Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
Sunita Williams Video: సేఫ్ గా భూమి మీదకు..సునీతా విలియమ్స్ కి హాయ్ చెప్పిన డాల్ఫిన్లు,వీడియో చూడండి
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి ఎట్టకేలకు 9 నెలల తర్వాత భూమ్మీద అడుగుపెట్టింది. గతేడాది 8 రోజుల మిషన్ లో భాగంగా బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంతేక కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు. వీరిని తీసుకెళ్లిన స్టార్ లైనర్ క్యాప్సుల్ లో సాంకేతిక కారణాలు తలెత్తాయి. దీంతో వీరిని తిరిగి తీసుకురాకుండానే అది గతేడాది సెప్టెంబర్ లో తిరిగొచ్చేసింది. దీంతో 9 నెలలుగా ఇద్దరు ఆస్ట్రోనాట్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. అయితే ఎట్టకేలకు బుధవారం వీరు సేఫ్ గా భూమ్మీద కాలుమోపారు. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ విజయవంతంగా ముగియడంతో అందరిలో ఆనందం వెల్లివిరిసింది.
286 రోజుల తర్వాత ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' ప్రకటించింది. ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ.. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ పేరుతో ఓ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఈ వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చింది. బుధవారం ఉదయం 3:27 గంటల సమయంలో ఫ్లోరిడా తీరంలో డ్రాగన్ క్యాప్సుల్ పడింది. ఆ తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఆ క్యాప్సుల్ సైడ్ హ్యాచ్ ఓపెన్ చేసి తమ కోసం అక్కడే రెడీగా ఉన్న పడవలోకి ఎక్కారు. సముద్రంలో నుంచి పడవలో వీరిని బడ్డుకు తీసుకొచ్చారు. అయితే చాలా రోజుల తర్వాత భూమ్మీదకు వచ్చిన ఈ వ్యోమగాములు ఇక్కడి వాతావరణానికి తిరిగి అలవాటు పడేలా,ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా చూసేందుకు వీరిని 45 రోజుల పునరావాస కార్యక్రం కోసం హ్యూస్టన్ కి తీసుకెళ్లారు. వ్యోమగాములిద్దరూ క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ నౌకలో ఆ క్యాప్యుల్ ని కూడా ఎక్కించి తీసుకెళ్లారు.

అయితే స్సేస్ క్రాఫ్ట్ క్యాప్సుల్ సముద్రంలో పడగానే దాని చుట్టూ డాల్ఫిన్స్ సందడి చేస్తూ తిరిగాయి. క్యాప్సుల్ నుంచి సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ ని క్యాప్సుల్ నుంచి బయటకు తీసే ఆపరేషన్ జరుగుతున్న సమయంలో డాల్ఫిన్లు క్యాప్సూల్ చుట్టూ ఈదుతూ కనిపించాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతరిక్షం నుంచి భూమ్మీదకు 9 నెలల తర్వాత అడుగుపెట్టిన సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్ కి పెద్ద సంఖ్యలో డాల్ఫిన్లు కూడా స్వాగతం పలుకుతున్నాయి, వారికి హాయ్ చెప్పేందుకు ఆ డాల్ఫిన్లు అక్కడికి వెళ్లాయి చూడండి అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన క్షణాలను యూట్యూబ్, ఎక్స్ లో నాసా లైవ్ ప్రసారం చేసింది. దివి నుంచి భువికి చేరిన వాళ్లలో సునితా విలియమ్స్,విల్మోర్ తొ పాటుగా స్పేస్ ఎక్స్ క్రూ 9 వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి గోర్బునవ్ ఉన్నారు.



Click it and Unblock the Notifications