Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.1.5 లక్షలు..ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా వెంటనే!
మనదేశంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఏదైనా ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి గోల్డెన్ అవర్ లోపు అంటే ప్రమాదం జరిగిన గంటలోపే ట్రీట్మెంట్ చేస్తే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని తరుచుగా చాలామంది డాక్టర్లు,నిపుణులు చెబుతుంటారు. అయితే రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని ఎవరైనా హాస్పిటల్ కి తీసుకెళ్తే ముందుగా డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ ప్రారంభించే హాస్పిటల్స్ మనదేశంలో చాలానే ఉన్నాయి.
మరికొన్ని సమయాల్లో ఇన్స్యూరెన్స్ పాలసీ ఉంటే డాక్యుమెంట్స్ చూపించాలని అడుగుతాయి హాస్పిటల్స్. అయితే ఆ టైంలో గాయపడిన వ్యక్తిని వాటిని చూపించే పరిస్థితి కూడా ఉండదు. దీని కారణంగా రోడ్డు యాక్సిడెంట్ లో గాయపడిన వారికి సహాయం అందించడంలో ఆలస్యం జరుగుతుంది. ఫలితంగా సరైన టైంలో ట్రీట్మెంట్ పొందలేక యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తులు మరణిస్తుంటారు.

భారత్ లో అతిపెద్ద సమస్యగా మారిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం.. "క్యాష్ లెస్ ట్రీట్మెంట్ 2025" అనే ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాల బాధితులకు ఈ కొత్త పథకం ఒక ఆశాకిరణం లాంటిది. ఈ పథకం కింద యాక్సిడెంట్స్ లో గాయపడిన ఏ వ్యక్తి అయినా హాస్పిటల్ కి వస్తే వారికి రూ.1.5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ లభిస్తుంది. దీంతో వాళ్ల పేరేంట్స్ వెంటనే డబ్బుల కోసం కంగారు పడాల్సిన ఇబ్బంది ఉండదు,గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకెళ్లిన వ్యక్తి హాస్పిటల్ డబ్బులు కట్టనవసరం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే, ఎలాంటి ముందస్తు ఇన్స్యూరెన్స్ డాక్యుమెంట్స్ చూపించకుండానే ఈ పథకం కింద గాయపడిన వ్యక్తికి ఈ కొత్త పథకం కింద ట్రీట్మెంట్ చేస్తారు.
దేశవ్యాప్తంగా సెలక్ట్ చేసిన గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్ ను ప్రభుత్వం ఈ పథకంతో అనుసంధానిస్తుంది. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించవచ్చు,విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. ఈ పథకం ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం దేశమంతటా వర్తిస్తుంది. ట్రీట్మెంట్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించక్కర్లుదు. మీ ఆర్థిక స్థితి గురించి అక్కర్లుదు,కులం,బీమా ఏమీ అవసరం లేదు. గాయపడి హాస్పిటల్ కి వస్తే ప్రాథమిక అత్యవసర ట్రీట్మెంట్ ను మాత్రమే కాకుండా గాయం తీవ్రతను బట్టి పూర్తి మాస్పిటల్ ట్రీట్మెంట్,ఆపరేషన్,మెడిసిన్,టెస్టులు కూడా ఫ్రీగానే చేస్తారు.
హాస్పిటల్ కి బిల్లు ఎలా వస్తుంది
పేషెంట్ కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ బిల్లును ప్రభుత్వ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తుంది. అయితే రాష్ట్ర హెల్త్ ఆర్గనైజేషన్ ఆ బిల్లుు చెక్ చేస్తుంది.సరైనదని తేలితే హాస్పిటల్ కి ఆ డబ్బుని ఇస్తుంది.
వాస్తవానికి ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా 202 మార్చి 1నే ప్రారంభించారు. ట్రయల్ విజయవంతమైన తర్వాత మే 5,2025 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.



Click it and Unblock the Notifications