Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Allu arjun: అల్లు అర్జున్ భవిష్యత్తుపై తేల్చేసిన వేణుస్వామి!..జాతకం అలాంటిదే
గత కొద్దిరోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్నపేరు అల్లు అర్జున్. ఏ టీ షాపు దగ్గర ఇద్దరు కలిసినా ఏ రాజకీయ నాయకులు ఇద్దరు కలిసినా ఏ సినిమా పరిశ్రమకు చెందినవాళ్లు ఇద్దరు కలిసి వారి మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు అల్లు అర్జున్. ఈ పేరుని ఇంతమంది స్మరించుకోడానికి కారణం పుష్ప విడుదలకు ఒక్క రోజు ముందు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ప్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట.
డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా,ఆమె కుమారుడు శ్రీతేజ్ అనే 9 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి టాలీవుడ్ అండగా నిలుస్తుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ సినీ ప్రముఖులు.. ఆర్థిక సహాయం చేస్తున్నారు.

వేణుస్వామి ఏం చెప్పారంటే
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా బాధిత కుటుంబాన్ని బుధవారం(డిసెంబర్ 25) పరామర్శించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ని పరామర్శించడానికి కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లాడు. రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ. 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు వేణుస్వామి. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమయంలో అల్లు అర్జున్ జాతకం పై మరోసారి వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాతకరీత్యా అల్లు అర్జున్ ఆరో ఇంట శని ఉన్నాడు కాబట్టి ఇలా జరిగిందని, అతని జాతకం వచ్చే ఏడాది మార్చి 29 వరకు బాగోలేదని అప్పటిదాకా అల్లు అర్జున్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అల్లు అర్జున్ జాతకం పై షష్ట గ్రహ కూటమి ప్రభావం ఉందని, దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు అనేది? తర్వాత ఎలా ప్రవర్తిస్తారు? అనేది ఆధారపడి ఉంటుందని వేణు స్వామి తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతుంటాయని, వాటిని తట్టుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవడమే అంటూ చెప్పుకొచ్చారు.
గతంలోనే చెప్పినా..కానీ
నిజానికి అల్లు అర్జున్ జాతకం బాగుందని..ఈ విషయం గతంలోనే చెప్పానని కానీ జాతకానికి, షష్టగ్రహ కూటమికి సంబంధం లేదన్నారు. అది ప్రవేశించినప్పుడు ఇబ్బందులుంటాయని..అల్లు అర్జున్ కూడా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నాడని చెప్పారు. మార్చి 29,2025 నుంచి అల్లు అర్జున్ కు బాగుంటుందని చెప్నారు
మృత్యుంజయ యజ్ఞం
హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ కోసం ఈ వారంలో తాను మృత్యుంజయ యజ్ఞం తన సొంత డబ్బులతో నిర్వహించబోతున్నానని వేణు స్వామి ప్రకటించాడు. శ్రీ తేజ్ ప్రస్తుతం వెంటిలేటర్, ఆక్సిజన్ సహాయం లేకుండా నార్మల్ గానే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, కచ్చితంగా త్వరలో శ్రీ తేజ్ కోరుకుంటాడని ఆశిస్తున్నాను అని వేణుస్వామి తెలిపారు.



Click it and Unblock the Notifications