Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
రైతులకు ప్రభుత్వం తీపి కబురు, సంక్రాంతి కంటే ముందే - ఖాతాల్లో నిధులు జమ..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైతులకు తీపి కబురు అందించింది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందే రైతులకు మరో పథకం అమలుకు సిద్దం అయింది. అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది. దీని ద్వారా సాగు చేసే రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. తాజా పథకాన్ని మరింతగా విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరో పథకం అమలు ప్రారంభించింది. ఈ నెల నుంచే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకు వస్తోంది. ఇందు కోసం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా రూ.101.83 కోట్లను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిసి అమలు చేయనుంది. కేంద్రం వాటాగా 60 శాతం ఇవ్వనుండగా.. 40 శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా రైతులకు సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు. వ్యవసాయ పనిముట్లపై 50 శాతం రాయితీ పొందవచ్చు. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు గరిష్టంగా వ్యవసాయ పనిముట్లపై 50 శాతం రాయితీ పొందే అవకాశముండగా.. ఇతర వర్గాలవారు 40 శాతం తగ్గింపు పొందవచ్చని అధికారులు వెల్లడించారు.
రైతులకు గుడ్ న్యూస్: పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం..!!

కాగా, ఇప్పటికే ఈ పథకం కింద లబ్ది పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5.50 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా.. 1.30 లక్షల మంది రైతులను తొలుత ఎంపిక చేశారు. వీరికి త్వరలో రాయితీ సౌకర్యం కల్పించనున్నారు. వ్యవసాయానికి అవసరమయ్యే వివిధ రకాల పనిముట్లపై ఈ రాయితీ దక్కనుంది. ప్రభుత్వం నిధులు కూడా జమ చేయడంతో తక్కువ ధరకే పనిముట్లు లభించడం వల్ల రైతులపై ఆర్దిక భారం తగ్గుతుంది.
అయితే.. గతంలో ప్రభుత్వమే యంత్రాలను కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. ఐదు ఎకరాల్లోపు పోలం ఉన్న చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. 15 రకాల పనిముట్లు సబ్సిడీ జాబితాలో పొందుపర్చారు. వీటిపై రైతులకు సబ్సిడీ దక్కనుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే రైతు వాటా మినహాయించి మిగతాది ప్రభుత్వం కంపెనీల అకౌంట్లోమ జమ చేస్తుంది. రూ.లక్షకు మించి కొనుగోలు చేసిన పరికరాలకు ప్రభుత్వం జియో ట్యాగింగ్ ఇవ్వనుంది.
Credit: Oneindia



Click it and Unblock the Notifications
