For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 6 రాశుల వారు ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతారు..!!

|

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరియు ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. అలాగే మన జీవితాలు కూడా ఎక్కువగా ఇతరులపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకునే శక్తి మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కానీ చేదు వాస్తవం ఏమిటంటే తక్కువ మంది మాత్రమే ఇలా ఉంటారు. ఒకరి మీద ఆధారపడటం సరైందే కావచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అది ఎక్కువైతే మాత్రం సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.

Zodiac Signs Who Rely Heavily On Others

కొందరు తమ జీవితంలోని ప్రధాన సంఘటనల నుండి తమ ఇష్టానుసారం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది తమ జీవితాంతం ఇతరులపై ఆధారపడి జీవిస్తారు, ఇతరుల అభిప్రాయల కోసం ఎదురుచూస్తారు. దీనికి కారణం వారి పుట్టుక కావచ్చు. మనందరికీ మన జీవితంలో ఒకరికొకరు ఆధారం కావాలి, మనపై మనమే ఆధారపడే రోజులు కూడా వస్తాయి. మనకు నమ్మకం కలిగించే వ్యక్తులు ఉండాలి, మనకోసం ఉన్నమాన్న వారు కావాలి దీనిలో తప్పుఏమి ఉండదు. అయితే కొంత మంది మాత్రం ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు. కొంత మంది ఎవరిపైనా ఆధారపడకుండా బాధపడుతుంటారు. ఇతరులపై మనం ఆధారపడటం కూడా మన వ్యక్తిత్వ లక్షణాల్లో ఒక భాగం. ఇతరులపై ఆధారపడటం రాశిచక్రాలకు కూడా సంబంధించినది. మరి అలా ఏ ఏ రాశుల వారు ఇతరులపై ఆధారపడుతారో మనం తెలుసుకుందాం...

కన్యారాశి

కన్యారాశి

కన్యా రాశి వారు విశ్వసించినంతగా ఇతరులను విశ్వసించేవారు ఎవరూ ఉండరు, అందుకే వారు అడిగిన వెంటనే లేదనకుండా సహాయాన్ని పొందుతుంటారు. దీనికి కారణం వారి ప్రేమపూర్వక వైఖరి మరియు వారికి సహాయపడే వారితో వారు వ్యవహరించే విధానం. వారు తమకు సహాయం చేసేవారికి ప్రేమ మరియు విధేయతను చూపుతారు. అందువల్ల వారికి కావలసిందల్లా ఇతరుల నుండి సహాయం పొందడం సులభం. వీరికి ఏదైనా అవసరమైనప్పుడు ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతారు. అలాంటి వారిని వీరు ఎక్కువగా ఇష్టపడటం మరియు అభినందిస్తుంటారు.

సింహరాశి

సింహరాశి

సింహరాశికి ఎల్లప్పుడూ ఇతరుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంటారు. కాబట్టి వారు ఎల్లప్పుడూ ఇతరులను విశ్వసిస్తారు మరియు వారు వారితో ఉండాలని ఆశిస్తారు. ఇతరుల నుండి డబ్బు లేదా సహాయం ఆశించరు. వారు ఆశించేది ప్రేమ మరియు శ్రద్ధ. వారు తమ భావాలను వ్యక్తీకరించడానికి ఎల్లప్పుడూ ఇతరుల సహాయం తీసుకుంటారు. వారికి ఇష్టమైన వారు వారితోనే ఉండాలని కోరుకుంటారు. అలాగే ప్రతీది సరిగ్గా ఉండాలని వారికి భరోసా ఇచ్చే వారితోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతారు. వీరికి ఎలాంటి సలహా అవసరం ఉండదు, అయితే భావోద్వేగంలో ఉన్నప్పుడు వీరు ఎక్కువగా ఇతరుల మద్దతు కోసం చూస్తుంటారు.

మకరం

మకరం

మకర రాశి వారి గొప్ప కోరిక వారికి అప్పగించిన పనిని ఎల్లప్పుడూ పూర్తి చేయడమే. ముఖ్యంగా వీరు ఎల్లప్పుడూ తమ జట్టుతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. వారు తమకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి జట్టు యొక్క మద్దతు మరియు నిబద్ధత కోసం చూస్తారు మరియు ఎల్లప్పుడూ టీంకు సలహాలు మరియు సూచనలు ఇచ్చే స్థానంలో ఉండాలని కోరుకుంటారు. యజమానిగా మీ హోదాను పెంచడానికి మీకు ఎల్లప్పుడూ ఇతరుల సహాయం అవసరం. కాబట్టి వారు తమతో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు.

కర్కాటకం

కర్కాటకం

వీరు మంచి ప్రేమికులు, ఇతరులను విశ్వసించడమే కాకుండా, వారి స్వభావంతో ఇతరులతో త్వరగా కలిసిపోతారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఇతరులు తమకు సేవచేసే అవకాశాన్ని ఇస్తున్నారని వారు భావిస్తారు. వారు అందరితో సుపరిచితులుగా ఉంటారు కాబట్టి ఇతరులను సహాయం కోరడానికి వారికి ఏమాత్రం సంకోచం ఉండదు. మీరు వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు ఊహించరు, వారు మిమ్మల్ని క్రొత్త మరియు ఉత్తేజకరమైన అనుభవంలో నిమగ్నం చేస్తున్నారని వారు నమ్ముతారు.

వృషభం

వృషభం

వృషభం రాశి వారు స్వతంత్ర ఆలోచన మరియు మంచి మనస్సు గల రాశిచక్రం, కానీ మానసికంగా హాని కలిగిస్తారు. వీరు చేసే ప్రతి పనికి ఇతరుల ఆమోదం మరియు సహాయం అవసరమని వీరు భావిస్తారు. సహాయం కోరడానికి వీరు సిగ్గుపడరు మరియు వీరు స్వయంచాలకంగా ముందుకు వస్తారు. ఎల్లప్పుడూ ఇతరుల సలహా మరియు మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తారు. ఎల్లప్పుడూ వారి కుటుంబం మరియు స్నేహితుల సలహాలను వింటారు.

కుంభం

కుంభం

ఈ రాశి వారు ఒంటరిగా ఉండాలని ఇష్టపడుతారు కానీ ఒంటరిగా ఉండటానికి భయపడుతారు. ఒంటరిగా ఏం చేయలేరు మరియు వారికి భాగస్వామి ఉంటే వారు ఏదైనా సాధిస్తారు. వారు సహాయం మరియు సలహా ఇచ్చే వారిపై ఎక్కువగా ఆధారపడతారు. వీరి కోసం ఎవరైనా ఉచితంగా పనులు చేసే వ్యక్తులపై ఆధారపడుతారు. ఈ రాశి వారికి ఉన్న ఏకైక సమస్య ఎమిటంటే సహాయం చేసే వారి స్నేహితులకు వీరు కృతజ్ఞతలు కూడా చెప్పరు. వీరు ఇతరులపై ఆధారపడటాన్ని అసహ్యించుకుంటారు కానీ దాదాపు వీరికి ఉండే సంకేతం ఆధారపడటమే.

English summary

Zodiac Signs Who Rely Heavily On Others

People who born in these six zodiac signs are always rely on others.
Story first published: Tuesday, October 1, 2019, 18:03 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more