Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్.. మహిళలకు వరాల జల్లు..!!
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2024 -2025వ సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొమ్మిది రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం రూ.48 లక్ష్ల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పన్నుల ద్వారా 28 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా 4లక్షల కోట్లను సమకూర్చనున్నారు. వ్యవసాయానికి 1.52 లక్షల కోట్లను కేటాయించారు. విద్యా, నైపుణ్యాభివృద్ధికి 48 వేల కోట్లను కేటాయించారు. బడ్జెట్‌లో కేంద్ర మంత్రి ఏ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారో, వేటికి ఎంత కేటాయించారో ప్రధానంగా తెలుసుకుందాం.

మూడు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్నుల నుంచి తప్పించారు. 3 నుంచి 7 లక్షల మధ్యలో ఉన్నవారికి 7 లక్షలు, ఇలా ఆదాయాన్ని బట్టి పనున్ను విధించారు. క్యాన్సర్ నివారణ పట్ల ప్రత్యేక దృష్టిని పెట్టారు. మూడు రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు.
ఇక అమెజాన్ లాంటి ఈ కామర్స్ వెబ్‌సైట్లపై టీడీఎస్‌ను తగ్గించడం ఆన్‌లైన్ షాపింగ్ కొంత చీప్ కానుంది. మొబైల్ యాక్ససరీస్ పై 15 శాతం కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించారు. మహిళలకు ప్రధాన్యం. మహిళల ఆస్థుల రిజిస్ట్రేషన్‌లో డ్యూటీని తగ్గించారు. బంగారం, వెండిపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీని తగ్గించారు.
కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించనున్నారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం ద్వారా దీన్ని అమలు చేయనున్నారు. 3 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లను కూడా నిర్మించనున్నారు. 25 వేల గ్రామలకు కొత్తగా రహదారులను వేయనున్నారు.
వచ్చే 5 సంవత్సరాల్లో 5 కోట్ల మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. వ్యావసాయ అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లను కేటాయించనున్నారు. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 3 లక్షల కోట్లను కేటాయించనున్నారు. కళాకారులకు ప్రోత్సాహకాలను పెంచనున్నారు. స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు.
విద్యా, ఉద్యోగం, నైపుణ్యాభివృద్ధికి 1.8 లక్షల కోట్లను కేటాయించారు. హైయ్యర్ ఎడ్యూకేషన్ చేయాలనుకునేవారికి 10 లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నారు. ముద్ర యోజన కింద ఇచ్చే 10 లక్షల రూపాయల రుణాన్ని 20 లక్షలకు పెంచారు. హైదరాబాద్ నుంచి బెంగళూర్ వరకు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు.
అమరావతి అభివృద్ధికి 15వేల కోట్లను కేటాయించరు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయాన్ని అందించనున్నారు. రాయలసీమ, ఉత్తరాంద్ర, ప్రకాశం లాంటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపు.



Click it and Unblock the Notifications