

తులరాశి..
ఈ రాశి వారికి సహజంగానే వ్యక్తిగతంగా ఎక్కువ సమస్యలు ఉంటాయట. దీంతో వీరు చాలా విషయాలను, తమలోని భావోద్వేగాలను ఇతరులతో పంచుకునేందుకు పెద్దగా ఇష్టపడరట. తమ కష్టాల గురించి ఎదుటివ్యక్తులకు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికి ఏ మాత్రం ఆసక్తి చూపరట. అందుకే వీరిని చూసి.. చాలా మంది వీరు దేని గురించి పట్టించుకోరు అని అనుకుంటూ ఉంటారు. అయితే వీరు మాత్రం అన్ని పనులను చేస్తుంటారు. అయితే తమ ఫీలింగ్స్, ఎమోషన్స్ ను ఎవ్వరికీ కనబడకుండా జాగ్రత్త పడతుంటారట. తమకు జరిగిన నష్టాన్ని ఇతరులకు వివరించి వారిని సానుభూతి పొందడం ఎందుకని భావిస్తారట.

మకర రాశి..
ఈ రాశి వారు తమ భావోద్వేగాలను బయట పెట్టడానికి పెద్దగా ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల తాము ఇతరుల ఎదుట చులకన అవుతామని ఫీలవుతారు. అయితే వీరు ఎవరినైనా విశ్వసిస్తే మాత్రం తమ పర్సనల్ విషయాలను కూడా వారితో షేర్ చేసుకుంటారు. అయితే వీరు ఎవ్వరినీ అంత సులభంగా నమ్మరు.

కుంభ రాశి..
ఈ రాశి వారు తమ ఫీలింగ్స్ ను, ఎమోషన్స్ ను తమలోనే దాచుకుంటారు. అయితే వీరు ఎవరైనా వ్యక్తులను పూర్తిగా విశ్వసిస్తే, వారితో చాలా క్లోజ్ గా ఉన్న సందర్భంలో మాత్రం వారితో అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు. వారితో చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. అయితే తమ లోపల ఉండే ఉత్సాహాన్ని ఏ మాత్రం బయటకు కనబడనివ్వరు. అదే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వీరు తమలోనే దాచుకుంటారు.



Click it and Unblock the Notifications