Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు?
హిందూమతంలో ప్రజలు కోట్లాది దేవతలను కొలుస్తారు,పూజలు చేస్తుంటాం. మనదేశంలో ఏ ఊరు వెళ్లినా రామాలయం, శివాలయం, అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి ఇలా కోకొల్లలుగా గుడులు కనబడతాయి. అయితే బ్రహ్మదేవుడికి మాత్రం ఎక్కడా పూజలు జరగడం కానీ, గుడులు కట్టడం కానీ మనం ఎప్పుడూ చూసి ఉండం.
హిందూ పురాణాల్లో బ్రహ్మను సృష్టికర్తగా చెప్పారు. అలాంటిది ఈ ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తికే పూజలు లేకపోవడం,గుడులు లేకపోవడం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కేవలం శాపాలే కాదు.. ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి.

బ్రహ్మకు ఉండే నాలుగు తలలు హిందూ మతానికి మూలస్తంభాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు వేదాలకు ప్రతీకలు. ఇవి ఆయన సర్వజ్ఞత్వాన్ని, అపారమైన జ్ఞానాన్ని సూచిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బ్రహ్మకు పూజలు జరగకపోవడానికి ప్రధానంగా రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి.
మొదటి కథ ప్రకారం.. ఒకప్పుడు బ్రహ్మదేవుడికి కూడా శివునిలాగే ఐదు తలలు ఉండేవి. కాలక్రమేణా సృష్టికర్తనైన తానే అందరికంటే అధికుడిననే అహంకారం బ్రహ్మలో పెరిగిపోయింది. పరమశివుడి పైనే తన ఆధిక్యాన్ని ప్రదర్శించబోయాడు. ఆ గర్వాన్ని అణచివేయడానికి, ఆగ్రహించిన శివుడు బ్రహ్మ ఐదో తలకాయను ఖండించాడు.
రెండో కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి బ్రహ్మదేవుడు పుష్కర్ లో ఒక పవిత్ర యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞానికి ఆయన భార్య సరస్వతీ దేవి రావడం కాస్త ఆలస్యమైంది. ముహూర్తం మించిపోతుందనే తొందరలో బ్రహ్మ గాయత్రి అనే మరో స్త్రీని వివాహం చేసుకొని యజ్ఞాన్ని పూర్తి చేశాడు. తీరా అక్కడికి చేరుకున్న సరస్వతీ దేవి, తనకు జరిగిన అవమానానికి రగిలిపోయింది. సృష్టికర్తవైన నిన్ను ఇకపై భూలోకంలో ఎవరూ పూజించరు గాక అని బ్రహ్మను తీవ్రంగా శపించింది.

ఏకైక బ్రహ్మ దేవాలయం
ఆ శాపం వల్లే బ్రహ్మదేవుడికి ప్రపంచవ్యాప్తంగా ఆలయాలు లేవు. రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ అనే ఊర్లో ఉన్న గుడి మాత్రమే ఏకైక ప్రధాన బ్రహ్మ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుడిలో, ఎర్రటి శిఖరం కింద కొలువై ఉన్న నాలుగు తలల బ్రహ్మను దర్శించుకునేందుకు ఏటా వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్వామిని దర్శిస్తే పాపాలు తొలగిపోయి, అపారమైన జ్ఞానం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
అసలు తత్వం
అయితే ఈ పురాణ కథల వెనుక ఒక లోతైన తత్వశాస్త్రం దాగి ఉందని పండితులు చెబుతారు. బ్రహ్మ అంటే సృష్టి. సృష్టి ప్రక్రియ ఎప్పుడో గతం లోనే పూర్తయింది. కానీ సృష్టించబడిన ఈ విశ్వాన్ని నిరంతరం కాపాడటం (విష్ణువు), కాలక్రమేణా పాతదానిని లయంచేసి కొత్త మార్పులు తీసుకురావడం (శివుడు) నిరంతరం జరిగే ప్రక్రియలు. అందుకే ప్రజల భక్తి, ఆరాధనలు విష్ణు, శివుల చుట్టూ అల్లుకున్నాయి.



Click it and Unblock the Notifications
