Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
కుక్క కూర, కప్ప కాళ్లు, చీమల చట్నీ.. భారతీయులు తినే వింతైన ఆహారాలు చాలానే ఉన్నాయ్
భారత్.. భిన్న సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలబోత. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో తెగలు. భిన్నమైన కట్టుబాట్లు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాలను ఇప్పటికీ పాటిస్తున్న వారు ఎందరో. కాశీ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు.. విభిన్నమైన సాంప్రదాయాలు ఉంటాయి భారత్‌లో. కొన్ని మనకు వింతగా, విచిత్రంగా అనిపించవచ్చు. కానీ దశాబ్దాల తరబడి పాటిస్తున్న ఆచారాలు వారికి సాధారణంగానే ఉంటాయి.
భారత్‌లో భిన్నమైన సంస్కృతులు ఉన్నట్లుగానే భిన్నమైన ఆహారపు అలవాట్లు కూడా ఉంటాయి. అలా దేశంలో విచిత్రంగా అనిపించే, వినడానికి కూడా వింతగా అనిపించే వంటకాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చీమల చట్నీ, బస్తర్:
చప్రా అనేది వింతైన వంటకం. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంత ప్రజలు ఈ వంటకాన్ని ఇష్టంగా తింటుంటారు. ఎర్ర చీమలు, వాటి గుడ్లను సేకరించి వాటితో ఘాటుగా ఉండే చట్నీ తయారు చేస్తారు. గొప్ప ఔషధ గుణాలు ఉండే ఈ వంటకం ఈ ప్రాంతంలో చాలా ఫేమస్. ఘాటుగా ఉండే ఈ వంటకాన్ని తినాలంటే డేరింగ్ డ్యాషింగ్ అయి ఉండాలి.

2. కుక్క కూర, నాగాలాండ్:
చికెన్, మటన్, పోర్క్ లాంటి మాంసాలను ఎలా తింటారో.. నాగాలాండ్ వాసులు డాగ్ మీట్ (కుక్క మాంసాన్ని) అలా తింటారు. కుక్క మాంసంతో రకరకాల వెరైటీలు చేసుకుని తింటుంటారు. నాగాలాండ్ లో కుక్కలతో పాటు సాలెపురుగులు, పందులు, గొడ్డు మాంసం, పీతలు, ఏనుగులను కూడా తింటుంటారు. నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ లోని గిరిజనులు కుక్క కూరను చాలా ఇష్టంగా తింటుంటారు.

3. కప్ప కాళ్లు - గోవా, సిక్కిం:
కప్పలతో కూరలు వండుకోవడం చైనా లాంటి దేశాల్లో చాలా సాధారణం. మనదేశంలోనూ కప్పలతో చేసిన కూరలను ఇష్టంగా తింటారని చాలా మందికి తెలియదు. గోవా, సిక్కిం రాష్ట్రాల్లో కప్ప కాళ్లతో చేసే కూర చాలా ప్రసిద్ధి. మిగతా మాంసంతో పోలిస్తే కప్ప మాంసం చాలా రుచిగా ఉంటుందని, ఇందులో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయని చెబుతారు ఈ వంటకాలను తినే వారు. సిక్కింలోని లెప్చా ప్రజలు.. ఉదర వ్యాధులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి కప్ప కాళ్లతో చేసిన వంటకాలు తింటుంటారు.

4. పట్టుపురుగుల కూర, అస్సాం:
పట్టు పురుగుల నుంచి పట్టు తీస్తారని తెలిసిందే. కానీ ఈ పురుగులతో రుచికరమైన వంటకాన్ని తయారు చేస్తారని ఎంత మందికి తెలుసు. అస్సాంలోని చాలా ప్రాంతాల్లో పట్టుపురుగులతో వంటలు చేస్తుంటారు. ఈ వంటకాన్ని ఎరిపోలు గా పిలుస్తారు. పట్టుపురుగులు ప్యూపా దశలో ఉన్నప్పుడు వాటిని సేకరించి మసాలాలు దట్టించి, వెదురు రెమ్మలను జోడించి ఈ ఎరిపోలు (పట్టుపురుగుల వంటకాన్ని) తయారు చేస్తారు. అస్సాం వాసులు ఈ పట్టుపురుగుల కూరను చాలా ఇష్టంగా తింటారు. పట్టు పురుగు లార్వా, ప్యూపా లను వేయించి, కాల్చి, పచ్చిగా కూడా తింటుంటారు.

5. పంది పేగుల బిర్యానీ, మేఘాలయ:
మేఘాలయలో జాదో అనేది ఐకానిక్ పులావ్ ఫుడ్ ఐటెమ్. ఈ వంటకాన్ని పంది పేగులతో, కోడి పేగులతో తయారు చేస్తారు. ఈ వంటకాన్ని స్థానికంగా జాదో అని పిలుస్తారు. పూర్తిగా రక్తంలోనే ఉడికించి తయారు చేసే ఈ వంటకాన్ని మేఘాలయ రాష్ట్ర ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. పులావ్ తరహాలో ఉండే ఈ వంటకం స్థానికంగా చాలా ప్రసిద్ధి చెందింది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications