Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
ఏ ఊరు వెళ్లినా, ఏ రాష్ట్రం వెళ్లినా, చివరకు ఏ దేశం వెళ్లినా స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు వేసుకుని ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిన వ్యవహారం కాదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర, బలమైన సైన్స్ దాగి ఉన్నాయి.

1930వ దశకంలో అమెరికాలో...
నిజానికి స్కూల్ బస్సులకు పసుపు రంగు వేయాలనే ఆలోచన ఈనాటిది కాదు. దీనికి బీజం 1930వ సంవత్సరంలోనే అమెరికాలో పడింది. అప్పట్లో స్కూల్ బస్సులు ఒక్కోటి ఒక్కో రంగులో ఉండేవి. దీని వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగేవి. ఈ సమస్యను పరిష్కరించాలని కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాంక్ సిర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆయన స్కూల్ పిల్లల రవాణా భద్రతపై ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు స్కూల్ బోర్డు అధికారులతో పాటు పేరుమోసిన బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
ఆ సమావేశంలో ప్రొఫెసర్ ఫ్రాంక్ గోడపై వివిధ రంగుల చార్ట్ లను ఉంచి, సేఫ్ కలర్ సెలక్ట్ చేసుకోమని కోరారు. చాలా మంది పసుపు, ఆరెంజ్ రంగుల వైపు మొగ్గు చూపారు. ఫైనల్ గా పసుపు రంగును ఖరారు చేశారు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయం నేటికీ ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉంది. అందుకే ఫ్రాంక్ సిర్ ను ఫాదర్ ఆఫ్ ది ఎల్లో స్కూల్ బస్ అని కూడా అంటారు.
సైన్స్ ఏం చెబుతోంది?
కేవలం అందంగా ఉంటుందని పసుపు రంగును ఎంచుకోలేదు, దీని వెనుక పక్కా సైంటిఫిక్ రీజన్ ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం మానవ నేత్రం ఇతర రంగుల కంటే పసుపు రంగును చాలా వేగంగా గ్రహించగలదు. మనం నేరుగా చూడకపోయినా, మన కంటి చూపు పక్కనుంచి వెళ్తున్న పసుపు రంగును ఎరుపు రంగు కంటే సులభంగా గుర్తించగలదట.
వాతావరణం అనుకూలించని సమయాల్లో అంటే.. కుండపోతగా వర్షం పడుతున్నప్పుడు, దట్టమైన పొగమంచు కమ్ముకున్నప్పుడు లేదా ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు కూడా పసుపు రంగు ఎంతో దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు మీద ఇతర వాహనాల్లో వెళ్లే డ్రైవర్లకు ఇదిగో స్కూల్ బస్సు వస్తోంది అని ఇట్టే తెలిసిపోతుంది. పిల్లల భద్రతకు ఈ రంగు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఎరుపు రంగు ఎందుకు వద్దు
రంగులన్నింటిలో ఎరుపు రంగు చాలా బ్రైట్ గా ఉంటుంది, దూరం నుంచి కూడా కనిపిస్తుంది కదా.. మరి ఆ రంగు ఎందుకు వేయలేదు? అని చాలామందికి సందేహం వస్తుంటది. ట్రాఫిక్ నియమాల ప్రకారం ఎరుపు రంగును ఇప్పటికే ప్రమాదం, బ్రేక్ లైట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగమని సూచించే గుర్తులుగా వాడుతున్నారు. స్కూల్ బస్సుకు కూడా అదే రంగు వేస్తే, డ్రైవర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పసుపు రంగును ఎంపిక చేశారు.



Click it and Unblock the Notifications
