Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
Viral Video : పానకం తాగుతున్న వారాహి అమ్మవారు.. పూజారి ఇంట్లో అద్భుత ఘటన..!
ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి పూజలు పెరుగుతున్నాయ్. మరో పక్క అమ్మవారి మహిహలు కూడా చాలా చోట్ల మనకు దర్శనమిస్తున్నాయ్. అమ్మవారికి పూజలు చేసిన భక్తులకు తప్పకుండా ఆశీస్సులు లభిస్తాయ్. వారాహి అమ్మవారు ఇటీవల నీళ్లు తాగుతున్న వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా అటాంటి సంఘటనే మరొకటి జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరులో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది. అక్కడ బ్రహ్మణ వీధిలో వారాహి అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారు పానకం తాగుతున్న వీడియో వైరల్ అయింది.

ఈ సంఘటన మొత్తం పీలేరులోని శివాలయంలో పూజారి కుమారస్వామి ఇంట్లో జరిగింది. వారం రోజులుగా నవరాత్రులు సందర్భంగా అమమవారికి పూజలు నిర్వహిస్తున్నారు. పూజలో భాగంగా అమ్మవారి విగ్రహం ముందు పూజారి పానకాన్ని వుంచారు. ఆ పానకాన్ని అమ్మవారి విగ్రహం తాగడాన్ని పూజారి భార్య లక్ష్మీ స్వయంగా చూసింది. ఈ సంఘటనను చుట్టుపక్కల అందరికీ తెలియజేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో బాగా వైరల్‌గా మారింది. ఈ వింతను చూసేందుకు పూజారి ఇంటికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
జులై 6 నుంచి జులై 15 వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరిగాయ్. ఈ తొమ్మది రోజులూ ఒక్కో రోజు అమ్మవారిని ఒక్కో అలంకారంతో పూజించారు. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల సమాజంలో కీర్తి, గుర్తింపును పొందతాము. వారాహి అంటే భూదేవి, ధాన్యలక్ష్మీ అని అర్థం. ఈ వారాహి అమ్మవారు చేతులో నాగలి, రోకలిని ధరించి వుంటుంది. ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే వారాహి అమ్మవారు మన జీవితంలో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. భూమిని దున్నడానికి నాగలిని ఎలాగైతే పడతామో అలాగే వారాహి అమ్మవారు కూడా మన బుద్ధిని మంచి మార్గం వైపు వెళ్లేలా చేస్తుంది.
వారాహి అమ్మవారు మనకు ఉగ్రరూపంలో కనబడ్డా కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ ఆషాడంలొ వారాహి అమ్మవారిని ఆరాధించిన వారికి అన్ని అడ్డంకులూ తొలగిపోతయ్. కాశీకి క్షేత్రపాలికగా వారాహి అమ్మవారు వుంటుంది. కాశీ పట్టణంలో వారాహి అమ్మవారు నీలి రంగులో మనకు దర్శనమిస్తారు. వారాహ రూపంలో అమ్మవారు అరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శివరస్సుపైన చంద్రవంకతో ప్రశాంతంగా మనకు దర్శనమిస్తుంది.
కాశీలో మాత్రమే కాకుండా వారాహి అమ్మవారు తంజావూరులోని బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహి అమ్మవారే క్షేత్రపాలికగా వుంటారు. అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో మనకు దర్శనమిస్తారు.
పైన ఇచ్చిన వివరాలన్నింటినీ ప్రముఖ పండితులు, జ్యోతిష్యుల నుంచి సేకరించింది. వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications
