Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
అసలెవరీ శాంతా క్లాజ్? అందరికీ గిఫ్ట్స్ ఎందుకు ఇస్తాడు? తన ప్రాముఖ్యత ఏంటంటే..
శాంటా క్లాజ్ ఎవరు, ఆయన ఎందుకు పిల్లలకు బహుమతులు ఇస్తుంటారు. ఎరుపు టోపీ, ఎరుపు డ్రెస్ వేసుకుని భారీ పొట్టతో ఉండే ఈ శాంటా క్లాజ్ వెనక అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. సంవత్సరం అంతా ఎదురుచూస్తున్న రోజూ మరో 3 రోజుల్లో వచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండగ క్రిస్మస్. క్రిస్మస్ అనే పేరు వినగానే రంగురంగుల లైట్లు, క్రిస్మస్ ట్రీ, దానికి అందమైన డెకరేషన్, స్టార్ లైట్లు, కేక్ కటింగ్ గుర్తుకువస్తాయి. వీటన్నింటి కంటే ముందు క్రిస్మస్ అనగానే క్రిస్మస్ తాత గుర్తుకువస్తాడి. ఆయననే శాంటా క్లాజ్ అని కూడా అంటారు. క్రిస్మస్ రోజు శాంటా క్లాజ్ గిఫ్ట్స్ ఇస్తారని అందరికీ తెలిసిందే. అసలు ఈ శాంటా క్లాజ్ ఎవరు, ఎందుకు బహుమతులు ఇస్తుంటారు అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా..

శాంటా క్లాజ్ ఎవరు, ఆయన ఎందుకు పిల్లలకు బహుమతులు ఇస్తుంటారు. ఎరుపు టోపీ, ఎరుపు డ్రెస్ వేసుకుని భారీ పొట్టతో ఉండే ఈ శాంటా క్లాజ్ వెనక అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శాంటా క్లాజ్ ఓ బిషప్:
క్రైస్తవుల మతపెద్దలను బిషప్ అని పిలుస్తారు. శాంటా క్లాజ్‌గా కనిపించే వ్యక్తి కూడా ఓ బిషప్. ఆయన పేరే సెయింట్ నికోలస్. నికోలస్ ప్రస్తుతం టర్కీలోని మైరా ప్రాంతానికి బిషప్‌గా ఉండే వారు. సెయింట్ నికోలస్ క్రీ.శ. 280వ సంవత్సరానికి చెందినవారు. తండ్రి నుండి తనకు వచ్చిన ఆస్తులను పేదవారికి, అవసరంలో ఉన్న వారికి దానం చేశారు నికోలస్.
క్రిస్మస్ పండగ వేళ సెయింట్ నికోలస్ నిరుపేదల ఇళ్లకు మారువేషంలో వెళ్లి వారికి బహుమతులు, డబ్బును అందించే వారు. తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయే వారు. ఆయన చేస్తున్న మంచి పని వల్ల అనతికాలంలోనే ఆయన గురించి చాలా మందికి తెలిసింది. అమెరికా, యూరప్ దేశాల్లో సెయింట్ నికోలస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
క్రిస్మస్ వచ్చిందంటే చాలు క్రిస్మస్ తాత వస్తాడని, తమకు గిఫ్ట్స్ ఇస్తాడని పిల్లలంతా ఎదురుచూడటం మొదలు పెట్టారు. క్రిస్మస్ అనగానే నికోలస్ గుర్తుకు రావడం సర్వసాధారణం అయిపోయింది. సెయింట్ నికోలస్, సింట్ నికోలస్, సింటర్ క్లాస్, శాంటా క్లాజ్ అంతా ఒకరి పేరే. కానీ శాంటా క్లాస్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. శాంటా క్లాజ్ అనగానే క్రిస్మస్, క్రిస్మస్ అంటే శాంటా క్లాజ్‌గా మారిపోయాయి.

ఆచారంగా మారిన బహుమతుల ప్రదానం
19వ శతాబ్దం నాటి నుండి క్రిస్మస్ సమయంలో పిల్లలకు బహుమతులు ఇవ్వడం ఆచారంగా మారింది. షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో శాంటా క్లాస్‌లాగా డ్రెస్ చేసుకున్న వారిని ఉంచి పిల్లలనీ, తల్లిదండ్రులనీ ఆకర్షించడం మొదలైంది.
1822లో క్లెమెంట్ క్లార్క్ మూర్ అనే కవి 'యాన్ ఎకౌంట్ ఒఫ్ ఎ విజిట్ ఫ్రం సెయింట్ నికోలస్' అనే కవిత రాశారు. ఇది 'ఇట్ వజ్ ద నైట్ బిఫోర్ క్రిస్మస్' అనే పేరుతో బాగా పాపులర్ అయింది. 8 రెయిన్ డీర్లు లాగుతున్న స్లే మీద ఎక్కి ఒక చోటు నుండి మరో చోటుకును ఎగురుతూ వెళ్లి పిల్లలకు బహుమతులు ఇస్తాడని.. శాంటా క్లాజ్ గురించి ఆ పోయెం వర్ణించింది. 1881లో ఓ పొలిటికల్ కార్టూనిస్టు గీసిన కార్డూన్‌తో ఇప్పుడు శాంటా క్లాజ్ అనుకుంటున్న రూపం బాగా పాపులర్ అయింది. తెల్లని గడ్డం, ఎర్రని దుస్తులు, భారీ పొట్ట, భుజానికి బహుమతుల మూట.. శాంటా క్లాజ్ అనగానే ఇవే గుర్తుకువచ్చేలా ఆ కవిత జనాల్లోకి వెళ్లిపోయింది.

శాంటా క్లాజ్ ఫ్యాక్ట్స్:
క్రిస్మస్ తాత నిజానికి నీలి రంగు దుస్తులు ధరించేవారు. 1930లలో కోకాకోలా కంపెనీ వారు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి ఎరుపు రంగు వాడారు. అవి బాగా ప్రాచుర్యం పొందడంతో శాంటా క్లాజ్ తాత దుస్తులు ఎరుపు, తెలుపు రంగుల్లో మారాయి.

భారీ క్రిస్మస్ గిఫ్ట్:
అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని 1886లో ఫ్రాన్స్ దేశం అమెరికాకు బహుమతిగా అందించింది. దాని బరువు 225 టన్నులు. ఇప్పటి వరకు అత్యంత బరువైన క్రిస్మస్ గిఫ్ట్‌గా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిలిచింది.



Click it and Unblock the Notifications











