Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
PV Sindhu marriage: పీవీ సింధుకి కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu) పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. తెలంగాణకు చెందిన మాజీ ఐఆర్ఎస్ జీటీ వెంకటేశ్వర్ రావు కుమారుడైన యువ పారిశ్రామికవేత్త వెంకట దత్త సాయితో(venkata datta sai) పీవీ సింధు వివాహం(pv sindhu marriage) జరగనుంది. బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సైన్స్,మెషీన్ లెర్నీంగ్ పై మాస్టర్స్ డిగ్రీ చేసిన సాయి దత్తా 2019 నుంచి పోసిడెక్స్ టెక్నాలజీస్ లో(Posidex Technologies) ఎగ్జిక్యూటిడ్ డైరక్టర్ గా ఉన్నారు. కాగా,గత నెలలో పోసిడెక్స్ టెక్నాలజీస్ కొత్త లోగోను సింధూనే లాంఛ్ చేసింది. అంతకుముందు సాయి దత్తా జేఎస్ డబ్యూతో పాటు సౌర్ ఆపిల్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలో ఎండీగా కూడా చేశారు.
సింధు,సాయిదత్తా పెళ్లి డిసెంబర్ 22న రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో జరగనుందని సమాచారం. డిసెంబర్ 20 నుంచే పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయ్ పూర్ లో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో డిసెంబర్ 24న రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది కాలంగా సింధు,సాయి దత్తా మధ్య పరిచయం ఉందని..గత నెలలోని వీరికి పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు పీవీ సింధు తండ్రి రమణ తెలిపారు. గతంలో వీరిద్దరూ కొన్ని మ్యాచ్‌లు, సినిమాలకు కలసి హాజరయ్యారు.

జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉండడంతో ఈనెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకొన్నట్టు రమణ తెలిపాడు. పెళ్లి, రిసెప్షన్ అయిపోగానే సింధు మళ్లీ తన తర్వాతి టోర్నీలపై దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. కాగా, వరుసగా రెండు ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన పీవీ సింధు గత రెండేళ్లుగా చెప్పుకోదగిన విజయాలను సాధించలేకపోయింది. అయితే రెండు రోజుల క్రితం డిసెంబర్ 1న జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ విజేతగా సింధు విషయం తెలిసిందే. గత రెండేళ్లలో సింధు ఇంటర్నేషనల్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి.
చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్ విజేతగా నిలిచింది సింధు. 2016లో రియో ఒలింపిక్స్ లో తొలిసారి రజత పతకం సాధించిన సింధు 2022 టోక్సో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచింది. ఇలా వరుసగా రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఇక,పీవీ సింధు ఇటీవల వైజాగ్ లోని అరిలోవా ఏరియాలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.



Click it and Unblock the Notifications