Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ప్రపంచాన్ని మాయ చేస్తున్న అరకు కాఫీ..భారత్,బ్రిటన్ ఒప్పందంతో గిరిజనులకు భారీ ప్రయోజనం!
ఆంధ్రప్రదేశ్ పేరు వినగానే బయటి ప్రాంతం వాళ్లకు గుర్తుకొచ్చేది తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయం,అరకు కాఫీ. మనదేశంతో పాటు విదేశాల్లో కూడా అరకు కాఫీకి ఫుల్ గిరాకీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అరకు కాఫీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది. దీంతో ఇదొక బ్రాండ్ గా మారిపోయింది. తింటే గారెలే తినాలి..తాగితే అరకు కాఫీనే తాగాలి అని ఇప్పుడు తెలుగు ప్రజలతో విదేశాల్లో కాఫీ ప్రియుల అభిప్రాయం కూడా. ఏపీ నుంచి ఎక్కువగా విదేశాలకు ఎగుమతున్న అరకు కాఫీ .. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గర నుంచి ప్రపంచ దేశాధినేతల దాకా అందరి ప్రశంసలు అందుకుంటూ ప్రపంచ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తూర్పు కనుమల్లో గిరిజనలు పండించిన సేంద్రీయ అరకు కాఫీని ఉదయాన్నే వేడివేడిగా ఓ కఫ్పు తాగారంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
అరకు కాఫీ ప్రత్యేకత ఇదే
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో గిరిజన రైతులు అత్యంత సహజ సిద్ధమైన పద్ధతుల్లో ఈ కాఫీని పండిస్తారు. ఇక్కడ ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడరు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పెద్ద పెద్ద చెట్ల నీడలో పెంచడం వల్ల అరకు కాఫీకి ఒక ప్రత్యేకమైన సువాసన, అద్భుతమైన రుచి వస్తుంది. ఇందులో ఆమ్లత్వం తక్కువగా ఉండటం, కాస్త చాక్లెట్ ఫ్లేవర్ ను పోలి ఉండటం దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులకు ఇష్టమైనదిగా మార్చింది. ఇది కేవలం కాఫీ గింజల సాగు కాదు, తరతరాలుగా వస్తున్న గిరిజనుల సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానం. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ సాధించిన ఐదు కాఫీ రకాల్లో అరకు కాఫీ ఒకటి.

కప్పులో పోయగానే వెలువడే దీని సువాసన అమోఘం. పండ్లు, పూల పరిమళాల కలయికలా ఉంటుంది. ఇతర కాఫీలలా గొంతులో మంట పుట్టించకుండా, తేలికపాటి పులుపుతో చాలా మృదువుగా ఉంటుంది.మొదటి సిప్‌లో సిట్రస్ పండ్ల వంటి తాజాదనం, ఆ తర్వాత తేనె వంటి తీపిదనం, చివర్లో జాజికాయ, మిరియాల వంటి మసాలా దినుసుల ఛాయలు తగలడం దీని ప్రత్యేకత.
ప్రధాని మోదీ ప్రశంసలతో ప్రపంచ యవనికపైకి
అరకు కాఫీ కీర్తి పతాకాన్ని ప్రపంచ వేదికపై ఎగరేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర చాలా కీలకం. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రపంచ దేశాధినేతలకు బహుమతిగా అరకు కాఫీ ప్యాకెట్లను అందించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. G7, G20 వంటి సదస్సులలో అరకు కాఫీని ఒక డిప్లొమాటిక్ గిఫ్ట్ గా ప్రమోట్ చేయడంతో దీని ఖ్యాతి అమాంతం పెరిగింది.
ప్యారిస్ లోని ఖరీదైన స్టోర్లలో కూడా అరకు కాఫీ అమ్మబడుతోందంటే దాని స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మన గిరిజన రైతుల కష్టానికి దక్కిన నిజమైన గౌరవం. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ లో కూడా అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనదేశ పార్లమెంట్ లో సైతం అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు.

2014-19 మధ్య ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అరకు కాఫీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడంతో పారిస్ ప్రజలకు అరకు కాఫీ టేస్ట్,ప్రాముఖ్యత తెలిసొచ్చింది. అంతేకాకుండా పారిస్ లో జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రిక్స్ ఎపిక్యూర్ 2018 పోటీల్లో అరకు కాఫీ గోల్డ్ మెడల్ ని దక్కించుకుంది.
గిరిజనుల ఆశాకిరణం
మనం తాగే ప్రతి కప్పు అరకు కాఫీ వెనుక ఒక సామాజిక ప్రయోజనం కూడా దాగి ఉంది. ఒకప్పుడు గిరిజనులు తమ అటవీ ఉత్పత్తులకు సరైన ధర లేక ఇబ్బందులు పడేవాళ్లు. క్రమంగా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కాఫీ సాగును చేపట్టడం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ కాఫీ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా గిరిజన కుటుంబాలకే చెందుతుంది. ఇది వారి పిల్లల చదువులకు, ఆరోగ్యానికి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది.

బ్రిటన్-భారత్ ఒప్పందంతో అరకు రైతులకు స్వర్ణయుగం
ఇప్పటివరకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అరకు కాఫీకి తాజాగా భారత్, బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఒక పెద్ద వరం కానుంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఉత్పత్తులపై, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై బ్రిటన్ విధించే దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి లేదా పూర్తిగా రద్దవుతాయి. ఇప్పటికే లండన్ వంటి నగరాల్లో అరకు కాఫీని అడిగి మరీ తాగుతున్నారు.
దీనివల్ల అరకు రైతులకు కలిగే ప్రయోజనాలు
-బ్రిటన్ వంటి పెద్ద, సంపన్న దేశంలో అరకు కాఫీకి నేరుగా మార్కెట్ లభిస్తుంది.
-మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, సుంకాల భారం లేకపోవడంతో రైతులు పండించిన పంటకు అత్యధిక గిట్టుబాటు ధర లభిస్తుంది.

-లండన్ కాఫీ షాపుల్లో, సూపర్ మార్కెట్లలో అరకు కాఫీ బ్రాండ్ సులభంగా లభించడం వల్ల డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.
-పెరిగిన ఆదాయంతో గిరిజన రైతుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నిండుతాయి. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.



Click it and Unblock the Notifications
