Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Viral video ఓటరుపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే శివకుమార్..? ఓడించండని నెటిజెన్ల కామెంట్..
చట్టం కొందరికి చుట్టం, రూల్స్ వీఐపీలకు ఉండవు. ఇది ఎప్పటి నుంచో ఉండిందే. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పోలింగ్‌లో గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన సంఘటన వైరల్‌గా మారింది. తెనాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే శివకుమార్ వోటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్‌కు వచ్చాడు. అక్కడ చాలా మంది ఓటర్లు ఉన్నప్పటికీ వారందరినీ దాటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అలా వెళ్లడాన్ని అక్కడున్న ఓ ఓటరు అభ్యంతరం చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే శివకుమార్ ఓటరు చెంప చెళ్లుమనిపించాడు. ఓటరు తిరిగి చెంప దెబ్బ వేశాడు. మళ్లీ ఎమ్మెల్యే అతని అనుచరులు కలిసి ఓటరుపై బలంగా దాడి చేశారు. 10 సెకెన్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎమ్మెల్యే తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయ్. ప్రజాప్రతినిధిగా వుండి ప్రజలపైనే ఇలాంటి దాడులు చేసే ఎమ్యెల్యేలను అస్సలు గెలిపించవద్దని కామెంట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు 25 లోక్‌సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. వైసీపీ పార్టే, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే శివకుమార్ తీరుపై అటు టీడీపీ వర్గాలు కూడా స్పందించాయ్. ప్రజల్లో వైసీపీపై ఉన్న అసంతృప్తే ఇలా వ్యక్తమవుతోందని అంటున్నారు. దీనిపై రూలింగ్ పార్టీ వైసీపీ నేత ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ మాట్లాడుతూ.. వైరల్ అయిన వీడియోలో పార్టీని కావాలని చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తేలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చూద్దాం.. "అక్కడ ఉన్న ఓటర్లకు ఏమాత్రం ధైర్యం, మనసు లేవు, ఐదుగురు కలిసి ఓ సామాన్యుడిని కొడుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. ఓటరును రక్షించడానికి ఏ పోలీసు అక్కడికి రాకపోవడం కూడా పరిస్థితిని తెలియజేస్తుందంటున్నారు. కొందరు ఓటరు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఏపీ పోలీసులు ఈ సంఘటనపై తక్షణం స్పందించాలను కోరుతున్నారు. ఎలక్షన్ కమీషన్ కూడా ఈ ఘటనపై విచారణ జరిపించాలను కోరుతున్నారు. వైసీపీ ఎమ్మెల్య శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఎమ్మెల్యేపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఘర్షణ జరిగిన ఈ పోలింగ్ బూత్‌లో ఓటింగ్‌ను నిలిపివేయాలను కోరుతున్నారు. ఏపీ పోలీస్‌ను ట్యాగ్ చేస్తూ చాలా మంది ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా ప్రజలు కూడా విచ్చలవిడిగా తాయిలాలకు అలవాటు పడితే, ఓట్లకు అమ్ముడు పోయినంత కాలం పాలకులు, ఎమ్మెల్యేల దృష్టిలో ప్రజలు చులకనగానే కనబడతారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కొందరు ప్రజలు కూడా ఓటుకు నోటు తీసుకోవడంతో ప్రజలపైన కూడా కొందరు ఎమ్మెల్యేలకు భయం పోతుందని చెబుతున్నారు. అందుకే ఎన్నికల సమయంలో కూడా ప్రజలను విమర్శించడానికి, దాడి చేయడానికి వెనకాడ్డం లేదని అంటున్నారు. సోషల్ మీడియా ఎంత ఉన్నా కూడా కొందరు అవినీతి, రౌడీ నాయకుల చర్యలు ఆగడం లేదని చెబుతున్నారు. కఠినంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమీషన్ ఈ విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించడం ప్రమాదకరంగా మరిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications