Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
సంక్రాంతి రోజు గంగిరెద్దులకు వీటిని దానం చేస్తే అరిష్టం, అవేంటంటే..
సంక్రాంతి రోజు రంగురంగు ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలతో పాటు గంగిరెద్దులు కూడా కనిపిస్తాయి. గంగిరెద్దుల వాళ్లు బసవన్నలను అందంగా ముస్తాబు చేస్తారు. వాటిపై రంగు రంగుల చీరలు, దుప్పట్లు కప్పుతారు. వాటి కొమ్ములను అందంగా తీర్చిదిద్దుతారు. వాటితో పాటు జోలె పట్టుకుని పాటలు పాడుతూ ఇంటింటికి తిరుగుతూ భిక్షం అడుగుతుంటారు. ఆ గంగిరెద్దులతో రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఇంటి యజమానులను ఆకర్షించి తోచినంత దానం చేయాలని వేడుకుంటారు.

గంగిరెద్దును ఇంటికి వచ్చినప్పుడు కొంత మంది డబ్బులు ఇస్తుంటారు, మరికొందరు బియ్యం వేస్తుంటారు, ఇంకొందరు ఇంట్లో పాత చీరలను గంగిరెద్దులపై కప్పుతుంటారు. అసలు గంగిరెద్దులకు ఎలాంటి వస్తువులు దానం చేయాలి, ఎలాంటివి దానం చేయడం అరిష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.

గంగిరెద్దు ప్రాముఖ్యత:
* గంగిరెద్దు, గంగిరెద్దుతో పాటు దాని యజమాని ఇంటికి వస్తే నాటి కాలంలో సాక్షాత్తు శివుడే ఇంటికి వచ్చాడని భావించే వారు.
* ఇంటికి వచ్చిన గంగిరెద్దు కాళ్లను నీటితో కడిగేవారు, కంఠం, గొత్తు, నుదురు నీటితో కడిగి పసుపు కుంకుమల పెట్టేవారు.
* నూతన వస్త్రాలతో అలంకరించే వారు.
* గంగిరెద్దులను తీసుకువచ్చిన వారి కాళ్లను కడిగేవారు.

గంగిరెద్దులకు ఎలాంటి వస్తువులు దానం చేయాలి:
* గంగిరెద్దులకు ఏదైనా వస్తువులు దానం చేసే ముందు వాటి చుట్టూ తిరిగి మొక్కాలి.
* గంగిరెద్దులకు నూతన వస్త్రాలు దానం చేయాలి. దొవతి, శాలువా, చీర, తువ్వాలు లాంటివి నూతన వస్త్రాలు దానం చేయాలి.
* మనం తినే బియ్యం దానం చేయాలి
* సంతోషంగా, చిరునవ్వుతో దానం చేయాలి.
* పచ్చిగడ్డి, ఎండు గడ్డి గంగిరెద్దులకు తినిపించవచ్చు.
* డబ్బులు దానం చేయవచ్చు.

గంగిరెద్దులకు ఎలాంటి వస్తువులు దానం చేయకూడదు:
- గంగిరెద్దులు ఇంటికి వచ్చినప్పుడు వాడిన వస్తువులను గంగిరెద్దులకు దానం చేయకూడదు.
- పడుకోవడానికి ఉపయోగించిన వస్త్రాలు, దుప్పట్లు, శాలువాలను గంగిరెద్దులకు దానం చేయకూడదు.
- చిరిగిపోయిన వస్త్రాలను దానం చేయకూడదు.
- పాడైపోయిన బియ్యం దానం చేయకూడదు.
- వాడటానికి వీలులేని వాటిని దానం చేయకూడదు.
- సంతోషం లేకుండా దానం చేయకూడదు.
- రజస్వల అయిన స్త్రీలు వాడిన వస్త్రాలు దానం చేయకూడదు.
- మురికిగా ఉన్న వస్తువులు దానం చేయకూడదు.
మనం దానం చేసే ముందుకు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదైతే మనం దానం చేయాలనుకుంటామో దాని వల్ల వారు ప్రయోజనం పొందుతారా, లేదా, అనేది తెలుసుకోవాలి. దానం తీసుకున్న వ్యక్తి దాని నుండి ప్రయోజనం పొందకపోతే ఆ దానానికి విలువ లేదని అర్థం.



Click it and Unblock the Notifications
