Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
IPLలో ఇక RCB టీం ఉండదు.. సంచలన నిర్ణయం తీసుకున్న జట్టు యాజమాన్యం?
IPLలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో RCB కూడా ఒకటి. ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క కప్పు కూడా సాధించకపోయినా ఈ జట్టుకు ఉన్న అభిమానులు మాత్రం అలానే ఉన్నారు. ఎదో ఒక ఏడాది తమ జట్టు ఐపీఎల్ ట్రోఫీని సాధిస్తుందనే నమ్మకంతో ఆ జట్టు ఆటగాళ్లను, ఆ జట్టును సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది దిగ్గజాలు ఆడిన ఈ ఫ్రాంచైజ్‌పై ఇటీవల నెటిజన్స్‌తో అభిమానుల్లో కూడా అసహనం వ్యక్తం అవుతుంది.
అందులో ఒకటి RCB సిరాజ్, చాహల్ వంటి బౌలర్లను వేలంలో తీసుకోకపోవడంతో పాటు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఈ జట్టు IPL-2025 ప్రారంభం నాటికి ఉండకపోచ్చనే వార్తలు వస్తున్నాయి. అసలు RCB జట్టు ఎందుకు ఉండదు? దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

RCBపై మండిపడుతున్న ఫ్యాన్స్
ఐపీఎల్ వేలంలో గొప్ప గొప్ప ఆటగాళ్లను తీసుకోకుండా డబ్బులు మిగిల్చుకున్నారని ఇప్పటికే ఆర్సీబీ యాజమాన్యంపై అభిమానులు కోపంతో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్సీబీ యాజమాన్యం చేసిన మరో పని వల్ల అభిమానులకు ఆ కోపం మరింత ఎక్కువయ్యింది. వేలంలో ఆర్సీబీ కొన్న ప్లేయర్స్ ఫోటోలు, వీడియోలు తమ అనాలిసిస్‌ను ఆ జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. ఈ పోస్టులకు హిందీలో ట్వీట్ చేయడం, హిందీలో ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ పెట్టడం ఆర్సీబీ అభిమానులకు నచ్చడం లేదు.
తమది కర్ణాటక అని, ఈ పోస్టులు క్యాప్షన్లు కన్నడలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. హిందీలో పోస్టులు చేసి తమ మనోభావాలను దెబ్బతీయకూడదని పేర్కొంటున్నారు. హిందీలో ట్వీట్స్, క్యాప్షన్స్ పెట్టుకోవాలంటే ఆర్సీబీ పేరును తీసేసి నార్త్‌లో వేరే ఏదైనా జట్టును కొనుక్కోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఆర్సీబీ యాజమాన్యానికి కొంత తలనొప్పిగా మారింది. ఇది ఇలానే కొనసాగితే జట్టు కూడా IPL నుంచి తొలిగిపోయి ప్రమాదం ఉంది.
RCB యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో!
ఈ వివాదంపై RCB యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పటికే ప్లేయర్లను కొనలేదని అభిమానులు పెడుతున్న పోస్టులకు ఒక్కో పోస్టు ద్వారా రిప్లై ఇస్తున్న యాజమాన్యం ఈ వివాదంపై ఏ విధంగా తమ స్పందనను అభిమానులకు తెలియజేస్తుందో చూడాలి. సాధారణంగా కర్ణాటక ప్రజలకు భాషపై అభిమానం ఎక్కువగా ఉంటుంది. తమ మాతృభాష కోసం ఏమైనా చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. అలాంటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు వారికి కోపం వచ్చిందని చెప్పాలి. మరి దీనిపై ఆర్సీబీ యాజమాన్యం స్పందన కోసం వేచి చూడాలి.
RCB టీం ఎలా ఉంది?
ఇప్పటి వరకు ఆడిన సీజన్లు అన్నిటితో పోలిస్తే వచ్చే సీజన్‌లో ఆర్సీబీ జట్టు కొంత బలమైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే బ్యాటింగ్, విభాగంతో పాటు బౌలింగ్ విభాగం కూడా ఈసారి చాలా పటిష్టంగా ఉంది. ఆల్ రౌండర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, భువనేశ్వర్ కుమార్, సుయాస్ శర్మ వంటి స్టార్ క్రికెటర్స్ ఉన్నారు. మరి ఈ ఏడాదైనా ఆర్సీబీ ట్రోఫీ గెలుస్తుందో లేదో చూడాలి.



Click it and Unblock the Notifications