Latest Updates
-
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే!
ఇది కదా సక్సెస్ అంటే: 8వ తరగతి ఫెయిల్, కిరాణ కొట్టు పెడితే నష్టం..కానీ నేడు వేల కోట్ల కంపెనీలకు ఓనర్
ఏదైనా ఒక బిజినెస్ లో కానీ లేదా చదువులో కానీ ఫెయిల్ అయితే చాలామంది నిరుత్సాహపడిపోతుంటారు. ఈ క్రమంలో కొందరు పిరికివాళ్లు ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోతుండటం మనందరం చూస్త ఉంటాం. అయితే కొద్దిమంది మాత్రమే తమ వైఫల్యాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటూ ఎవ్వరూ అందుకోలేని స్థాయికి ఎదిగి ప్రపంచానికి ఓ ఉదాహరణగా నిలుస్తారు. అలాంటివాళ్లలో ఒకరే సతీష్. కేవలం 80వేల రూపాయలతో ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి నేడు కోట్ల రూపాయల విలువైన కంపెనీకి ఓనర్ గా మారాడు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ లో నివసిస్తున్నాడు, 5 రోల్స్ రాయిస్ కార్లు మెయింటెయిన్ చేస్తున్నాడు. సతీష్ లైఫ్ ఒక సాధారణ స్థాయి నుంచి వేల కోట్ల రూపాయల స్థాయికి ఎలా మారిందో ఇక్కడ చూడండి.
మనదేశం నుంచి ప్రతి ఏటా లక్షలామంది మెరుగైన అవకాశాలు, మంచి భవిష్యత్తు కోసమని గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏటా చాలామంది నర్సులుగా, తాపీ మేస్త్రీ, బిల్డింగ్ కూలీ,ఉద్యోగ,బిజినెస్ పనుల కోసం గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) దేశానికి ఎక్కువగా వెళ్తారు. మంచి భవిష్యత్తు,మెరుగైన ఉపాధి అవకాశాలు కోరుకుంటూ యూఏఈ వెళ్లిన వాళ్లలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ కి చెందిన సతీష్ సంపాల్ ఒకరు. 1985 మే 25న మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్ లో జన్మించిన సతీష్ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో విలాసవంతమైన జీవితానికి చేరింది.

8వ తరగతి ఫెయిల్,మొదటి వ్యాపారం ఫెయిల్
సతీష్ సంపాల్ ప్రస్థానం పూలపాన్పు కాదు. ఎనిమిదో తరగతితోనే చదువు మానేసి 15 ఏళ్ల వయసులో ఒక కిరాణా దుకాణం ప్రారంభించారు. కానీ అనుభవం లేకపోవడంతో ఆ వ్యాపారం త్వరలోనే మూతపడింది. అయినప్పటికీ ఆయన నిరాశ చెందలేదు. తన భవిష్యత్తును వెతుక్కుంటూ అమ్మ ఇచ్చిన రూ. 80,000తో దుబాయ్ వెళ్లాడు. కొత్త దేశం, తెలియని మనుషులు, పరిమితమైన డబ్బు... ఆయన ప్రయాణం సవాళ్లతో నిండి ఉంది. దుబాయ్ లో అడుగుపెట్టిన మొదట్లో సతీష్ అనేక కష్టాలను, మోసాలను ఎదుర్కొన్నారు. తాను సులభంగా ప్రజలను నమ్మి అప్పు ఇచ్చేవాడిని, కానీ ఆ డబ్బు తిరిగి వచ్చేది కాదు. ఎన్నోసార్లు మోసపోయాను అని ఆ రోజులను సతీష్ ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆయన జీవితంలో ఎదురైన కొన్ని తీవ్ర అవమానాలు ఆయనను మరింత పట్టుదలగా మార్చాయి. ఆ అవమానాలే తనను ముందుకు నడిపిన అతిపెద్ద ప్రేరణ అని ఆయన బలంగా నమ్ముతారు.
దుబాయ్ లో దీంతో దశ తిరిగిపోయింది
సతీష్ స్టాక్ మార్కెట్ కు సంబంధించిన చిన్న చిన్న సేవలతో తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. నెమ్మదిగా అనుభవం, విశ్వాసం సంపాదించి 2018లో ANAX హోల్డింగ్ అనే సంస్థను స్థాపించారు. నేడు ఆ సంస్థ ANAX డెవలప్ మెంట్స్, ANAX హాస్పిటాలిటీ, ANAX క్యాపిటల్ అనే మూడు ప్రధాన విభాగాలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది. ఆయన విజయం వెనుక ఉన్న రహస్యం గురించి అడిగితే..కృషి, అదృష్టం అని రెండు మాటల్లో చెబుతారు. అదృష్టం మీ వైపు ఉన్నప్పుడు, మీరు కష్టపడి పనిచేస్తే, ఆ అదృష్టమే మిమ్మల్ని మరింత కష్టపడమని ప్రోత్సహిస్తుంది. చివరికి విజయం మీదే అవుతుంది అని సతీష్ చెబుతుంటారు.
తమన్నా లాంటి సెలబ్రిటీలను పిలిపించుకొని బర్త్ డే పార్టీ
నేడు సతీష్ సంపాల్ దుబాయ్ లో అత్యంత సంపన్నులలో ఒకరు. బుర్జ్ ఖలీఫాలో నివసించడమే కాకుండా ఐదు కస్టమ్ మేడ్ రోల్స్ రాయిస్ కార్లకు ఆయన యజమాని. ఇటీవల తన ఏడాది కుమార్తెకు బహుమతిగా ఒక గులాబీ రంగు రోల్స్ రాయిస్ కారును ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఆమె మొదటి పుట్టినరోజు వేడుకను అట్లాంటిస్ ది రాయల్ హోటల్‌లో బాలీవుడ్ తారలు రహత్ ఫతే అలీ ఖాన్, తమన్నా భాటియా, అతిఫ్ అస్లాం వంటి ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించారు.
అయితే ఏడాది వయస్సు ఉన్న కూతురికి రోల్స్ రాయిస్ గిఫ్ట్ గా ఇవ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం సతీష్ తన భార్య తబిందా, కుమార్తెతో కలిసి దుబాయ్ హిల్స్ లో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 60కి పైగా గదులు ఉన్న ఒక మహా భవనంలోకి మారబోతున్నారు. ఒకప్పుడు ఎనిమిదో తరగతి ఫెయిలైన కుర్రాడు, నేడు వేలాది మందికి స్ఫూర్తిగా నిలవడం సతీష్ సంపాల్ సంకల్ప బలానికి నిదర్శనం.



Click it and Unblock the Notifications











