Latest Updates
-
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?
హైదరాబాద్ లో లవ్ జీహాద్?: బలవంతంగా ఇస్లాంలోకి మార్చి..తొలిరాత్రే నలుగురితో కలిసి అత్యాచారం
హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ, పెళ్లి పేరుతో ఒక మహిళను మోసం చేసి, మతం మార్చి, ఆమె జీవితాన్ని నరకప్రాయం చేసిన వైనం సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
హిందూ పేరుతో నమ్మించి.. వంచించి..
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దారుణమైన కథ 2021 మే నెలలో మొదలైంది. బాధితురాలు కూకట్ పల్లిలో నివసిస్తుంటది. నిందితుడు నవాజ్, ఆమెకు చెందిన షాపును అద్దెకు తీసుకునే నెపంతో పరిచయమయ్యాడు. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్న నవాజ్, ఆమెను నమ్మించడానికి ఏకంగా తన మతం మార్చుకున్నానని కట్టుకథలు అల్లాడు.

తాను హిందూ మతాన్ని స్వీకరించి, తన పేరును నవదుర్గగా మార్చుకున్నానని నమ్మించాడు. అతని కుటుంబ సభ్యులు కూడా ఇదే అబద్ధాన్ని నిజమని నమ్మించారు. ఆ నమ్మకంతోనే ఆమె అతనితో స్నేహం చేసింది.
మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. బ్లాక్ మెయిలింగ్
మే 24, 2021న తన కుటుంబ సభ్యులతో మీటింగ్ ఉందని నమ్మించి ఆమెను ఒక రిసార్ట్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆహారంలో మత్తుమందు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగక, ఆ సమయంలో అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీసి తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే ఆ ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బెదిరించాడు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి 2025 జులైలో కూకట్ పల్లి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడు.
మొదటి రాత్రే గ్యాంగ్ రేప్
పెళ్లి తర్వాత మొదటి రాత్రే బేగంపేట ఫ్లాట్ లో నవాజ్, అతని సోదరులు మునావర్, షారూఖ్, ఇస్మాయిల్, స్నేహితుడు నీలోఫ్ కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని..వీడియోలు తీసి బెదిరించి పలుమార్లు భర్త,అతని సోదరులు తనపై అత్యాచారం చేశారని భాదితురాలు వాపోయింది. హవాలా వ్యాపారం చేసే నవాజ్.. తన దగ్గర నుంచి సుమారు రూ.16 లక్షల నగదు వసూలు చేశారని తెలిపింది. తన పేరు మీద లోన్లు తీసుకున్నారని, తన బంగారం అమ్మించారని, తన పేరు మీద ఉన్న ల్యాండ్ కూడా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
బలవంతంగా మత మార్పిడి
పెళ్లయ్యాక ఆమె పేరును నజీరాగా మార్చి, ఖురాన్ చదవాలని, కల్మా పఠించాలని ఒత్తిడి చేశారు. శాకాహారి అయిన ఆమెతో బలవంతంగా బీఫ్ తినిపించి హింసించారని ఆమె తెలిపింది. ఈ ఏడాది జనవరిలో నవాజ్ పరారయ్యాడు. దుబాయ్ లో ఉండే కొందరు వ్యక్తులు మనల్ని చంపేస్తారని, మన కోసం వెతుకుతున్నారని, అందుకే మనం దాక్కోవాలని నవాజ్ చెప్పేవారని బాధితురాలు మీడియాకు తెలిపింది.
మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఆరా తీయగా.. నవాజ్ కు ఇది మూడో వివాహమని తెలిసి షాక్‌కు గురైంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. జనవరి 16న తాను పోలీసులను ఆశ్రయించినా సరైన స్పందన లేదని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేయాల్సింది పోయి, మిస్సింగ్ కేస్ గా నమోదు చేశారని ఆమె పేర్కొంది. తర్వాత ఏప్రిల్ 4న కూకట్ పల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారు.



Click it and Unblock the Notifications
