Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఏం సెర్చ్ చేస్తారు? గూగుల్ ప్రశ్నకు షాకయ్యే సమాధానాలిచ్చిన నెటిజన్లు
2023 సంవత్సరంలో గూగుల్ మొదటగా ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా ఒక ప్రశ్న సంధించింది దిగ్గజ సంస్థ.
మరికొద్ది గంటల్లో పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. న్యూ ఇయర్‌కు ఎదుటివారు ఏవైన రిజల్యూషన్స్ తీసుకున్నారా అని తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నావని ఫ్రెండ్స్‌ను, కజిన్స్‌ను, పరిచయం ఉన్న వారిని అడుగుతుంటాం. అదే పని చేసింది గూగుల్.

2023 సంవత్సరంలో గూగుల్ మొదటగా ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా ఒక ప్రశ్న సంధించింది దిగ్గజ సంస్థ. నెటిజన్ల నుండి ఏం స్పందన ఆశించిందో తెలియదు కానీ, గూగుల్ తన పరిశోధనల్లో వేగం పెంచాలని బలంగా నిర్ణయం తీసుకునే స్పందనలు మాత్రం నెటిజన్ల నుండి వచ్చాయి. గూగుల్‌కు పోటీగా వస్తుందని భావిస్తున్న కొత్త ఏఐ టెక్నాలజీ గురించి గూగుల్‌ను అడుగుతామని ఎక్కువ మంది పేర్కొనడం గమనార్హం. గూగుల్ ప్రశ్నకు నెటిజన్లు సమాధాలు ఇలా ఉన్నాయి.

చాట్ జీపీటీ:
ఎక్కువ మంది నెటిజన్లు తాము చాట్ జీపీటీ గురించి 2023 సంవత్సరంలో మొదట వెతకాలనుకుంటున్నామని సమాధానం ఇచ్చారు.
చాట్‌జీపీటీ అనేది ఒక చాట్ బోట్. దీనిని ఓపెన్ ఏఐ అనే సంస్థ తయారు చేసింది. గూగుల్‌లో ఏదైనా సమాచారం కోసం వెతకడం ఎంత పెద్ద ప్రయాసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్‌లో మనకు కావాల్సిన సమాచారం వెతకడం కూడా ఒక నైపుణ్యం కింద పరిగణిస్తున్నారు. ఈ అతిపెద్ద సమస్యను పరిష్కరించే ఉద్దేశంతోనే చాట్‌జీపీటీని తీసుకురానున్నారు. దీని ద్వారా మనకు కావాల్సిన సమాచారం చాలా సులభంగా లభిస్తుంది. అలాగే ఏవైన అంశాలపై కొత్త వ్యాసాలు కావాలన్నా, పరిశోధన పత్రాలు కావాలన్నా రాసిస్తుంది. టాపిక్ చెబితే కవితలు, లెటర్స్ కూడా రాస్తుంది. ఎదురుగా మరో మనిషి కూర్చుని కబుర్లు చెబుతున్నట్లుగానే ఉంటుంది.
దీంతో ఎక్కువ మంది యూజర్లు ఈ ఓపెన్‌ఏఐ టూల్‌ను వాడేందుకు మొగ్గుచూపిస్తున్నారు.

కరోనా అంతం ఎప్పుడు?
చాట్‌జీపీటీ తర్వాత ఎక్కువ మంది వెతుకుతామని చెప్పింది చైనాలో కరోనా ప్రభావం గురించే. చైనాలో కరోనా పరిస్థితులు, అక్కడ ప్రభుత్వ కఠిన ఆంక్షలు ఇంకెప్పుడు తొలగిపోతాయంటూ వెతుకుతామని చెప్పారు.

గూగుల్‌లో పనిచేసేందుకు ఆసక్తి
తర్వాత ఎక్కువ మంది గూగుల్‌లో గూగుల్ గురించే వెతుకుతామని చెప్పారు. గూగుల్‌లో ఎంట్రీ లెవల్ జాబ్ పొందడం ఎలా.. క్లౌడ్ ఇంజినీర్‌గా గూగుల్‌లోకి ఎలా ప్రవేశించాలి.. అనేవి 2023లో గూగుల్‌లో సెర్చ్ చేస్తామని చెప్పారు.
ఇవే కాకుండా ట్విట్టర్ కొత్త సీఈవో గురించి, పిక్సెల్ ట్యాబ్లెట్ రిలీజింగ్ డేట్, గూగుల్-హువావే తిరిగి కలిసి పని చేయడం గురించి, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ రిలీజింగ్ డేట్ వంటి వాటి గురించి సెర్చ్ చేస్తామని నెటిజన్లు బదులిచ్చారు.



Click it and Unblock the Notifications