Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కోట్లు ఖర్చు, భారత కరెన్సీ కట్టలతో వినాయకుడి గుడి, విగ్రహం, కళ్లు జిగేల్ అంటున్నాయి (వీడియో)
Ganesh Chaturthi: విభిన్నమైన కాన్సెప్ట్‌లతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. వినాయక చవితి సందర్బంగా దేశంలోని పలు వినాయకుడి ఆలయాలు ఘనంగా ముస్తాబు అయ్యాయి. ఒక విగ్రహానికి మరో విగ్రహం భిన్నంగా ఉంటున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకరికి ఒకరు పోటీగా వినాయకుడి విగ్రహాలు తయారు చేశారు.
బెంగళూరునగరంలో గణపతి మందిరాన్ని భారత కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించారు. ఒకవైపు రూ 10, రూ 20, రూ 50, రూ 100, రూ 500 రూపాయల నోట్ల దండలతో అలంకరించారు, మరో వైపు భారతలో చలామణి అవుతున్న నాణేలతో అలంకరణతో పాటు రూ. 10, రూ 20 నాణేలతో కళ్లు చెదిరేలా అలంకరించారు.

బెంగళూరు నగరంలోని జేపీ నగర్ రెండో స్టేజ్ లోని పుట్టేనహళ్లిలోని సత్యసాయి గణపతి ఆలయంలో అంగరంగ వైభవంగా గణేశుడి విగ్రహం తయారు చేశారు. వేలాది మంది భక్తులు వినాయకుడి గుడికి వెళ్లి వస్తున్నారు. సత్య గణపతి షిరాడీ సాయిబాబా ట్రస్టు నిర్వహకులు భారత కరెన్సీ నోట్లు, నాణేలను అలంకరించేందుకు సుమారు మూడు కోట్ల రూపాయలను వినియోగించారు.
రూ. 58 లక్షల విలువైన రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలతో తరువాత రెండు కోట్లకు పగా విలువైన రూ 10, రూ 20, రూ 50, రూ 100, రూ 200, రూ 500 నోట్ల కట్టలతో వినాయకుడి గుడిని అలంకరించారు. ప్రత్యేకంగా నోట్ల కట్టలు, నాణేలతో అలంకరించిన వినాయకుడి గుడి, విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా, ఈ వైభవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు వెలుతున్నారు.
గురుపౌర్ణమి నాడు షిర్డీ సాయిబాబాను కొబ్బరికాయలు, బాదం, ఖర్జూరం, పండ్లతో అలంకరించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ట్రస్ట్ నిర్వహకులు ఈసారి గణేషోత్సవానికి స్వయంగా లక్ష్మీదేవితో వినాయకుడి విగ్రహంతో పాటు గుడిని అలంకరించారు. 120 మందికి పైగా ఉన్న బృందం గుడిలో కరెన్సీ నోట్లను అలంకరించేందుకు పక్షం రోజులు కష్టపడ్డారని నిర్వహకులు అంటున్నారు.
అలాగే చంద్రయాన్-3 విజయంతో మన ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ప్రయత్నించారు. జై కర్ణాటక, జై జవాన్ జై కిసాన్, మేరా భారత్ మహాన్ థీమ్‌లతో నాణేలతో చక్కగా అలంకరించారు. వినాయకుడి గుడిని అలంకరించడానికి ఈ సొమ్ము అంతా భక్తులు ఇచ్చారని, ట్రస్టు జమ చేసిన సొమ్ము కూడా ఉపయోగించామని ట్రస్టీ రామ్మోహన్ రాజ్ అంటున్నారు.
గుడిలో కరెన్సీ నోట్లను కాపాడటం కోసం భద్రత కోసం 15 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించగా, భద్రత కోసం 20కి పైగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సోమవారం వేకువ జామున 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలంకరణ చూసేందుకు వచ్చే భక్తులపై సీసీ కెమెరాల నిఘా ఉంది.
కరెన్సీ నోట్ల కట్టలతో అలంకరించిన నోట్లను భక్తులు ముట్టుకోకుండా బారికేడ్ వేసి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈసారి గణేశోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం ఇక్కడి కాన్సెప్ట్ ప్రజలను ఆకర్షిస్తోంది. గణేశ చతుర్థి నాడు వివిధ రకాల వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజ పునస్కారాలు నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications