Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.!
ప్రయాణంలో కొందరు కాలక్షేపం కోసం బుక్స్ చదవడం సాధారణం. అయితే ఇక్కడ కూడా ఓ మహిళ మెట్రోలో ప్రయాణిస్తూ ఓ బుక్ చదవడం మొదలుపెట్టింది. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఇక్కడే అసలైన ట్విస్ట్.. ఆ మహిళ చదువుతున్న బుక్.. ఆ పుస్తకం పేరు చూసి ఒక్కసారిగా సోషల్ మీడియా సమాజం నివ్వెరపోయింది. గంటల్లోనే లక్షల్లో వ్యూస్.. వేలల్లో కామెంట్స్‌ని సంపాదించుకుంది.

పెళ్లంటే మగాళ్లు భయపడే రోజులొచ్చాయి. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న భర్తల హత్యలే ఇందుకు కారణమంటే అతిశయోక్తి కాదు. వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను, కాబోయే వాడిని పక్కా ప్లాన్ ప్రకారం కడతేరుస్తున్నారు. ఇక, సాధారణ కేసుగా మొదలుపెట్టిన పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి రావడంతో నివ్వెరపోవడం వారివంతవుతోంది. తాజాగా ప్రియుడి కోసం కాబోయే భర్తను కోటపై నుంచి తోసి చంపేసిన సియా గోయల్ కేసు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ సంఘటన గురించి మాట్లాడుకోవడం జనం ఆపేస్తున్న తరుణంలో.. మెట్రోలో జరిగిన ఓ సంఘటన మరోసారి కేతన్ అగర్వాల్ మర్డర్ గురించి చర్చకు దారితీసింది.
హౌ టు కిల్ మెన్..
మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ 'హౌ టు కిల్ మెన్ అండ్ గెట్ అవే విత్ ఇట్' అనే పుస్తకాన్ని చదవడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 'మగాళ్లను ఎలా చంపాలి.. ఎలా తప్పించుకోవాలి’ అని ఆ పుస్తకం టైటిల్ అర్థం. ఈ బుక్ పేరు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించడంతో ఒక్కసారిగా మహారాష్ట్రంలో సియా గోయల్- కేతన్ అగర్వాల్ కేసుపై చర్చకు దారితీసింది. ప్రియుడి కోసం కాబోయే భర్తను లోహ్‌గఢ్ తీసుకుెళ్లి పైనుంచి తోసేసి దారుణంగా హతమార్చింది. తర్వాత ఇది ప్రమాదంగా చిత్రీకరించింది. పోలీసుల విచారణలో అసలు విషయం బట్టబయలైంది.
మర్డర్ కేసు చర్చకు
ఇదే కాకుండా, ఇటీవల ప్రియుడి మోజులో పడి భర్తలను హతమార్చి వివిధ రకాలుగా పాతిపెట్టిన ఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. దీంతో పెళ్లంటేనే ఈ కాలం యువత భయపడుతోంది. సింగిల్‌గా ఉంటూ పేరెంట్స్‌నే ఉండటం ఉత్తమమంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ మెట్రోలో ప్రయాణిస్తూ ఈ పుస్తకం చదవడం పురుషులను మరోసారి తీవ్ర ఆందోళనకి దారితీసింది.
నెటిజన్ల కామెంట్స్
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొందరు దీనిని సరదాగా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా భావించగా.. మరికొందరు దీనిని తీవ్రంగా పరిగణించారు. కొందరు ఈ పుస్తకం టైటిల్ చూసి తప్పుగా అంచనా వేయవద్దని.. పుస్తకంలో ఉన్న సమాచారాన్ని బట్టి అంచనా వేయాలని కామెంట్ చేశారు. ఇలాంటి సంఘటనలు పురుషుల్లో భయాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయని మరో యూజర్ అన్నారు. అబ్బాయిలూ జాగ్రత్తగా ఉండాలంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.
కల్పిత నవల మాత్రమే
అయితే పురుషుల్లో ఇంత భయాన్ని రేకెత్తిస్తున్న ఈ పుస్తకాన్ని బ్రిటిష్ రచయిత్రి కేటీ బ్రెంట్ రాశారు. ఈ ప్రముఖ నవలగా ప్రసిద్ధి చెందింది. దీని పేరు ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ బుక్. ఇందులో డార్క్ కామెడీ, క్రైమ్, వ్యంగ్యం వంటి అనేక అంశాల మేళవింపుతో చేసిన ఒక కల్పిత కథ. కాగా, ఈ బుక్ టైటిల్ కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఈ కల్పిత నవలను వాస్తవ సంఘటనలుగా భావించి పొరపాటు పడవద్దని కొందరు యూజర్లు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
