Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
గర్భవతినైనా వదల్లేదు... నా మీదపడి కోరికలు తీర్చుకుని... బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
సంచలనాల కోసం, పబ్లిసిటీ కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. వ్యూస్, లైకుల కోసం తమ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతున్నారు. కొద్దిరోజుల క్రితం తన వీడియో వైరల్ చేయడం కోసం కేరళలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ .. ఓ వ్యక్తిని చేయని నేరంలో ఇరికించడంతో అతను పరువు పోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళతో పాటు దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు స్పందిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై బిగ్‌బాస్ బ్యూటీ ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...
Samantha: పేరు మార్చుకొంటున్న సమంత.. కొత్త పేరేంటో తెలుసా?
వ్యూస్ కోసం దారుణం
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. రద్దీగా ఉన్న బస్సులో దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడిన ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి దాదాపు 20 లక్షలకు పైగా వ్యూస్‌తో పాటు భారీగా షేర్ అయ్యింది. ఇక మహిళా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజలు కూడా భారీగా రియాక్ట్ అయ్యారు. దీనిపై దీపక్, అతని కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురయ్యారు. సదరు మహిళ కావాలనే దీపక్‌ను ఇరికించిందని ఆరోపించారు.

దీపక్ బలవన్మరణం
అప్పటికే చేయని తప్పుకు కుమిలిపోతున్న దీపక్.. ఓ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అతని బలవన్మరణంతో కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేరళ మానవ హక్కుల కమీషన్.. దీపక్ కేసును విచారించి నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షింజితా ముస్తఫాను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై సమాజం నుంచి రకరకాలుగా స్పందనలు వస్తున్నాయి.
తనూజ-కళ్యాణ్ రిలేషన్‌పై రీతూ షాకింగ్ కామెంట్స్.. అలా బిహేవ్ చేసే వాళ్లంటూ..
ఆడవాళ్లంతా రాక్షసులు కాదు
తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ శ్రీదేవి గోపీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీపక్ మరణానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసినందుకు సంతోషంగానే ఉంది. ఇలాంటి పని చేసినందుకు ఆ అమ్మాయిని కఠినంగా శిక్షించాలి. అయితే ఈ ఘటనను సాకుగా చూపించి మొత్తం మహిళా లోకాన్ని తప్పుబడుతున్నారు. అసభ్యంగా దూషిస్తున్నారు... కొందరు ఒంటికి అట్టముక్కలు, వైర్లు చుట్టుకుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆడవాళ్లను రాక్షసులుగా చిత్రీకరించొద్దని శ్రీదేవి అన్నారు.
42 కోట్లు రికవరీ చేయండి.. వివాదంలో శంకర వరప్రసాద్ కలెక్షన్లు.. హైకోర్టులో పిటిషన్
గర్భవతినైనా వదల్లేదు
మగవాళ్లయినా, ఆడవాళ్లయినా మంచోళ్లు ఉంటారు.. చెడ్డవాళ్లు ఉంటారు. దీపక్ ఘటన జరగడానికి ముందు కూడా 14 ఏళ్ల యువతిని 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఆడవాళ్లకు రక్షణ ఎక్కడుంది? తండ్రి, మామ, స్నేహితులు, అన్నదమ్ములు, తెలిసినవారి చేతిలో మహిళలు అఘాయిత్యానికి గురవుతున్నారు. చివరికి చిన్నారులను కూడా వదలడం లేదు. దీపక్ మరణానికి కారణమైన అమ్మాయిని కూడా రేప్ చేయాలంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇది దారుణమైన మానసిక స్థితి. నా వ్యక్తిగత జీవితంలోనూ నేను ఇలాంటివి అనుభవించాను. నేను 5 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్‌ని అన్న కనికరం లేకుండా కట్టుకున్న భర్తే నా మీద అత్యాచారం చేశాడని శ్రీదేవి గోపీనాథ్ బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
Credit: Filmibeat



Click it and Unblock the Notifications











