Latest Updates
-
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.!
Breaking: అఖండ 2 రిలీజ్ నిరవధికంగా వాయిదా.. బాలకృష్ణ మూవీ విడుదల వాయిదా ఎందుకంటే?
భారీ అంచనాలతో విడుదలకు సిద్దమైన అఖండ 2 చిత్రం రిలీజ్ నిరవధికంగా వాయిదా పడింది. తెలుగు ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్, నటరత్న నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే డిసెంబర్ 4 వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలంటూ ఎరోస్ ఇంటర్నేషన్ సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించడంతో వివాదంగా మారింది. రాత్రి వరకు ఎరోస్ సంస్థతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సినిమా నిరవధికంగా వాయిదా వేశారు.

అధికారికంగా 14 రీల్స్ ప్లస్ ట్విట్టర్‌లో తెలిపిన ప్రకారం.. భారమైన హృదయంతో అఖండ 2 సినిమా వాయిదా వేశామని తెలియచేయడానికి చింతిస్తున్నాం. కొన్ని పరిష్కరించలేని పరిస్థితుల కారణంగా ఈ సినిమాను నిర్ణీత సమయానికి రిలీజ్ చేయలేకపోయాం. మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి, అభిమానికి ఈ వాయిదా తీవ్ర నిరాశను కలిగించి ఉంటుంది. వారి పరిస్థితిని మేము అర్ధం చేసుకోగలం అని అన్నారు.
అఖండ 2 సినిమా రిలీజ్ చుట్టూ నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు మేము అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విపత్కర సమయంలో మీ సహకారం మాకు కొండంత బలం. ఈ సినిమా రిలీజ్ గురించి పాజిటివ్ అప్‌డేట్‌ను త్వరలోనే అందిస్తాం అని 14 రీల్స్ ప్లస్ తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఓవర్సీస్‌లో కూడా అఖండ 2 సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. సినిమా ప్రదర్శనకు కావాల్సిన కేడీఎం కూడా జారీ చేయలేదు. దాంతో నిరవధికంగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు సోషల్ మీడియాలో ట్రేడ్ అనలిస్టు వెంకీ పోస్టులు పెట్టారు.
Credit: Filmibeat



Click it and Unblock the Notifications
