Latest Updates
-
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు!
గంటల వ్యవధిలోనే కూప్పకూలిన వెండి ధరలు..రూ. ఒక్కసారిగా రూ.21 వేల వరకు పతనం..
ప్రపంచ బులియన్ మార్కెట్లో భారీ ర్యాలీ తర్వాత వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకులాయి. వ్యాపారులు లాభాలను బుక్ చేసుకోవడంతో MCXలో వెండి ఫ్యూచర్స్ ధరలు కిలోకు రూ.21 వేల మేర పతనమయ్యాయి. కేవలం గంట వ్యవధిలోనే మార్చి కాంట్రాక్ట్ వెండి ధరలు ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ.2,33,120కి చేరుకోవడం మార్కెట్‌లో తీవ్ర అస్థిరతను చూపిస్తోంది. అంతకుముందు రోజు వెండి ధరలు ఆల్‌టైమ్ హై అయిన రూ.2,54,174కి చేరుకున్నాయి.
అయితే ఆ స్థాయిల వద్ద కొనుగోళ్లకు మద్దతు తగ్గడంతో.. సేఫ్ హేవెన్ (సురక్షిత పెట్టుబడి) డిమాండ్ తగ్గింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం కూడా ఈ పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ధరలు భారీ ఊగిసలాటను చూపించాయి. సోమవారం ట్రేడింగ్‌లో వెండి ధరలు తొలిసారిగా ఔన్సుకు 80 డాలర్ల మార్కును స్వల్పంగా దాటాయి. అయితే వెంటనే లాభాల స్వీకరణ మొదలవడంతో ధరలు 75 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య శాంతి ఒప్పందంపై సానుకూల చర్చలు జరుగుతున్నాయనే వార్తలు రావడంతో భౌగోళిక రాజకీయ భయాలు తగ్గాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ వ్యాఖ్యానించడం మార్కెట్లో రిస్క్ సెంటిమెంట్‌ను పెంచింది. దీనివల్ల సేఫ్ హేవెన్ ఆస్తులైన బంగారం, వెండిపై ఒత్తిడి పెరిగింది.
ఈ సంవత్సరం ఇప్పటివరకు వెండి ధరలు దాదాపు 181 శాతం వరకు పెరిగాయి. వెండి ధరలు బంగారాన్ని కూడా మించిపోయాయి. అమెరికా వెండిని కీలక ఖనిజంగా గుర్తించడం, సరఫరా పరిమితులు, పెరుగుతున్న పారిశ్రామిక వినియోగం, పెట్టుబడి డిమాండ్ కారణంగా ధరలు రాకెట్‌లా పెరిగాయి. అయితే ఈ అతి వేగమైన పెరుగుదలే ఇప్పుడు ప్రమాదంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అదను చూసి దెబ్బ కొట్టిన చైనా.. ఒక్క నిర్ణయంతో వెండి ధరలు ఆకాశానికి..షాక్‌లో ప్రపంచ దేశాలు
BTIG వంటి ఆర్థిక సంస్థలు వెండి ధరలు పారబాలిక్ స్థాయికి చేరాయని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం వెండి ధరలు 200-డే మూవింగ్ అవరేజ్ (200-DMA) కంటే దాదాపు 89 శాతం ఎక్కువగా ట్రేడవుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులే భారీ పతనాలకు దారితీశాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
1979-80లో Silver ధరలు ఔన్సుకు 6 డాలర్ల నుంచి 49 డాలర్లకి చేరి.. ఆ తర్వాత 90 శాతానికి పైగా కూలిపోయాయి. 2011లో కూడా వెండి 48 డాలర్ల దగ్గర గరిష్టాన్ని తాకి, తరువాతి సంవత్సరాల్లో 75 శాతం వరకు పడిపోయింది. చరిత్రను చూస్తే.. మొమెంటం బ్రేక్ అయిన తర్వాత వెండిలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ జిగర్ త్రివేది ప్రకారం.. మొత్తం ట్రెండ్ ఇంకా పాజిటివ్‌గానే ఉన్నా, మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. రూ.2.4 లక్షల స్థాయి వెండికి తాత్కాలిక మద్దతుగా ఉండొచ్చని ఆయన అభిప్రాయం. వెండిలో భారీ లాభాలు ఇచ్చిన ర్యాలీ ఇప్పుడు లాభాల బుకింగ్ దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది. పెట్టుబడిదారులు జాగ్రత్తగా అడుగులు వేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Credit: Goodreturns



Click it and Unblock the Notifications











