Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
రియల్ హీరో: మంచి ఉద్యోగం వదిలేసి లక్షల చెట్లను నరకకుండా కాపాడిన హైదరాబాదీ
మనదేశంలో ఇప్పుడున్న సిటీలు చాలావరకు కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్నాయి. ఏదైనా రోడ్లు వేయాలన్నా, కొత్తగా ఏదైనా నిర్మించాలన్నా ఉన్న చెట్లను నరికేస్తున్నారు. అయితే వాటి స్థానంలో కొత్త చెట్లను నాటకపోవడంతో సిటీల్లో వాతావరణంలో కూడా అనేక రకాల మార్పులు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్,బెంగళూరులో అయితే కొన్నేళ్ల క్రితం ఏడాది పొడవునా చల్లగా ఉండేది వాతావరణం..అయితే క్రమంగా చెట్లు కనుమరుగవుతుండటంతో ఇప్పుడు నిప్పులు కక్కే వేడి ఇక్కడ ఉంటోంది.
అయితే రోడ్ల విస్తరణ కోసం చెట్లు నరికేస్తుడం చూస్తూ చాలామంది పక్కగా తమ ఆఫీసులకు వెళ్లిపోతుంటారు చాలామంది. కానీ ఒక్కడు మాత్రం అలా చేయలేదు. చెట్లు నరకడం చూసి అతడిలో అంతులేని బాధ ఏర్పడింది. ఎలాగైనా దాన్ని ఆపాలనుకున్నాడు. అయితే రోడ్డు విస్తరణ జరగాలంటే ఆ చెట్లు అక్కడ ఉండకూడదు..చెట్లు నరకకుండా అది జరగదు..ఏం చేద్దాం అని ఆలోచించాడు. దీంతో అతడికి ఓ ఉపాయం తట్టింది. దీంతో వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత అతడు చేసిన పనికి అందరూ శభాష్,రియల్ హీరో అంటూ అతడిని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడో ఇక్కడ చూడండి.

హైదరాబాద్ లో నివసించే 46 ఏళ్ల రామచంద్ర అప్పారి అనే వ్యక్తి ఎప్పటిలాగే ఓ రోజు తన ఆఫీసుకి వెళ్తున్న సమయంలో హైవేపై రోడ్డు విస్తరణ కోసం అధికారులు చెట్లు కట్ చేస్తుండటం చూశాడు. దీంతో రామచంద్ర చాలా మనస్థాపం చెందాడు. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అనుకున్నాడు. ఆ రోజంతా అతడిలో బుర్రలో అనేక ఆలోచనలు. వందల ఏళ్ల క్రితం చెట్లను నరకకుండా వాటిని అక్కడి నుంచి తీసి మరో చోట పెట్టే ఈజిప్టియన్ల టెక్నిక్ గురించి తెలుసుకున్నాడు. ఇండియాలో అసలు ఎవరు ఈ పని చేయడం లేదని గ్రహించాడు. తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2010లో గ్రీన్ మార్నింగ్ హార్టికల్చర్ సర్వీసెస్ ఫ్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశాడు.

2010 నుంచి ఈ కంపెనీ చెట్లను నరకకుండా వాటిని యధాతథంగా మరో ప్లేస్ కి తరలించే పని చేస్తోంది. ఇప్పటిదాకా హైదరాబాద్,బెంగళూరు, కోల్ కతా,వైజాగ్,ఢిల్లీ వంటి నగరాల్లో 1లక్షా 50వేలకు పైగా చెట్లను కాపాడాడు. చెట్లను వేర్ల నుంచి తీసి వాటిని మరో ప్లేస్ లో ఉంచే పని ఈయన కంపెనీ చేసేది. దీనిని ట్రీ ట్రాన్స్ లొకేషన్ అని అంటారు.
ప్రారంభంలో అన్నీ సవాళ్లే
రామంచంద్ర కంపెనీ ప్రారంభించిన సమయంలో ఫండింగ్ విషయంలో ఇబ్బందులు,బెదిరింపులు వచ్చేవి. చెట్లను కాపాడితే నీకు డబ్బులు ఎవరు ఇస్తారు అని మొదట్లో చాలామంది ఈయనతో అంటుండేవారు. అయితే రామచంద్రకు మాత్రం మనసులో అంతా క్లియర్ గా ఉంది. తాను అనుకున్న పనితో ముందుకు సాగడం ప్రారంభించాడు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ సమయంలో తమ ఐడియా ఉపయోగించి 800కు పైగా చెట్లను నరకకుండా కాపాడగలిగాడు. ఆ తర్వాత ఇక అలా అలా 90కి పైగా రకాల లక్షల చెట్లను దేశవ్యాప్తంగా ఇలా కాపాడగలిగాడు. ఇందులో చాలా చెట్లకు బతికే ఛాన్స్ 80-90శాతం ఉంది. ఇప్పుడున్న యువత కూడా కొత్త ఐడియాలు,పద్ధతులతో ముందుకొచ్చి చెట్లను కాపాడాలని రామచంద్ర విజ్ణప్తి చేస్తున్నాడు.

ఎంత ఖర్చు అవుతుంది
చెట్లను ఉన్న ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి మార్పిడి చేయడానికి అయ్యే ఖర్చు చెట్టు పరిమాణం, చెట్ల సంఖ్య, దానిని ఎంత దూరం మార్చాలి అనే దానిపై ఆధారపడి ఉంటుందని రామచంద్ర చెబుతున్నారు. చెట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఛార్జ్ గణనీయంగా తగ్గుతుంది.. ఛార్జీలు దాదాపు రూ. 6,000 నుండి ప్రారంభమవుతాయి, కానీ తాము ఒక ఆర్డర్ కు రూ. 1.5 లక్షలు కూడా వసూలు చేసినట్లు గతంలో రామచంద్ర చెప్పారు.



Click it and Unblock the Notifications











