Latest Updates
-
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
46 ఏళ్ల తరువాత తెరవనున్న రత్నభాండాగారం.. పూరీ జగన్నాధ్ ఆలయ రహస్యం..!
ఒడిస్సాలోని పూరీ జగన్నాథ్ రత్న భాండాగారం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందులో నగలను ఎవ్వరూ ముట్టుకోకుండా విషసర్పాలు కాపలా కాస్తున్నాయని అంటున్నారు. వీటిని పుకార్లుగా తీసుకోవద్దని, ఇది నిజమేనని చాలా మంది వాదిస్తున్నారు. కొండచిలువలు కూడా వుంటాయని, లోపలికి వెళ్తే అవి మింగేస్తాయని కూడ చెబుతున్నారు. అక్కడ వున్న రత్నభాండాగారం గురించి రకరకాలుగా చెప్పుకుంటూ వున్నారు.

రత్నభాండాగారం తెరినప్పుడు అక్కడ వైద్యుల బృందం కూడా వుంటుంది. పాములను పట్టుకునే వారిని కూడా అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో రగ్నభాండాగారం విషయాన్ని బీజేపీ లేవనెత్తింది. ఈసారి ప్రభ్వుత్వం ఏర్పాటు చేస్తే రత్నభాండాగారాన్ని తెరిపిస్తామని, అక్కడ వున్న ఆస్థులకు లెక్కలు చెబుతామని బీజేపీ హామీ ఇచ్చింది.
ఈ రత్న భాండాగారం గురించి మొదటగా 1805వ సంవత్సరంలో పూరీ కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో వచ్చింది. అప్పుడు 128 బంగారు నాణేలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాల వస్త్రాలు, లభించాయ్. 1978 తర్వాత మళ్లీ మొదటిసారిగి ఈ రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు. గతంలో చాలా సార్లు ఈ రత్న భాండాగారాన్ని తెరవడానికి ప్రయత్నించినా చాలా సందర్భాల్లో లోపలికి వెళ్లలేకపోయారు. పురాతన దేవాలయాల భాండాగారానికి పాములు కాపలాగా వుంటాయన్న నమ్మకం ఇప్పటికీ చాలా మందిలో వుంది.
గతంలో రాజులు సమర్పించినా వజ్రాలు, బంగారు ఆభరణాలు ఎన్నో ఈ రత్నభాండాగారంలో వున్నాయని చాలా మంది భావిస్తున్నారు. వీటి ధర కూడా వెలకట్టలేదని కూడా చాాలా మంది అంచనా వేస్తున్నారు. పూరీ జగన్ాధుడికి సంబంధించిన వెలకట్టలేని సంపదలను ఐదు కర్రపెట్టెల్లో వుంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వకాలంలో ప్రతీ ఐదేళ్లకు ఒకసారి పెట్టెలను తెరిచి లెక్కించేవారు.

చివరిసారిగా 1978లో ఈ రత్నభాండాగారాన్ని తెరిచి లెక్కించారు. అప్పుడు లెక్కించడానికి 70 రోజుల వరకు సమయం పట్టింది. మళ్లీ రత్నభాండాగారాన్ని తెరిచి లెక్కించాలని ఒడిస్సా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో హైకోర్టు స్పందించి రత్నభాండాగారాన్ని లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు కూడా ఈ ఆదేశాలను గౌరవించింది.
ఈ భాండాగారాన్ని తెరిచే బాధ్యతలను హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రాథ్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ సభ్యులు భాండాగారాంలోని బంగారాన్ని లెక్కించి వాటి నివేదికను సమర్పిస్తుంది. లెక్కించే సమయంలో సభ్యులంతా సాంప్రదాయ దుస్తుల్లో వుండాలని ఆదేశాలను జారీ చేశారు.
పూరీ జగన్నాథ్ ఆలయానికి చెందిన జగ్‌మోహన్ సమీపంలో ఒక చిన్న ఆలయం రూపంలో ఈ రత్న భాండాగారం వుంది. అందులో రెండు పెట్టెలు వున్నాయ్. వీటిలో నిల్వలు చాలా ఎక్కువగా వున్నాయ్. అందులో పూరీ జగన్నాధులు, సోదరుడు బలబద్ర, సోదరి సుబద్రకు సమర్పించిన విలువైన వస్తువులు వున్నాయ్. వివిధ రాజులు బహుమతులుగా ఇచ్చిన వస్తువులు కూడా ఇందులో వున్నాయ్. దాదాపు 46 ఏళ్ల తరువాత ఈ భాండాగారాన్ని తెరుస్తున్నారు. అందుకే ఈ స్థాయిలో ఉత్కంఠ నెలకొని వుంది.
జులై 14న భాండాగారం తలుపు తెరవాలని ఆలయ కమిటి నిర్ణియించింది. ఈ గదలోని ఆభరణాలను వేరే చోటుకు తరలించాలని చూస్తున్నారు. భాండాగారం తెరవడానికి సుమారు 24 గంటల సమయం పట్టునున్నట్లు తెలుస్తోంది.



Click it and Unblock the Notifications